AP TET 2026 Schedule: ఏపీ టెట్-2026 షెడ్యూల్ విడుదల

ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఏపీ టెట్-2026 షెడ్యూల్ ‌ను విడుదల చేసింది. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా వివరాలను వెల్లడించారు. ఈ నెల 5వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. జూన్ 5 నుంచి జూలై 5 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు ఉంటుందని వివరించారు.

అలాగే జులై 25 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇక ఆగస్టు 5 నుంచి 21వ తేదీ వరకు రోజూ రెండు సెషన్స్ లో పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ అలాగే.. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని పేర్కొన్నారు.

APTET Schedule Released Education Minister Nara Lokesh Shares Details X Platform AP TET Schedule

ఇక ఆగస్టు 24 న ప్రాథమిక కీ విడుదల, సెప్టెంబర్ 8న ఫైనల్ కీ విడుదల చేస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ 15వ తేదీన తుది ఫలితాలు వెల్లడిస్తామని ట్వీట్ చేశారు. అలాగే ఈ ఏడాది అక్టోబరులో DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఇక DSC రాసే అభ్యర్థులకు టెట్ స్కోర్ ఎంతో కీలకం కావడంతో, అర్హులైన అభ్యర్థులందరికీ అవకాశం కల్పించేందుకే ముందుగా టెట్ పరీక్షను నిర్వహిస్తున్నట్లుగా విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+