22న కాలాష్టమి... కటిక పేదలు కూడా కోటీశ్వరులవుతారు
పరమ శివుడి దగ్గర ఉండే కాలభైరవుడు అత్యంత శక్తిమంతుడు. మన తెలుగు రాష్ట్రాల్లోకన్నా ఉత్తరాది రాష్ట్రాల్లో కాలభైరవుణ్ని ఎక్కువగా పూజిస్తారు. కాలభైరవుడు అంటే ఎవరోకాదు.. పరమేశ్వరుడి ఉగ్రరూపమే. ప్రతి సంవత్సరం నవంబరులో కాలాష్టమి వస్తుంది. మార్గశిర మాసం శుక్లపక్ష అష్టమి తిథి జరుపుకోవాలని పండితులు సూచిస్తుంటారు. ఆ తిథి ఈనెల 22వ తేదీ సాయంత్రం నుంచి ప్రారంభమై 23వ తేదీ రాత్రి 7.56 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో కాల భైరవుణ్ని పూజించడంతోపాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే అనేక లాభాలున్నాయి. కొన్ని పరిహారాలు పాటించడంవల్ల కాలభైరవుడి అనుగ్రహం లభిస్తుంది. సమస్యలన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. కటిక పేదలు కూడా కోటీశ్వరులవుతారు. ఆరోజు ఏం చేయాలో తెలుసుకుందాం.
ఈ మంత్రాన్ని పఠించాలి
కాలాష్టమి రోజు కాలభైరవుడి "ఓం క్లీం కాళికాయై నమః" అనే మంత్రాన్ని ఉదయం పఠించాలి. దీనివల్ల కష్టాలన్నీ గట్టెక్కడంతోపాటు ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

ఆవనూనె దీపం వెలిగించాలి
ఆరోజు ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఇది చాలా మంచి చేస్తుంది. కాలభైరవుడి ముందు ఆవనూనె దీపాన్ని వెలిగించి కోరికలు కోరుకుంటు అవన్నీ సులభంగా నెరవేరతాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
నల్ల నువ్వుల దానం
శనిదేవుడికి ఎంతో ఇష్టమైన నల్ల నువ్వులను దానంగా ఇవ్వడం వల్ల కాలభైరవుడు సంతృప్తి చెందుతాడు. దీనివల్ల పాపాలన్నీ తొలగిపోతాయి. మోక్షం లభిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
నల్ల కుక్కకు రొట్టెలు తినిపించాలి
కాలభైరవుడి వాహనం నల్ల కుక్క. ఆరోజు నల్ల కుక్కకు రోటీలు తినిపించడంవల్ల అనేక లాభాలున్నాయి. రోటీలు అందుబాటులో లేకపోతే బ్రెడ్ ను కూడా తినిపించవచ్చు. ఏది అందుబాటులో ఉంటే అది తినగలిగేది పెట్టినా చాలు.
ఇనుప వస్తువులను దానం చేయడం
22వ తేదీ సాయంత్రంకానీ, 23వ తేదీనకానీ కాల భైరవుడిని పూజించి ఇనుప వస్తువులు దానం చేయడంవల్ల శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది. కొన్నాళ్ల నుంచి వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎటువంటి పనుల్లోనైనా సులభంగా విజయం దక్కుతుంది.












Click it and Unblock the Notifications