నేడు ఈ రాశులవారికి కుజ, బుధుల వల్ల పట్టిందల్లా బంగారమే!

జూన్ 5వ తేదీ శుక్రవారం సూర్యుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడు శ్రవణా నక్షత్రం దాటి, మకరరాశిలో ప్రయాణిస్తున్నాడు. కుజుడు, బుధుడు మిథునరాశిలో కలయిక వైపు సాగుతున్నారు. గురుడు మిథున రాశిలోనే కొనసాగుతున్నాడు. శుక్రుడు మిథున రాశి నుండి కర్కాటక రాశి ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాడు. శని మీన రాశిలో మందగమనంలో ఉన్నాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు.ఈ గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది.

మేష రాశి

మేష రాశి ఉద్యోగస్తులకు ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే, మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు సాధారణంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి, కాబట్టి మాట తీరుపై నియంత్రణ అవసరం.

today rashiphalalu June 5 Horoscope 2026 Planetary Transits Predictions for all twelve zodiac signs

వృషభ రాశి

మేష రాశి వారికి ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. పాత బాకీలు వసూలవుతాయి. నూతన వస్తు లేదా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.

మిథున రాశి

మిధున రాశిలోనే గురు, కుజ, బుధ గ్రహాల ప్రభావం ఉండటం వల్ల మానసిక చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో సానుకూల ఫలితాలు వస్తాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి వ్యయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కోర్టు వ్యవహారాలు లేదా ఆస్తి తగాదాలలో కొంచెం ఓపికగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

సింహ రాశి

సింహరాశి వారికి ఈ రోజు మీకు లక్కీ డే అని చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

కన్యా రాశి

కన్యా రాశి జాతకులకు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా స్థానచలన సూచనలు ఉన్నాయి. పైఅధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల గురించిన చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

తులా రాశి

భాగస్వామ్య వ్యాపారాలు చేసే తులారాశి వారికి మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. తండ్రి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ అవసరం.

వృశ్చిక రాశి

ఈ రోజు వృశ్చిక రాశి వారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. శత్రువుల విషయంలో జాగ్రత్త వహించండి. ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వవద్దు.

ధనస్సు రాశి

ధనుస్సు రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలించే సమయం. వివాహితులకు జీవితభాగస్వామితో సంతోషకరమైన సమయం గడుస్తుంది. వ్యాపార విస్తరణకు మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి.

మహాలక్ష్మి రాజయోగం: జూన్ 11నుండి ఈ రాశులవారికి తిరుగుండదు!
మహాలక్ష్మి రాజయోగం: జూన్ 11నుండి ఈ రాశులవారికి తిరుగుండదు!

మకర రాశి

చంద్రుడి సంచారం మకర రాశిలోనే ఉండటం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పాత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

కుంభ రాశి

సంతాన పరమైన విషయాలు మిమ్మల్ని ఆనందానికి గురిచేస్తాయి. షేర్ మార్కెట్ లేదా లాటరీల జోలికి వెళ్లకపోవడం మంచిది. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి కళకారులు, రచయితలకు మంచి అవకాశాలు వస్తాయి.

మీన రాశి

మీనరాశి వారికి ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నూతన గృహం లేదా వాహనం కొనే ఆలోచనలు చేస్తారు. బంధువుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది. అయితే, గుండె లేదా కడుపు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+