రాజ్యసభ లెక్క మార్చే ఎన్నికలు-క్రాస్ ఓటింగ్ లో కాంగ్రెస్..! మెజార్టీ దిశగా ఎన్డీయే..!
ఈ నెలాఖరులో జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలకు (Rajya Sabha Eletion) ఇవాళ నోటిఫికేషన్ వెలువడింది. రాజ్యసభలో ఖాళీ అవుతున్న 25 సీట్లకు ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈసారి రాజ్యసభ ఎన్నికలతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరింత బలపడటం ఖాయంగానే కనిపిస్తున్నా.. గెలిచే అవకాశం ఉన్న సీట్లలో సైతం విపక్ష కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓటింగ్ కారణంగా నష్టపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. దీంతో ఈసారి రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి.
నిన్న రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో రాజ్యసభ ఎన్నికల కోసం పార్టీ వ్యూహంపై చర్చించారు. బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమి ఎన్డీఏ, ఈ సారి ఎన్నికల్లో తమ రాజ్యసభ సీట్ల సంఖ్య 150 దాటి, మూడింట రెండు వంతుల మెజారిటీకి చేరువవుతుందని గట్టి నమ్మకంతో ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో ఆ కూటమికి 148 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 25 సీట్లకు గాను బీజేపీ 17-18 సీట్లు గెలుచుకుంటుందని అంచనా.

ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌పై లో మూడు సీట్లకు ఈసారి పోటీ జరగనుండగా.. కాంగ్రెస్‌కు ఒక సీటు గెలవడానికి సరిపడా మద్దతు మాత్రమే ఉంది. కేవలం ఆరు అదనపు ఓట్లు కలిగి ఉన్న కాంగ్రెస్ కు క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కర్నాటక నుంచి వచ్చే 3 సీట్లలో ఒక దాని నుంచి తిరిగి రాజ్యసభకు వెళ్లడం లాంఛనమే. రాజస్థాన్ లో బీజేపీకి రెండు , కాంగ్రెస్ కు ఒక సీటు దక్కనుంది. గుజరాత్ లో కాంగ్రెస్ కు ప్రస్తుతం ఉన్న 12 సీట్లతో శక్తి సింగ్ గోహిల్ స్ధానాన్ని నిలబెట్టుకోవడం అసాధ్యం. జార్ఖండ్ లో ఖాళీ అయ్యే 2 సీట్లలో జేఎంఏం ఒకటి తీసుకుని, మరొకటి కాంగ్రెస్ కు ఇచ్చే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications