వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిడత ప్రేమ: ఆ వ్యామోహములో దుఃఖాలపాలవుతున్నాము!

|
Google Oneindia TeluguNews

ఈ ప్రేయో మార్గంలో జీవించే వారందరిలో కూడా వాళ్ళు దేహ రూపానికి మానవులే గానీ బుద్ధియందు మిడతల వంటి వారు అన్నమాట. అలాంటి మిడతల వంటి బుద్ధి కలిగినటువంటి వారికి ఆత్మజ్ఞాన విచారణ అబ్బదు. ఎక్కువ మందిని ఆకర్షించునటువంటి వారిని, ఎక్కువ మంది కోరుకునేవన్ని పుత్ర-పౌత్రులను, ప్రియమును కలుగజేయు స్త్రీలను, ధన కనక వస్తు వాహనములను, ఎన్నింటినో పొంది ఆ మాయచేత మాటి మాటికి ప్రలోభపడి, వాటినన్నిటిని వదలుకోలేక ఎక్కువ మంది సామాన్య మానవులు ధన కనక వస్తు వాహనములను సంపాదించవలెనని వ్యామోహములో పడి దు:ఖాల పాలవుతున్నారు.

ఎవరైతే అందులో ఉన్న దోషములను గుర్తించి జీవించిన వారి జన్మ ధన్యము అగును. సంసారిక సుఖములకు లోబడని వారే ఆత్మ జ్ఞానమునకు అర్హులు.

Human love is like grasshopper

ఎక్కువమంది ఆకర్షించబడేది అంటే నూటికి 90 శాతం మంది ఈ ప్రేయోమార్గంలోనే వుంటారు. ఏమిటయ్యా నీ జీవిత లక్ష్యము అనగా పుత్రులను పొందుట, పౌత్రులను పొందుట, ప్రియమైనవారిని పొందుట, బంధువులను కలిగివుండుట, అందరికీ ఇష్టులుగా జీవించుట, ఆ ఇష్టము అనేటటువంటి ప్రియా ప్రియములతో ఏ రకమైన వస్తుసంచయము "స్త్రీ బాలాంధ జడోపమాస్వహమితి భ్రాంతా భృశంవాదినః "అనేటటుంటి పద్ధతిగా ధన కనక వస్తు వాహన స్త్రీ ప్రియత్వము చేత ప్రేరణ పొందుతూ ప్రేరేపించబడుతూ ప్రేరేపిస్తూ పునః పునః పునః కర్మ చక్రము నందు తగులుకొని, కర్మబంధము చేత బాధించబడుతూ, అజ్ఞానబంధము చేత బాధించబడుతూ "నేనెవరు?" అనేటటువంటి ప్రశ్నను ఆశ్రయించక కేవలము బాహ్య జీవనమునే జీవనముగా భావించి, అట్టి జీవనమును ఎప్పుడైతే మనం పొందుతూ ఉన్నామో, ఆ జీవనము మనకు వృధా అయినటువంటి జీవనము.

అటువంటి వృధా అయినటువంటి ఈ మానవ జన్మ తిరిగి మళ్ళీ మానవ జన్మనే పొందుతావా అంటే సృష్టి ధర్మములో అలాంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మానవుడవై పుట్టిన తరువాత మానవ బుద్ధితో కాకుండా ఎనుబది నాలుగు లక్షల జీవరాశులకు సంబంధించినటువంటి బుద్ధిరూపమైనటువంటి జ్ఞానమును నీవు సముపార్జించి ఉన్నప్పటికీ ఆ యా జీవుల యొక్క ప్రభావం నీలో బలంగా ఉంటుంది. కొంతమందికి ఊ అంటే కోపం వస్తుంది, ఆ అంటే కోపం వస్తుంది. కస్సుబుస్సులాడుతూ వుంటారు.

వాళ్లలో పాములకి సంబంధించినటువంటి వాసనా బలం మిగిలివుంటుందనమాట. కొంతమందిలో పులుల వలె గాండ్రిస్తూ వుంటారు. ఎవరిలో ఏ రకమైన గత జన్మ వాసనా బలం మిగిలి ఉందో ఆయా పద్ధతులలో వారి ప్రవర్తన ఉంటుంది. కొంతమందిలో ఏనుగువలే ఘీంకరిస్తూ వుంటారు. ఆవేశం వస్తే వాడిని పట్టుకోవడం చాలా కష్టం. ఆ మదం చాలా బలంగా వుంటుందనమాట. ఆ ధన మదం గానీ, విద్యామదం గానీ, రూపమదం గానీ, అష్ట విధమదములు ఏవైతే వున్నాయో ఆ మదములన్నీ బలంగా పనిచేసినప్పుడు, ప్రపంచమునే లెక్కచేయనటువంటి పద్ధతిగా మారతారనమాట. అటువంటివారు ప్రపంచ యుద్దాలకి కూడా కారణమైన సందర్భాలు వున్నాయనమాట.

అలాంటివారందరిలో ఆ మదపుటేనుగు లక్షణం వుంటుందనమాట. వారిలో, ఆ మానవులై వున్నప్పటికీ కూడా, వారిలో ఆ అహంకారము, ఆ మదము అతితీవ్రమైనటువంటి వేగంతో సంచరిస్తూ సమాజానికి కూడా మానవజాతికి కూడా నష్టాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ వుంటాయ్. మరి ఇటువంటి ప్రలోభాలు ఎన్నో మానవజన్మలో వున్నాయి.

English summary
Grasshoppers are an informal group of insects in the suborder Caelifera.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X