కార్తీక మాసంలో లక్ష్మీకటాక్షం కోసం సులువుగా చెయ్యగల విశేషదానాలు!!

కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం. శివుడికి, విష్ణు మూర్తికి అత్యంత ఇష్టమైన, పరమ పవిత్రమైన ఈ మాసంలో చేసిన దానాలు సత్ఫలితాలను ఇస్తాయి. అయితే ఈ మాసంలో దానాలు అంటే బాగా ఖర్చుతో కూడుకున్న పని అని భావించనక్కరలేదు. ఈ మాసంలో స్నానం, దీపం, దానం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.

కార్తీక మాసంలో విశేష ఫలాన్ని ఇచ్చే సామాన్యులు సైతం చెయ్యగల సులువైన దానాలను గురించి తెలుసుకుందాం. సహజంగా ధనం, ధాన్యం, వస్త్రాలు, భూమి, గోవు వంటివి దానం చెయ్యాలంటే సామాన్య ప్రజలు చెయ్యలేరు. కాబట్టి సామాన్యులు సైతం చెయ్యగల విశేష దానాల గురించి శాస్త్రాలు తెలియజేశాయి.

karthika masam special donations for lakshmi blessings

ప్రతీ ఒక్కరూ చెయ్యగల విశేష ఫలితం ఇచ్చే దానాలలో దీప దానం ఒకటి. కార్తీక మాసంలో దీపదానం చెయ్యాలి అని భావించేవారు కార్తీక మాసంలో మీకు కుదిరిన రోజు బియ్యంపిండితో దీపాన్ని తయారు చేసి అందులో ఒత్తులను వేసి నెయ్యి పోసి ఎవరికైనా దానం చెయ్యండి .ఈ దీప దానానికి పెద్దగా ఖర్చు కాదు. ఇది మీకు విశేష ఫలితాలను ఇస్తుంది.

ఇక కార్తీక మాసంలో చెయ్యగల మరొక దానం ఉసిరికాయ దీప దానం. ఇది ఇవ్వటం కోసం ప్రమిదలో ఉసిరికాయ ఉంచి, దాని మీద దీపం వెలిగించి దానం చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలు దానం చేస్తే భూమిని దానం చేసినంత ఫలితం వస్తుంది. లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుంది.

అంతేకాదు కార్తీక ద్వాదశి నాడు పురోహితులకు స్వయం పాకం దానం చేసినా, లేదా పేదవారికి కనీసం ఒకరికి కూరలతో భోజనం పెట్టినా విశేష ఫలితం ఉంటుంది. బెల్లం, నువ్వులు వంటివి దానం చేసినా సత్ఫలితాలు వస్తాయి. అంతేకాదు కార్తీక పురాణం, దేవీ భాగవతం, శివ పురాణం వంటి గ్రంధాలను ఎవరికైనా పంచినా అఖండ ఐశ్వర్యం, కీర్తి, పుణ్యం లభిస్తాయి .

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+