వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2015 జాతకచక్రం: వార్షిక రాశిఫలాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

ఈపలితాలు స్పష్టతకాదు మీజాతకానికి ఇదిసహకరించే అనుకూల సమయ సూచన మాత్రమే (ఇందులో అనుకూల ఫలితాలు రానందుకు ,మీ మీ జాతకాలలో యోగావయోగాలను పరిశీలించుకోవాలి, ఇందులో ఉండే ప్రతికూలఫలితాలకు మీజాతకాలలోని మంచిదశ,యోగాలు మీకు ఇబ్బందులనుండి దూరంగా ఉండటానికి జాగ్రత్తపడవచ్చు) మీజాతకం 70% గోచారం అంటే ఈరాశిఫలాలు 30% గా సహకరిస్తాయి.

 మేషం రాశివారు (అశ్విని4పాదాలూ,భరణి 4పాదాలూ,కృత్తిక1 వపాదము )

మేషం రాశివారు (అశ్విని4పాదాలూ,భరణి 4పాదాలూ,కృత్తిక1 వపాదము )

సంవత్సరం మొదటినుండి జూన్‌ 19 వరకు గురుడు చతుర్థ స్థానం లో ఉండటంవలన కష్ట నష్టములు కలుగుతాయి, బంధుజనులతో విరోధము ఏర్పడుతుంది గౌరవానికి భంగము. మాటవిలువ తగ్గుట జరుగును. జూన్‌ 20 నుండి సంవత్సరాంతంవరకు గురుడు పంచమ స్థానంలో ఉండటంవలన మిక్కిలి అనుకూల స్థానం. ఐశ్వర్యము పొందుతారు, రాజానుగ్రహము పెద్దలఅనుగ్రహం పొందుతారు, శుభ కార్యములు ఆచరించుట వంటి అనుకూల ఫలితములు, కలుగును.సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు శని అష్టమ స్థానంలో ఉండటంవలన అష్టమ శని తీవ్ర దోష ఫల దాత, అపమృత్యు భయము, రోగబాధ, ధనవ్యయము,
సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు రాహువు షష్ఠ స్థానం:లో ఉండటంవలన రాహు, కేతువులు షష్ఠస్థాన చలన కాలమందు మిక్కిలి అనుకూల ఫలదాతలు, తెలివిగా వ్యవహారములు చక్కబెట్టుట, ఎల్లప్పుడూ సుఖము, శత్రు వర్గము నుండి భూలాభము వంటి మంచి ఫలితాలనిస్తారు. సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు కేతువు ద్వాదశ స్థానం లో ఉండటంవలన: రాహుకేతువుల 12వ స్థానం చలనం అశుభ ఫలితములిచ్చును. అనవసర ప్రయాణాలు వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. పోటీపరోక్షలలో మంచివిజయం సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్‌లు పొందుతారు.సంతానభాగ్యం కలుగుతుందిఉద్యోగంలో కొంత ఉన్నతి కలుగుతుంది ,మాటవిలువ తగ్గుట,మిత్రులవల్ల మోసపోవుట,అప్పుల ఇబ్బందులు కలుగుతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది, జీర్ణసంబంధ వ్యాధులుంటయి,వాహనవిషయాలలో ,ప్రయాణాలవిషయంలో జాగ్రత్తవహించాలి
చేయవలసిన పరిహారాలు` శని,రాహు గ్రహాలకు శాంతి పరిహారాలు,దానాలు చేసుకోండి.

