సువేందుపై కలకత్తా హైకోర్టుకు మమత..! టీఎంసీ సంక్షోభం వేళ..!
బెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ దెబ్బకు ఓవైపు తృణమూల్ కాంగ్రెస్ కుదేలవుతోంది. అంతర్గత తిరుగుబాట్లతో చీలిక దిశగా పయనిస్తోంది. అధికారికంగా టీఎంసీ మమతా బెనర్జీ (Mamata Banerjee) చేతుల్లో ఉండే అవకాశాలు కూడా కనిపించడం లేదు. వేరు కుంపటి పెట్టుకుంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు రేపు తమదే అసలైన టీఎంసీ అని కోర్టుకెక్కేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సీఎం సువేందు అధికారి (Suvendu Adhikari)పై మమతా బెనర్జీ కోల్ కతా హైకోర్టును ఆశ్రయించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ సీటు నుంచి పోటీ చేసి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలైన మమతా బెనర్జీ.. ఈ ఫలితాన్ని సవాల్ చేస్తూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈ కేసు విచారణకు మమత స్వయంగా హాజరయ్యారు. ఈ కేసును మమతకు విధేయుడైన తృణమూల్ ఎంపీ, లాయర్ కళ్యాణ్ బెనర్జీ వాదిస్తున్నారు. ఇవాళ విచారణపై కళ్యాణ్ బెనర్జీ స్పందించారు.

సువేందు అధికారి ఎన్నికను సవాలు చేస్తూ మమతా బెనర్జీ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను ధృవీకరించడానికి ఆమె ఈ రోజు కలకత్తా హైకోర్టుకు వచ్చారని కళ్యాణ్ బెనర్జీ తెలిపారు. ఆ ఎన్నిక సక్రమంగా జరగలేదని, 12 రౌండ్ల తర్వాత, మమతను , ఆమె ఎన్నికల ఏజెంట్‌ను కొట్టి బయటకు పంపేశారని తెలిపారు. అసలు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ (RO) ఎవరు? 2021 నందిగ్రామ్ ఎన్నికల్లో ఆయనే ఆర్వోగావ్యవహరించారు. మళ్లీ ఇప్పుడు ఆయనే ఆర్వోగా వచ్చారు. ఆ తర్వాత, ఆయనను ముఖ్యమంత్రికి డిప్యూటీ సెక్రటరీగా నియమించారు, ఎన్నికలైన వెంటనే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని చీఫ్ సెక్రటరీగా నియమించారని కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. వారిపై అనేక ఆరోపణలు ఉన్నాయని, అలాగే వారు పక్షపాతం చూపించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.














Click it and Unblock the Notifications