ఈ నాలుగురాశులకు నరకం చూపించనున్న నీడగ్రహం.. బీ కేర్ ఫుల్!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం 12 రాశులపై వివిధ రకాల ప్రభావాలను చూపుతుంది. కొన్ని ముఖ్య గ్రహాల సంచారం కొందరికి శుభ ఫలితాలు ఇస్తే, మరికొందరికి అనవసర సమస్యలు, ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అలాంటి పరిస్థితి 2026 మే 29న ఏర్పడనుంది. నీడ గ్రహమైన కేతువు మఖా నక్షత్రం మూడవ పాదంలోకి ప్రవేశించనుంది. ఈ సంచారం జూన్ 30వరకు కొనసాగుతుంది.ఈ కాలంలో నాలుగు రాశులవారు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి మానసిక అస్థిరత, నిద్ర సమస్యలు, ఒత్తిడి ఎక్కువవుతాయి. అనవసర ఖర్చులు పెరిగి ఆర్థిక పరిస్థితి దెబ్బతినవచ్చు. ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా మెడ, భుజాలు, వీపు సంబంధిత సమస్యలు రావడం సాధ్యమే. కేతువు నీడ గ్రహం కాబట్టి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి.

మిథున రాశి:
కేతువు మఖా నక్షత్రంలోని మూడవ పాదంలో సంచారం చేయటం వల్ల మిథున రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు పెరగవచ్చు. ఊహించని ఖర్చులు, ఆదాయం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా తల, కళ్లు, నాడీ సంబంధిత సమస్యలు రావడం సాధారణం. ఏదైనా ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్లాలి. వాహనాలు నడిపే వారికి అనవసర ప్రమాదాలు. జాగ్రత్త అవసరం.
కన్య రాశి:
ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువవుతాయి. కష్టపడి పని చేసినా ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చు. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి రోజువారీ దినచర్య, ఆహారం, విశ్రాంతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఖర్చులు అదుపు చేయకపోతే ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. పాత సమస్యలు మళ్లీ తలెత్తవచ్చు.
మీన రాశి:
మీన రాశి వారు ఆర్థికంగా భారీ నష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అప్పులు పెరగడం, ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా జీర్ణకోశ సంబంధిత ఇబ్బందులు రావచ్చు. ఏ పని మొదలుపెట్టినా అది అసంపూర్తిగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఉద్యోగస్థులు జాబ్ సెక్యూరిటీపై జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం కూడా గమనించాలి.
కేతువు సంచార సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు
వృషభ రాశి, మిధున రాశి,కన్యా రాశి, మీన రాశుల వారు ముఖ్యమైన పనులు, ప్రయాణాలు, ఆర్థిక నిర్ణయాలు ఆలస్యం చేయడం మంచిది. దాన-ధర్మాలు, గణపతి, శివారాధన చేయడం ఉపయోగపడవచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం కష్టమైనప్పటికీ సహనం, జాగ్రత్తతో అధిగమించవచ్చు.













Click it and Unblock the Notifications