ఇండియా కూటమికి డీఎంకే షాక్..! చీలిక తప్పదా ?

తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఇండియా కూటమి (India Bloc)లో చీలికకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసి, ఫలితాలు వచ్చాక విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ విషయంలో డీఎంకే (DMK) ఆగ్రహంగా ఉంది. దీంతో ఢిల్లీలో జూన్ 8న జరగాల్సిన ఇండియా కూటమి భేటీకి గైర్హాజరు కావాలని డీఎంకే నిర్ణయం తీసుకుంది.

డీఎంకేకు చిరకాల మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ విజయ్ టీవీకేతో పొత్తు పెట్టుకుంది. ఈ చర్యతో డీఎంకే నేతలు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిపైనా భగ్గుమంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పై "ద్రోహం, "వెన్నుపోటు" ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పాటు లోక్ సభలోనూ కాంగ్రెస్ ఎంపీల పక్కన కాకుండా తమకు వేరేగా సీట్లు కేటాయించాలని స్పీకర్ కు డీఎంకే ఎంపీ కనిమొళి లేఖ రాశారు. ఇప్పుడు ఇండియా కూటమి భేటీకి వెళ్లరాదని నిర్ణయించారు.

Cracks in INDIA Bloc DMK Stays Away From Alliance Meet After Congress Fallout Over TN Polls

తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, దాని తర్వాత బెంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇండియా కూటమి భేటీ నిర్వహించాలని మమతా బెనర్జీ పట్టుబడుతున్నారు. దీంతో ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో ఈ నెల 8న భేటీ కావాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఇండియా కూటమిలో మూడో అత్యధిక ఎంపీలున్న పార్టీ డీఎంకే డుమ్మా కొట్టడంతో దీని ప్రభావంపైనా ఈ భేటీలో చర్చ జరగబోతోంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్, ఇండియా కూటమికి దూరమవుతున్న డీఎంకేను బీజేపీ ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+