 వృషభ రాశివారు (కృత్తిక 2,3,4 పాదాలూ ,రోహిణి 4పాదాలు, మృగశిర 1,2 పాదాలు)

వృషభ రాశివారు (కృత్తిక 2,3,4 పాదాలూ ,రోహిణి 4పాదాలు, మృగశిర 1,2 పాదాలు)

సంవత్సరం మొదటినుండి జూన్‌ 19 వరకు గురుడు తృతీయ స్థానంలో ఉండటంవలన తీవ్ర వ్యతిరేక ఫలదములు పొందుతారు. వివాదములు ఏర్పడుతాయి, ఎక్కువ శ్రమచేయవలసి వస్తుంది, వ్యాపారంలో నష్టము ఏర్పడుతుంది, అన్నిపనుల్లో అవాంతరములు కలుగుతాయి,
జూన్‌ 20 నుండి సంవత్సరాంతంవరకు గురుడుచతుర్థ స్థానం లో ఉండటంవలన కష్టనష్టములు కలుగుతాయి, దైన్యత కలుగుతుంది, బుద్ధి నిలకడగా వుండదు, గౌరవానికి భంగము.మాటవిలువ తగ్గుట జరుగును. సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు శనిలో ఉండటంవలనసప్తమ స్థానం: ఏడవ రాశియందు శని సంచరించు స్థానమున రోగమును, దేశాంతర ప్రయాణమును, గొప్పభీతిని, ద్రవ్యనాశనమును, హృదయ తాపమును, భార్యాబిడ్డలకు అనారోగ్యము, వేదన కల్పించును.
సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతం వరకు రాహువుపంచమ స్థానంలో ఉండటంవలన సంతాన సౌఖ్యలోపము, పుత్రులతో విరోధము, అనుకూల ఫలితములు కూడా కలుగును. సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు కేతువు ఏకాదశ స్థానంలో ఉండటంవలన: లాభస్థానం పశులాభం, ధనలాభం, నూతన వస్తు ప్రాప్తి, ఆహార సౌఖ్యం, పరిమళ ద్రవ్యాలు వంటి అనుకూల ఫలితాలు కలుగును. ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడతాయి, స్థితి నాశము.అనారోగ్యం కలుగుతుంది,అధికారం,గౌరవం తగ్గుతుంది, సంవత్సరం చివర్లో ఉద్యోగం,వివాహం,సంతాన పరంగా లాభం పొందుతారు.జూన్‌ తర్వాత రాయబడే పోటీపరీక్షలకు మంచి ఫలితం పొందుతారు.

 మిథున రాశివారు (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర 4పాదాలు ,పునర్వసు 1,2,3పాదాలు)

మిథున రాశివారు (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర 4పాదాలు ,పునర్వసు 1,2,3పాదాలు)

సంవత్సరం మొదటినుండి జూన్‌ 19 వరకు గురుడు ద్వితీయ స్థానంలో ఉండటంవలన: శుభఫలస్థానం ఫలితాలు వర్తిస్తాయి. అన్నివిధాలా అభివృద్ధి పొందుతారు , సర్వ సుఖములు కలుగుతాయి ,శత్రువులు తగ్గుతారు, అధికారపెరుగుతుంది , ధర్మకార్యములు చేస్తారు. జూన్‌ 20 నుండి సంవత్సరాంతంవరకు గురుడు తృతీయ స్థానం లో ఉండటంవలన తీవ్రవ్యతిరేక ఫలదములు పొందుతారు. వివాదములు ఏర్పడుతాయి, చేసే పనులకు హాని జరుగుతుంది, అధికారం,గౌరవం తగ్గుతుంది, అన్నిపనుల్లో అవాంతరములు కలుగుతాయి, సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు శనిలో ఉండటంవలనషష్ఠ స్థితి: శని ఆరవరాశి యందు సంచరించు కాలమున ధనధాన్య అభివృద్ధి, బంధు మూలక సంతోషము, స్త్రీ సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, శత్రుక్షయము, సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతం వరకు రాహువుచతుర్థ స్థానంలో ఉండటంవలన: బుద్ధిబలలోపం, అనవసర ప్రయాణములు, వాత వ్యాధులు, స్త్రీ కలహం, కార్యవిఘ్నం కలుగును.
సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు కేతువు దశమ స్థానంలో ఉండటంవలన: దశమ స్థానంలో వీరు శుభ ఫలదాతలు. కర్మసిద్ధి బలంగా ఉండటం, ఆనందం కలుగుతుంది. ఇల్లు కట్టుట జరుగుతుంది, స్థితి నాశము.అనారోగ్యం కలుగుతుంది,వ్యాపారంలో నష్టము ఏర్పడుతుంది, ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడతాయి, ప్రమోషన్లు పొందటానికి అవకాశంవుంది,సర్వతో ముఖాభివృద్ధి కలుగును.పోటీపరీషల విద్యార్థులకు కొంతలో అవకాశాలు చేజారుతాయి. చేయవలసిన పరిహారాలు ` రాహు,కేతువు,గురు గ్రహానికి

 కర్కాటక రాశివారు (పునర్వసు 4 వపాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

కర్కాటక రాశివారు (పునర్వసు 4 వపాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

సంవత్సరం మొదటినుండి జూన్‌ 19 వరకు గురుడుచంద్ర స్థితరాశిలో ఉండటంవలన వ్యతిరేక ఫలప్రదము పొందుతారు. ధన నష్టము కలుగుతుంది, బంధువులతో విరోధముఏర్పడుతుంది, ఇతరులతో విరోధములు ఏర్పడతాయి, దూర ప్రయాణములుచేస్తారు , అవమానం పొందుతారు, అధికారులకోపం పొందుతారు, అదృష్టం తగ్గుతుంది, జూన్‌ 20 నుండి సంవత్సరాంతంవరకు గురుడు ద్వితీయ స్థానంలో ఉండటంవలన :శుభఫలస్థానం ఫలితాలు వర్తిస్తాయి.మనసులోఆనందము పొందుతారు, అన్నివిధాలా అభివృద్ధి పొందుతారు , ధర్మకార్యములు చేస్తారు, మాటకు గౌరము వస్తుంది.
సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు శనిపంచమ స్థానంలో ఉండటంవలన: శని పంచమ రాశి యందు చలించు సమయమున కార్యములు చెడుటజరుగుతుంది, మనస్తాపము కలుగును, దాయాదులతో వ్యాజ్యములు(న్యాయసంబంధ చర్చలు,గొడవలు జరుగుతాయి), సంసారమునకు దూరమగుట వంటి ప్రతికూల ఫలితములు కలుగును. సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు రాహువుతృతీయ స్థానంలో ఉండటంవలన: తృతీయ స్థానములో శుభ ఫలదాతలు,ధనలాభము, సౌభాగ్యం వంటి అనుకూల ఫలితాలతో పాటు భాతృద్వేషము కల్పిస్తాడు. సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు కేతువు నవమ స్థానంలో ఉండటంవలన: నవమ స్థానంలో రాహు కేతు చలనం ప్రతికూలమైనది. దురదృష్టము, ప్రయాణాలలో ఇబ్బందులు, పశు నష్టం ధనధాన్య నష్టం వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. నిద్యోగులకు మంచి కాలం,ఉద్యోగం పొందుతారు,ప్రమోషన్లు పొందటానికి అవకాశంవుంది,సంతానభాగ్యం కలుగుతుందివివాహానికి అనుకూల కాలంఉద్యోగం చేసేచోట గొడవలు తలెత్తుతాయి,ఇంట్లో కల్లోలములు ఇబ్బందులు కలుగుతాయి,

సింహం రాశివారు (మఖ 4పాదాలూ,పుబ్బ 4 పాదాలూ ,ఉత్తర 1 వపాదం)

సింహం రాశివారు (మఖ 4పాదాలూ,పుబ్బ 4 పాదాలూ ,ఉత్తర 1 వపాదం)

సంవత్సరం మొదటినుండి జూన్‌ 19 వరకు గురుడు ,లో ఉండటంవలనద్వాదశ స్థానం: ధన నష్టము ఏర్పడుతుంది, ఆస్థినష్టము కలుగుతుంది, అనారోగ్యం కలుగుతుంది పుణ్యకార్యాలకు ఖర్చుపెడతారు. జూన్‌ 20 నుండి సంవత్సరాంతంవరకు గురుడు లో ఉండటంవలన చంద్ర స్థితరాశి: వ్యతిరేఖ ఫలప్రదము పొందుతారు. ధన నష్టము కలుగుతుంది, బంధువులతో విరోధముఏర్పడుతుంది, , అవమానం పొందుతారు, అధికారులకోపం పొందుతారు, అదృష్టం తగ్గుతుంది, ఉద్యోగం చేసేచోట గొడవలు తలెత్తుతాయి. సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు శనిలో ఉండటంవలనచతుర్థ స్థానం: అర్ధాష్టమ శనిగా దోష ఫలదుడు. అనారోగ్యము కలుగుతుంది, మిత్రులను కోల్పోతారు, వాత వ్యాధులు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, వృధా ప్రయాణములు చేస్తారు,వ్యతిరేక ఫలితాలు కలుగును. సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతం వరకు రాహువు ద్వితీయ స్థానంలో ఉండటంవలన : కలహం, మనస్తాపం, అపకీర్తి, ధన నష్టం, కష్టాలు కలుగును. సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు కేతువు అష్టమ స్థానంలో ఉండటంవలన: రాహుకేతువులు అష్టమ స్థానమందు మిక్కిలి ప్రతికూల ఫలదాతలు, కార్యనాశనం, ప్రయాణాయాసము, ప్రభుత్వ దండనా భయం, విచారం వంటి ప్రతికూల ఫలితములు కలుగును. వీరికి వివాహాదులకు ,సంతానానికి జూన్‌ తర్వాత బాగుంది,ఆతర్వాత రాయబడే పోటీపరీక్షలకు మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు కొంత గడ్డుకాలం,వాహనవిషయాలలో ,ప్రయాణాలవిషయంలో జాగ్రత్తవహించాలి

 కన్య రాశివారు (ఉత్తర 2,3,4 పాదాలు ,హస్త 4 పాదాలూ ,చిత్త 1,2 పాదాలు)

కన్య రాశివారు (ఉత్తర 2,3,4 పాదాలు ,హస్త 4 పాదాలూ ,చిత్త 1,2 పాదాలు)

సంవత్సరం మొదటినుండి జూన్‌ 19 వరకు గురుడు లాభ స్థానంలో ఉండటంవలన: మిక్కిలి అనుకూల స్థానం. సర్వతోముఖాభివృద్ధి, శారీరక మానసిక బలము ఏర్పడుతుంది, శరీరంలోతేజస్సు పెరుగుతుంది, అన్నివిధాల జయము కలుగుతుంది, సుఖము పొందుతారు, మంత్రసిద్ధి విశేషించి దేవతానుగ్రహం పొందుతారు, గౌరము పొందుతారు, సంతాన ప్రాప్తి కలుగుతుంది, నూతన ఉద్యోగ వ్యాపారములు ప్రాప్తించును.జూన్‌ 20 నుండి సంవత్సరాంతంవరకు గురుడు ద్వాదశ స్థానంలో ఉండటంవలన: ఉన్నచోటునుండి వేరే చోటుకి వెళతారు, ఆస్థి నష్టము కలుగుతుంది, అనారోగ్యం కలుగుతుంది పుణ్యకార్యాలకు ఖర్చుపెడతారు. సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు శనితృతీయ స్థానంలో ఉండటంవలన: శనికి ఇది అనుకూల స్థానము. కార్యములు సిద్ధించును, స్వంతచోట్ల గమనము, ఆరోగ్యము పొందుతారు, విజయమువంటి అనేక శుభ ఫలములు కలుగును.

సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతం వరకు రాహువు చంద్రస్థితి రాశి లో ఉండటంవలన: గోచార రాహు ప్రతికూల ఫలదాతలు. నష్టము, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధము వంటి కష్టనష్టములు కలుగును సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు కేతువు సప్తమ స్థానంలో ఉండటంవలన: ఈ స్థానములో కేతువులు వ్యతిరేక ఫలదులు. స్వల్ప అనుకూల ఫలితాలను కూడా ఇవ్వగలరు. కుటుంబంలో అభివృద్ధి ఏర్పడుతుంది,కీర్తి కలుగుతుంది, ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది ,వివాహాలకు గ్రహస్థితి అనుకూలంకాదు,

తుల రాశివారు (చిత్త 3,4 పాదాలు, స్వాతి 4 పాదాలు,విశాఖ 1,2,3పాదాలు)

తుల రాశివారు (చిత్త 3,4 పాదాలు, స్వాతి 4 పాదాలు,విశాఖ 1,2,3పాదాలు)

సంవత్సరం మొదటినుండి జూన్‌ 19 వరకు గురుడు దశమ స్థానంలో ఉండటంవలన: దోష ఫల స్థానము. వస్తువులు నాశనమవుతాయి, మనసులో అతురత కలుగుతాయి, పై అధికారులతో వ్యతిరేకత పొందుతారు, మిత్రుల మూలంగా నష్టము ఏర్పడుతుంది, వృధాప్రయాణాలుచేస్తారు. జూన్‌ 20 నుండి సంవత్సరాంతంవరకు గురుడు లాభ స్థానంలో ఉండటంవలన : మిక్కిలి అనుకూల స్థానం. సర్వతోముఖాభివృద్ధి, సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు శని ద్వితీయ స్థానంలో ఉండటంవలన: ఏలినాటి శని సంచారమందు ఇది మూడవ రాశి చలన కాలం. తన మనుష్యులతో విరోధము ఏర్పడుతుంది, పాపచింతనము చేస్తారు,కలుగుతాయి కష్టములు, ఆర్థిక నష్టములు కలుగుతాయి, సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు రాహువులో ఉండటంవలన12వ స్థానం చలనం అశుభ ఫలితములిచ్చును. అన్ని కార్యములు విఘ్నముగుట, స్థాన చలనం, రావలసిన లాభాలకు ఆటంకము, అనవసర ప్రయాణాలు వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.
సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు కేతువు షష్ఠ స్థానంలో ఉండటంవలన: రాహు, కేతువులు షష్ఠస్థాన చలన కాలమందు మిక్కిలి అనుకూల ఫలదాతలు, శత్రుక్షయము, తెలివిగా వ్యవహారములు చక్కబెట్టుట, ఉద్యోగంలో కొంత ఉన్నతి కలుగుతుంది ,మాటవిలువ తగ్గుట,మిత్రులవల్ల మోసపోవుట,అప్పుల ఇబ్బందులు కలుగుతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది, జీర్ణసంబంధ వ్యాధులుంటయి

వృశ్చిక రాశివారు (విశాఖ 4వపాదం ,అనూరాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు)

వృశ్చిక రాశివారు (విశాఖ 4వపాదం ,అనూరాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు)

సంవత్సరం మొదటినుండి జూన్‌ 19 వరకు గురుడు నవమ స్థానంలో ఉండటంవలన: మిక్కిలి అనుకూల స్థానం. సకలవిధ సౌభాగ్యసిద్ధి, , కుటుంబంలో సౌఖ్యము పొందుతారు,అన్నివిధాల అభివృద్ధి కలుగుతుంది, ఆచార జీవనము జీవిస్తారు, అనుకున్న పనులు సాధిస్తారు, జూన్‌ 20 నుండి సంవత్సరాంతంవరకు గురుడు దశమ స్థానం లో ఉండటంవలన : దోష ఫల స్థానము. వస్తువులు ,ధనం నాశనమవుతాయి, మనసులో అతురత కలుగుతాయి, పై అధికారులతో వ్యతిరేకత పొందుతారు, సంతానానికి అనారోగ్యము కలుగుతుంది, సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు శనిచంద్ర స్థితి రాశి: లో ఉండటంవలన ఏలినాటి శనిలో ఇది రెండవ రాశి చలన కాలము. జన్మరాశిలో శనిగ్రహ చలనం తీవ్రదోష ఫలితాలనిస్తుంది.బంధువులకు దూరమౌతారు, బంధువులతో శత్రుత్వము ఏర్పడతాయి, శ్రమకరమైన ప్రయాణాలు చేస్తారు, చేసేపనులలో అవరోధాలు ఏర్పడతాయి, తప్పుడు పనులుచేస్తారు, బుద్ధి చపలంగా మారుతుంది, సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు రాహువు ఏకాదశ స్థానం:లో ఉండటంవలన లాభస్థానమందు వీరు ఉత్కృష్టమైన లాభాలను కల్పిస్తారు. పశులాభం, ధనలాభం, నూతన వస్తు ప్రాప్తి, ఆహార సౌఖ్యం, పరిమళ ద్రవ్యాలు వంటి అనుకూల ఫలితాలు కలుగును.
సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు కేతువు పంచమ స్థానం: లో ఉండటంవలన సంతాన సౌఖ్యలోపము, మనశ్శాంతికి భంగము, పుత్రులతో విరోధము, భోజన సౌఖ్యలోపముతో పాటు స్వల్ప అనుకూల ఫలితములు కూడా కలుగును. కొత్తవస్తువులు పొందుతారు,గృహలాభము కలుగుతుందిఉద్యోగంలో కొంత ఉన్నతి కలుగుతుంది ,మాటవిలువ తగ్గుట,మిత్రులవల్ల మోసపోవుట,అప్పుల ఇబ్బందులు కలుగుతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది, జీర్ణసంబంధ వ్యాధులుంటయి

ధను రాశివారు (మూల 4పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వపాదం)

ధను రాశివారు (మూల 4పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వపాదం)

సంవత్సరం మొదటినుండి జూన్‌ 19 వరకు గురుడు అష్టమ స్థానంలో ఉండటంవలన: వ్యతిరేక ఫలస్థానం. ఎక్కువ శ్రమచేస్తారు, రాజభయములేదా పై అధికారులచేత , చేసే పనులలో ఆటంకములు కలుగుతాయి, కష్టతరమైన నష్టప్రదమైన ప్రయాణాలుచేస్తారు, ధననష్టము జరుగుతుంది,జూన్‌ 20 నుండి సంవత్సరాంతంవరకు గురుడు నవమ స్థానంలో ఉండటంవలన: మిక్కిలి అనుకూల స్థానం. సకలవిధ సౌభాగ్యసిద్ధి, ఆచార జీవనము జీవిస్తారు, అనుకున్న పనులు సాధిస్తారు, కొత్తవస్తువులు పొందుతారు,ధనలాభము కలుగుతుంది, స్త్రీ సౌఖ్యము పొందుతారు.

సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు శనిద్వాదశ స్థానంలో ఉండటంవలన : శని ద్వాదశ సంచారంతో ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఇది దీర్ఘకాల వ్యతిరేక ఫలితాలకు ఆరంభము, గౌరవ భంగము, కృషి నాశనము, హేయమైన జీవనము, బంధుపీడ, శత్రు వృద్ధి, సంతాన అనారోగ్యం, వివాదములు వంటి దోష ఫలితాలు కలుగును. సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు రాహువుదశమ స్థానంలో ఉండటంవలన: దశమ స్థానంలో వీరు శుభ ఫలదాతలు. శరీర సౌఖ్యము,కర్మసిద్ధి బలంగా ఉండటం, ఆనందం కలుగుతుంది.
సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు కేతువుచతుర్థ స్థానంలో ఉండటంవలన: బుద్ధిబలలోపం, అనవసర ప్రయాణములు, వాత వ్యాధులు, స్త్రీ కలహం, కార్యవిఘ్నం కలుగును. ప్రభుత్వంచేత భయం పొందుతారు,గౌరవం తగ్గుతుంది,అరిష్టముకలుగును,గృహలాభము కలుగుతుంది,ఉద్యోగంలో కొంత ఉన్నతి కలుగుతుంది ,మాటవిలువ తగ్గుట,మిత్రులవల్ల మోసపోవుట,అప్పుల ఇబ్బందులు కలుగుతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది, జీర్ణసంబంధ వ్యాధులుంటాయి

 మకర రాశివారు (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1,2 పాదాలు)

మకర రాశివారు (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1,2 పాదాలు)

సంవత్సరం మొదటినుండి జూన్‌ 19 వరకు గురుడు సప్తమ స్థితిలో ఉండటంవలన: శుభపలదుడు. అనుకున్నపనులు సాధిస్తారు, కుటుంబంలో ఆనందం, ఆరోగ్యము పొందుతారు, స్త్రీసౌఖ్యము కలుగుతుంది, పెద్దలను,గొప్పవారిని కలుసుకొంటారు, గౌరవము పొందుతారు, జూన్‌ 20 నుండి సంవత్సరాంతంవరకు గురుడు అష్టమ స్థానంలో ఉండటంవలన : వ్యతిరేక ఫలస్థానం. ఎక్కువ శ్రమచేస్తారు, రాజభయములేదా పై అధికారులచేత, గౌరవం తగ్గుతుంది, కష్టతరమైన నష్టప్రదమైన ప్రయాణాలుచేస్తారు, ధననష్టము జరుగుతుంది, కష్టనష్టాలు కలుగుతాయి.

సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు శనిఏకాదశ స్థానంలో ఉండటంవలన:మిక్కిలి అనుకూల స్థానము, పుత్ర ప్రాప్తి, గౌరవము, కుటుంబ సౌఖ్యము, నిర్మలమైన మనస్సు, అనేక విధాలైన లాభములు కాలుగును.సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతం వరకు రాహువునవమ స్థానంలో ఉండటంవలన: నవమ స్థానంలో రాహు చలనం ప్రతికూలమైనది. దురదృష్టము, ప్రయాణాలలో ఇబ్బందులు వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.
సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు కేతువు తృతీయ స్థానంలో ఉండటంవలన: తృతీయ స్థానములో శుభ ఫలదాతలు, సౌభాగ్యం వంటి అనుకూల ఫలితాలతో పాటు అన్నదమ్ములతోద్వేషము కల్పిస్తాడు. సంతాన ప్రాప్తి కలుగుతుంది,ప్రభుత్వంచేత భయం పొందుతారు,అధికార వృద్ధి,అరిష్టముకలుగును,అనుకున్న పనులు,వివాహాదులు,ఉద్యోగాలు నిరాశ మిగులుస్తాయి

కుంభ రాశివారు (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు ,పూర్వాభాద్ర 1,2,3పాదాలు)

కుంభ రాశివారు (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు ,పూర్వాభాద్ర 1,2,3పాదాలు)

