Karthika masam: కార్తీక గోపాష్టమికి గోపూజ చేస్తే సకల పాప హరణం!!

కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం. కార్తీక మాసంలో కార్తీక గోపాష్టమికి ఒక విశిష్టత ఉంది. కార్తీక గోపాష్టమి కార్తీక మాసంలోని శుక్ల పక్షంలో ఎనిమిదవ రోజున వస్తుంది. నేడు ఆ పర్వదినం. ఈ రోజున గోవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెప్తారు. గోపాష్టమి అనేది కృష్ణుడిని, గోవులను పూజించే పండుగ.

శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలు మీద ఎత్తిన రోజును గోపాష్టమిగా పరిగణిస్తారు. శ్రీ కృష్ణుడు గోవర్ధన గిరిధారియై గోపాలురను, గోవులను సంరక్షించిన రోజే గోపాష్టమి. ఈ రోజు భక్తులు గోపాలకుడైన కృష్ణుడిని పూజించటంతో పాటు గోవులకు పూజాధికాలు చేస్తారు. ఈ సంవత్సరం గోపాష్టమి నేడు చాలా ఘనంగా జరుపుకున్నారు. గోపాష్టమిని పరమ పవిత్రంగా భావించేవారు నేడు గోవులకు దేవతలుగా భావించి పూజలు చేశారు.

Kartika Gopashtami: sins will be removed of worshiping cows and sri krishna!!

హిందూ సంస్కృతిలో ఆవులను దేవతలుగా పూజిస్తారు. గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అని భావిస్తారు. ఇక అటువంటి గోవులను పూజించే అత్యంత ముఖ్యమైన పండుగ గోపాష్టమి నేడు. ఇక ఇదే రోజు తిరుమలలో పుష్పయాగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక నేడే మాస దుర్గాష్టమి వ్రతాన్ని కూడా కొందరు భక్తులు నిర్వహిస్తారు. గోవు లక్ష్మీదేవి స్వరూపం కావడంతో గో పూజ చేస్తే సకల ఐశ్వర్యాలను పొందవచ్చని చెబుతారు.

ఇక ఈ రోజు భక్తులు విశిష్టంగా గోపూజలు చేశారు. గోశాలలను సందర్శించి గోవులను, గోశాలలను శుభ్రం చేశారు. ఆవులను చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు . వాటికి ఈరోజు ఖచ్చితంగా వివిధ రకాల అవి తినే ఆహారాన్నితినిపించారు. సకల పాపాలు తొలగిపోతాయనే ఉద్దేశంతో నేడు శ్రీ కృష్ణ పూజను, గోవుల పూజను ఎంతో మంది భక్తులు నిర్వహించారు.

ఈరోజు ఎవరైతే గోపూజ నిర్వహిస్తారో వారికి ఆయురారోగ్యాలు, కీర్తి, ధనం, జ్ఞానం, క్షేమం లభిస్తాయి అన్ని పాపాలు తొలగిపోయి పుణ్య ఫలం లభిస్తుందని భక్తులు ప్రగాడంగా నమ్ముతారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+