డబ్బు మిగలకపోగా అప్పుల పాలవుతున్నారా?
అప్పుల బాధలు తీరి మనం సంతోషంగా ఉండాలంటే, మనం సంపాదించిన డబ్బు నిలబడాలంటే కొన్ని వాస్తు పరిహారాలు చేయాలి. ఈ వాస్తు పరిహారాలతో కచ్చితంగా కొంతమేర అప్పుల బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉదయం నిద్ర లేవగానే రెండు అరచేతులను దగ్గరగా తీసుకొని కళ్ళకు అద్దుకొని అరచేతులను చూసుకున్నట్లయితే శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ధన నష్టం జరగకుండా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
డబ్బు సమస్యలు తొలగిపోయే మార్గాలు
అంతేకాదు ప్రతిరోజు సాయంత్రం పూట ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల అప్పుల బాధలు తీరుతాయని, చీమలకు చక్కెర తినిపించడం వల్ల సంపాదనలో స్థిరత్వం వస్తుందని చెబుతున్నారు. వ్యాపారాలు చేసే వారికి లాభసాటిగా మారుతుందని సూచిస్తున్నారు. లక్ష్మీదేవికి ప్రతిరోజు నేతితో దీపం పెడితే డబ్బు సమస్యలు తొలగిపోయి అప్పుల బాధలు తీరుతాయని చెబుతున్నారు.

లక్ష్మీ కటాక్షం కావాలంటే ఇలా చెయ్యాలి
ఐదు గురువారాలు ఆవు నెయ్యితో పసుపు వత్తులతో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకధారా స్తోత్రాన్ని చదివితే అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పీచు తీసిన కొబ్బరికాయను కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి మొక్కుకొని అప్పుల బాధలు తీరాలని కోరుకుంటూ నీళ్లలో కొబ్బరికాయలు జారవిడిస్తే ఖచ్చితంగా అనుకున్న కోరిక తీరుతుందని చెబుతున్నారు.
అప్పుల బాధలకు ఇవి చేస్తే చెక్
ప్రతి బుధవారం పాలతో చేసిన పరమాన్నాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే కూడా లక్ష్మీదేవి దయతో రుణ బాధలు తొలగిపోతాయని సూచిస్తున్నారు ప్రతి బుధవారం రోజు రెండు ఖాళీ కుండల్లో కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేస్తే అప్పుల బాధలు తీరిపోతాయని ఇలా ఆరు వారాలపాటు చేస్తే సత్ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.
అందరూ తెలుసుకోవాల్సింది ఇదే
అప్పుల బాధలు తీరాలంటే ఇవి వాస్తు నిపుణులు సూచిస్తున్న వాస్తు పరిహారాలు మాత్రమే. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది కష్టపడి సంపాదించిన డబ్బును ప్రణాళిక బద్ధంగా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని అప్పు చేయకుండా ఉంటేనే మంచిది. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తేనే అప్పుల పాలవుతాం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications