వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశ్వీయుజ దీపావళి - కార్తీక దీపదానం

By Pratap
|
Google Oneindia TeluguNews

చంద్రుని కదలికలననుసరించి ఏర్పడేవి మాసాలు .ఉదాహరణకి కృత్తికానక్షత్రం పౌర్ణమినాడు వస్తే ఆనెలకి కార్తీకమాసం అని, చిత్త నక్షత్రం పౌర్ణమినాడు వస్తే ఆనెలకి చైత్రమాసం అనిఅంటారు.ఇలా రాని నెలని శూన్యమాసం అంటారు.భారతీయమైన ప్రతీ పండుగ వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అని మూడు వేర్వేరు పనులు, వేర్వేరు ఫలితాలు ఉండటం సాధారణమైన అంశం.

అలాగే ఈసంవత్సరం నవంబర్‌లోని పండుగలు విశేషాన్ని సంతరించుకొని మన ముందుకి వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం.

దీపావళిపండుగకథ

రక్షసుడైన నరకుని కృష్నుడు సత్యభామాసమేతంగా నిర్జించటం ఈ రోజే జరిగింది-విష్ణుపురాణం, భాగవతం ప్రకారం.

అసురరాజైన బలిని మూడడుగుల భూమిని యాచించి.విరాడ్రూపుడై బలిని రాక్షసులని రసాతలానికి వామనమూర్తి ఈనాడే పంపాడు - భాగవతం ప్రకారం.

విజయదశమిన రావణ సంహారంచేసి తిరిగి అయోధ్యకి చేరుకున్న రాముడు పట్టాభిషిక్తుడైన రొజు ఇదే రోజు - రామాయణం ప్రకారం.

విక్రమార్కశకం ప్రారంభమైన దినం ఇదేరోజు.

- మరొక ముఖ్యమైన విషయం - నరక చతుర్దశి పదంలో నరక అనే పదానికి మరణానంతర నరకం అని కూడా వేరొక అర్థం ఉంది. ఆ నరకాన్నుండి విముక్తికోసం దిపదేవతని ప్రార్థించడం సంప్రదాయం.

శ్లో||చతుర్దశ్యాంతు యేదీపాన్‌ నరకాయదదంతిచ.
తేషాం పిత్రృగణాస్సర్వే నరకాత్‌స్వర్గమాప్నుయాత్‌ అని ధర్మశాస్త్రం - అంటే దీపావళినాడు దీపాలు వెలిగించినవారికి పితృదేవతలకి నరక విముక్తి. జరుగుతుంది అని అర్థం. ఇలా ప్రార్థించవలసినది ఈ రోజే.

Importance of Deepavali festival

దీపావళి- ధనలక్ష్మీపూజ, 11నవంబర్‌, బుధవారం

ఆశ్వీయుజమాసంలో చివరి తిథి అమావాస్య. ఆ రోజుచేసే పూజ దీపావళీ ధనలక్ష్మీ పూజ.

పూజావిధానం-(ముఖ్యంగా ఆఫీస్‌లు, వ్యాపారస్తులు చేసే విధానం)

ముందురోజు వస్తువులు, గదులు, కౌంటర్‌ని శుభ్రపరచుకోవాలి. దీపావళి పండుగ నాడు ఉదయం, తలస్నానం చేయాలి, సాయంకాలం సంప్రదాయ దుస్తులు ధరించి. ఇంట్లోఐతే ఈశాన్య దిక్కున, షాప్‌కానీ, ఆఫీస్‌కానీ ఐతే కౌంటర్‌కి, దగ్గరగా పూజించాలి. సాయంకాలం దీపాల కాంతుల వరుసతో ఇంటిని అలంకరించుకోవాలి. కలశం, పటం ఈరెండింటినీ పూజించాలి.ధనాన్ని పూజలో అమ్మవారి దగ్గర ఉంచాలి.
తామరపూలు, తామర గింజలు, మారేడు దళాలు పూజకి వాడితే చాలా మంచిది.

శ్రీసూక్తం, లక్ష్మీష్టోత్తరం(108నామాలతో) పూజించాలి, పూజలోభాగంగా కౌంటర్‌, బిల్‌బుక్‌, విసిసిటింగ్‌ కార్డ్‌, ముఖ్యమైన కాగితాలు పూజలో ఉంచి అమ్మవారిని పూజించాలి. పాయసం మొదలైన పిండివంట చేయటం అమ్మవారికి నివేదించి దానాలు చేయటం లక్ష్మీప్రదం.

కార్తీక మాసం - వ్రతాలు, దీపదానాలు

కార్తికమాసం ఈనెల,12 నుండి మొదలవుతుంది.

ఈనెలలో చేసే ప్రధానమైన పనులు

ఉధయమే చన్నీళ్లతో తలస్నానంచేయటం.
విష్ణు,శివసంబంధ స్తోత్ర పారాయనాదులు చేయటం.
కార్తీక పౌర్ణమినాడు స్యనారాయణ వ్రతం చేస్తారు
కార్తీక మాసంలో ఏదైనా సోమవారం కేదరేశ్వర వ్రతాన్ని చేయవచ్చు.ముఖ్యంగా 23వతేదీన చేయవచ్చు.
నెలలోని 30రోజులూ కార్తీక పురాణం కానీ, భాగవతంకానీ, శివ విష్ణు సంబంధ కథల పారాయణం కానీ, పురాణ పఠనంకానీ చేయాలి.

నెలలో దానం చేయదగిన వస్తువులు

నెయ్యిదీపం - బ్రాహ్మణులకి పండ్లు, కూరగాయలు, పాలు - అనాథాశ్రమంలో పిల్లలకి; వస్త్రాలు కొత్తవైనా, వాడిన వస్త్రాలైనా - కాయకష్టం చేసే కూలీలకి; దేవాలయంలో - అభిషేక, అలంకార వస్తువులు; విద్యార్థులకి - పుస్తకాలు, స్లూఖీ బట్టలుమొదలైనవి; నిత్యావసర వస్తువులెవరైనా ఏవరికైనా దానంచేయవచ్చు. తద్వారా పుణ్యఫలితాన్ని పొందవచ్చు. దానం చేసేటపుడు చెప్పవలసిన మాట.
''మమ పురుషార్థ ఫలసిధ్ధ్యర్థం కార్తీక దామోదర స్వరూపీ ఇదందానం తుభ్యమహం సంప్రదదే నమమ'' అని చెప్పాలి.

English summary
The importance of the Hindu festival Deepavali explained.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X