• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Healthy Diet: ఈ జాబితాలోని ఆహారం తీసుకుంటే ఆరోగ్యపరమైన లాభాలు ఎన్నో..!

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఆరోగ్య సూత్రాలు మ‌న ఆహార అల‌వాట్లపైనే మ‌న ఆరోగ్యం ఆధార‌ప‌డి ఉంటుంది. మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. మన ఆరోగ్యాన్ని శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశ్యంతో చాలామంది ర‌క‌ర‌కాల డైట్లు ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎక్కువ ఎక్కువ డ‌బ్బులు ఖ‌ర్చు పెడుతుంటారు. ఏవేవో తింటుంటారు. కానీ మ‌న ఇంట్లో దొరికే ఆహార ప‌దార్థాల‌తోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవ‌చ్చు. మంచి ఆరోగ్యంగా ఉండాలనే మన శరీరానికి అన్నిరకాల పోషకాలు అందాలి. అవి ఒకే రకమైన ఆహారం అందించలేదు. కనుక రోజూ తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పాలు, వంటివి ఉండాలి. ప్రతి రోజూ మ‌నం తినే ఆహారంలో చేర్చుకోవ‌డం ద్వారా రోగాల బారిన ప‌డ‌కుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మ‌రి ఆ ఆహార ప‌దార్థాలేంటో జాగ్రత్తగా గమనిద్దాం...

Know the healthy diet for a healthy living, Check the list

* పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి రోజు పెరుగును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణక్రియ మెరుగుప‌డుతుంది.

* బీట్ రూట్ బీపీని క్రమబద్దీకరిస్తుంది.

* మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

* జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

* ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.

* నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

* మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.

* మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.

* సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.

* దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.

* ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.

* కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.

* క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.

* యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

* వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

* దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.

* ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.

* అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.

* కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.

* మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.

* ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.

* బీట్ రూట్ రసం 'లో బీపీ ' సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.

* క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

* అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

* కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

* నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

* గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

* అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.

* జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.

* బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.

* సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

* మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

* మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.

* వెల్లుల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.

* అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.

* పుచ్చకాయలో ఉండే లైకొపీన్ గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.

* పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.

* ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.

* ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.

* ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.

* మ‌న వంట్లో మ‌సాలా దినుసులు త‌ప్పనిస‌రిగా వాడుతుంటాం. కూర‌ల్లో వేసే ప‌సుపు, ల‌వంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివార‌ణ‌, యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువ‌గా ఉంటాయి. గాయాల‌ను త‌గ్గించ‌డంతో పాటు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

* ప‌ప్పుల్లో పుష్కలంగా ల‌భిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫైబ‌ర్‌, ప్రోటీస్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవ‌స్థ స‌క్రమంగా ప‌నిచేసేలా స‌హాయ‌ప‌డుతాయి. అలాగే కొత్త క‌ణాలు పున‌రుత్పత్తి అవ్వడంలో స‌హ‌క‌రిస్తాయి. ప‌ప్పు దినుసుల్లో విట‌మిన్ ఏ, విట‌మిన్ బీ, విట‌మిన్ సీ, విట‌మిన్ ఈ, మెగ్నిషియం, ఐర‌న్‌, జింక్ కూడా ల‌భిస్తాయి.

* రాగి, జొన్న, స‌జ్జ ఎక్కువ‌గా తిన్న వారు చాలాకాలం ఆరోగ్యంగా జీవిస్టారు. ఈ మిల్లెట్లలో ఫైబ‌ర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియ‌కు అవ‌స‌ర‌మ‌య్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడ‌టంలో ఇవి ఎంతగానో దోహ‌ద‌ప‌డ‌తాయి. అంతేకాకుండా పేగు కేన్సర్ వ‌చ్చే అవ‌కాశాన్ని కూడా మిల్లెట్లు త‌గ్గిస్తాయి. బ‌రువు త‌గ్గాల‌ని అనుకునేవారికి ఇది మంచి ఆహారం.

ఎవరికైనా ఒక్కసారే ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంటే ఇబ్బందే.. కనుక మెల్లమెల్లగా తినే ఆహారంలో సమత్యుల్యం ఉండేలా అన్ని పదార్ధాలను చేర్చుకోవాలి.
ఏ ఆహారపదార్ధం పూర్తిగా మంచిది కాదు.. అదే విధంగా పూర్తిగా చెడ్డది కూడా కాదు.. కనుక అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్నీ గుర్తు పెట్టుకుని మనం రోజూ తినే డైట్ ను ప్లాన్ చేసుకుంటే సగం వ్యాధుల నుంచి మనలని మనం కాపాడుకున్నట్లే ..మిత ఆహారపదార్థాలు అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మన వేటే ఉంటుంది.

English summary
Healthy diet, what is the diet for healthy living, what are the benefits of taking courd, List of fruits and vegetables for healthy diet, nutritious food, news on healthy diet, foods to be taken to avoid corona,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X