కొత్త సంవత్సరంలో వీరికి సంపదల ఖజానా.. మాట తప్పమన్న గురు, శుక్రులు!
వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా అనేక శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాలు అన్ని రాశుల వారి జీవితాలలో సానుకూల, లేదా ప్రతికూల ప్రభావాలను ఇస్తున్నాయి. ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న బృహస్పతి వచ్చే సంవత్సరం తన స్థానాన్ని మార్చుకొని మిధున రాశిలో సంచారం చేయబోతున్నాడు. ఆపై శుక్రుడు మిధున రాశిలోకి జులై 2025లో వస్తున్నాడు.
గజలక్ష్మీ రాజయోగం
ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అద్భుత యోగం ఏర్పడుతుంది. మిధున రాశిలో 12సంవత్సరాల తర్వాత జూలై నెలలో గురు, శుక్రుల కలయికతో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారి పంట పండుతుంది. . గజలక్ష్మి రాజయోగం కారణంగా లబ్ధి పొందే రాశుల వివరాలలోకి వెళితే

మిధున రాశి
మిధున రాశి వారికి గజలక్ష్మి రాజయోగం అదృష్టాన్ని ఇస్తుంది. మిధున రాశి జాతకులు ఈ సమయంలో శుభవార్తలను వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి ఇది మిధున రాశి వారికి శుభ సమయం.చేసే ప్రతి పనిలోనూ విజయాలు వరిస్తాయి.
సింహరాశి
గజలక్ష్మి రాజయోగం కారణంగా సింహ రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సింహరాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో బాగుంటుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు కూడా వెళతారు.
తులారాశి
తులా రాశి వారు గజలక్ష్మి రాజయోగం కారణంగా మంచి ప్రయోజనాలను పొందుతారు. తులారాశిలో ఉన్న ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వస్తాయి. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. సాహోద్యోగుల మద్దతు లభిస్తుంది.ఈ సమయంలో అదృష్టం తులా రాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications