Pakistan: పాకిస్థాన్ కు బ్యాడ్ న్యూస్..!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని చవి చూస్తున్నాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకం అయిన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో పేద, మధ్యతరగతి దేశాలతోపాటు అభివృద్ది చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా సంక్షోభంలో కూరుకుపోయాయి.

ఇక అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లుగా ఉంది. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ప్రజలు ఒక్కపూట గడవటం కోసం నానా కష్టాలు పడుతున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు భారీగా పెరిగాయి. ఇదిలాఉంటే పాకిస్థాన్ ను నీటి సంక్షోభం కూడా వెంటాడుతోంది. ప్రస్తుతం వేసవి కారణంగా నీరు, విద్యుత్ కొరతతో దేశ ప్రజలు అల్లాడుతున్నారు. ఈక్రమంలో పాకిస్థాన్ కు మరో బిగ్ షాక్ తగిలింది.

న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC) ప్రధాన కార్యాలయంలో జరిగిన తాజా ఎన్నికలో కీలక మార్పు చోటు చేసుకుంది. UNSC తాత్కాలిక సభ్య దేశంగా కిర్గిస్థాన్ చరిత్రలోనే మొదటిసారిగా ఎన్నికైంది. దాంతో పాకిస్థాన్ ఈ కూటమి నుంచి బయటకు రానున్నట్లు సమాచారం. ఇది పాకిస్థాన్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఆసియా- పసిఫిక్ ప్రాంతానికి కేటాయించిన ఒక తాత్కాలిక స్థానం కోసం కిర్గిస్థాన్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. చివరికి కిర్గిస్థాన్ 142 ఓట్లతో ఘనవిజయం సాధించింది. దాంతో ఫిలిప్పీన్స్ కేవలం 49 ఓట్లకే పరిమితం అయింది. 1992 లో ఐక్యరాజ్యసమితిలో చేరిన తర్వాత కిర్గిస్థాన్ ఈ అత్యున్నత మండలికి ఎన్నిక కావడం ఇదే తొలిసారి.. పాకిస్థాన్ స్థానంలో కిర్గిస్థాన్ ను ఎన్నుకుంది UNSC.

Pakistan Out of UNSC Kyrgyzstan Elected as Non-Permanent Member for First Time in History Pakistan

ఇక UNSC లో మొత్తం 15 దేశాలు సభ్యులుగా ఉంటాయి. శాశ్వత సభ్య దేశాలు పీ5 అంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా ఉంటాయి. వీటికి వీటో అధికారం ఉంటుంది. తాత్కాలిక సభ్య దేశాలుగా మిగిలిన 10 దేశాలను ప్రాంతాల వారీగా రెండేళ్ల కాలానికి ఎన్నుకుంటారు. అలాగే ఏటా ఐదు కొత్త దేశాలు ఇందులో చేరుతుంటాయి. ఈ ఏడాది కిర్గిస్థాన్ తో పాటు ఆస్ట్రియా, పోర్చుగల్, జింబాబ్వే, ట్రినిడాడ్ అండ్ టొబాగో చేరాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+