సంవత్సరం మొదటినుండి జూన్‌ 19 వరకు గురుడు షష్ఠ స్థితిలో ఉండటంవలన : షష్ఠ స్థాన స్థితి దోషఫలదము. వ్యాధికలుగుతుంది,అధికమైన ఖర్చులుచేస్తారు, భయము కలుగుతుంది, సంసారసౌఖ్యం లోపిస్తుంది, అనవరసమైన శ్రమచేస్తారు. జూన్‌ 20 నుండి సంవత్సరాంతంవరకు గురుడు సప్తమ స్థితి లో ఉండటంవలన : శుభపలదుడు. అనుకున్న పనులు సాధిస్తారు,పెద్దలను,గొప్పవారిని కలుసుకొంటారు, అలంకారవస్తువులు ప్రాప్తించును. సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు శని దశమ స్థానంలో ఉండటంవలన: దశనమ స్థాన శని సంచారము దోష ఫలదము, పాప కార్యాచరణ, కర్మ భ్రష్టత, పరితాపము, దు:ఖము, విఘ్నములు, వ్యాకులత, కీర్తి భంగము, వంటి కష్టనష్టములు కలుగును.
సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతం వరకు రాహువుఅష్టమ స్థానంలో ఉండటంవలన: రాహుకేతువులు అష్టమ స్థానమందు మిక్కిలి ప్రతికూల ఫలదాతలు, ఆందోళన, క్రూరజంతు భయం, ప్రయాణాయాసము, విచారం వంటి ప్రతికూల ఫలితములు కలుగును. సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు కేతువు ద్వితీయ స్థానంలో ఉండటంవలన: కలహం, మనస్తాపం, అపకీర్తి, ధన నష్టం, కష్టాలు కలుగును. సంతాన ప్రాప్తి కలుగుతుంది, వృత్తి నష్టము,ఆదాయ నష్టం,ఉద్యోగమందు బాధలు,ప్రభుత్వ దండనా భయం,వివాహాదులకు మధ్యమ ఫలితాలు కలుగుతాయి.వాహనవిషయాలలో ,ప్రయాణాలవిషయంలో జాగ్రత్తవహించాలి

మీన రాశివారు (పూర్వాభాద్ర 4వ పాదం,ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు)

మీన రాశివారు (పూర్వాభాద్ర 4వ పాదం,ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు)

సంవత్సరం మొదటినుండి జూన్‌ 19 వరకు గురుడు పంచమ స్థానంలో ఉండటంవలన :మిక్కిలి అనుకూల స్థానం. ఐశ్వర్యము పొందుతారు, ధనలాభముకలుగుతుంది, బంధుజనుల ప్రోత్సాహము పొందుతారు, సజ్జనులస్నేహము పొందుతారు, రాజానుగ్రహము పెద్దలఅనుగ్రహం పొందుతారు. జూన్‌ 20 నుండి సంవత్సరాంతంవరకు గురుడు షష్ఠ స్థితి లో ఉండటంవలన : షష్ఠ స్థాన స్థితి దోషఫలదము. వ్యాధికలుగుతుంది, సంసారసౌఖ్యం లోపిస్తుంది, అనవరసమైన శ్రమచేస్తారు. సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు శనినవమ స్థితిలో ఉండటంవలన: భాగ్య స్థానమందు శని సంచారము వ్యతిరేక ఫలితములు కల్పించును. దు:ఖము, శత్రుబాధ, భార్యాబిడ్డలకు కష్టములు, వృధా ప్రయాణములు, వ్యాధి. సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు రాహువు చంద్రస్థితి రాశిలో ఉండటంవలన: గోచార రాహు కేతువులు ప్రతికూల ఫలదాతలు. దేశ సంచారము, కలహాలు, రోగము, నష్టము, కష్టనష్టములు కలుగును. సంవత్సరం మొదట నుండి సంవత్సరాంతంవరకు కేతువు సప్తమ స్థానంలో ఉండటంవలన: ఈ స్థానములో కేతువులు వ్యతిరేక ఫలదులు. వ్యాధి, స్వల్ప ధాన్యాదులు లభ్యమగును. స్వల్ప కుటుంబ కలహాలు, అనాలోచిత చర్యలు కలుగును. సంతానము కలలుగుటకు అవకాశం వుంది,జూన్‌ లోపు కొంత మంచిఫలంవుందికానీ సంవత్సరాంతమూ ఎక్కువ వ్యతిరేకతలున్నవి.

English summary
Astrologer Maruthi Sharma has predicted the future based on Raasi Chakras.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X