vastu tips: ఇంట్లో డబ్బు కోసం ఈ 5 పాటించండి.. మీరే మహారాజులు

సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు గానీ, ఉన్న ఇంట్లో సర్దుబాట్లు చేసుకునేటప్పుడు గానీ 'వాస్తు'కు మనదేశంలో ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. సరైన వాస్తు నియమాలు పాటించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి, సానుకూల శక్తులు పెరుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు, ఇంట్లో సంపద పెరగాలనుకునే వారు వాస్తు నిపుణుల సూచనల ప్రకారం కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే త్వరలోనే మంచి ఫలితాలు అందుకుంటారని వాస్తు శాస్త్రం చెబుతోంది.

కుబేరుడి స్థానం.. ఉత్తర దిక్కు!

వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశను సంపదకు అధిపతి అయిన 'కుబేరుడి' దిక్కుగా భావిస్తారు. కాబట్టి, మీ ఇంట్లో డబ్బులు దాచుకునే బీరువా లేదా లాకర్‌ను ఎల్లప్పుడూ ఉత్తర దిక్కున ఉండేలా ఏర్పాటు చేసుకోండి. ఈ దిశ నుంచి వచ్చే సానుకూల తరంగాలు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఎంతో సహాయపడతాయి.

Vastu tips Follow these 5 tips for money at home and you will live like kings

ప్రత్యామ్నాయంగా తూర్పు దిశ!

ఒకవేళ మీ ఇంట్లో స్థలాభావం వల్ల లేదా మరేదైనా కారణం చేత ఉత్తర దిశలో లాకర్ పెట్టడం కుదరకపోతే.. దానికి ప్రత్యామ్నాయంగా తూర్పు దిశను ఎంచుకోవచ్చు. తూర్పు దిక్కున డబ్బును భద్రపరచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, సంపద వృద్ధి చెందుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ ద్వారానికి ఎదురుగా లాకర్లు వద్దు!

ఇంటి నిర్మాణ సమయంలో లేదా ఫర్నిచర్ సర్దుకునేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీ ఇంటి సింహద్వారం తెరిచినప్పుడు, లోపల ఉన్న ధనలక్ష్మి బీరువా గానీ, డబ్బులు పెట్టే లాకర్ గానీ నేరుగా బయటకు కనిపించకూడదు. అలా కనిపించడం వాస్తు రీత్యా మంచిది కాదు. దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లో నిలవదని నమ్ముతారు.

పర్సు లేదా లాకర్‌ను ఎప్పుడూ ఖాళీగా ఉంచకండి!

మీరు రెగ్యులర్‌గా వాడే పర్సు అయినా లేదా ఇంట్లోని సేఫ్ లాకర్ అయినా సరే.. ఎప్పుడూ పూర్తిగా ఖాళీగా ఉంచకూడదు. అందులో ఎంతో కొంత నగదు ఎల్లప్పుడూ ఉండేలా చూసుకోవాలి. ఖాళీ పర్సు దరిద్రానికి సూచికగా మారుతుంది.

పరిశుభ్రతే పరమావధి!

"స్వచ్ఛత ఎక్కడ ఉంటుందో.. లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుంది". మీరు డబ్బులు దాచే ప్రదేశం, బీరువాలు ఎప్పుడూ దుమ్ము ధూళి లేకుండా అత్యంత పరిశుభ్రంగా ఉండాలి. అపవిత్రమైన లేదా గజిబిజిగా ఉన్న చోట డబ్బులు పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి, తీవ్ర ఆర్థిక నష్టాలు వచ్చే ప్రమాదం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+