ధనస్సురాశి ( Sagittarius) వారికి 2022 - 2023 శ్రీ శుభకృత్ నామ సం. ర ఉగాది వార్షిక ఫలితాలు
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ప్రస్తుతకాల గోచార స్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు, యుతులు, పరివర్తనలు, గ్రహ అవస్తాలు.. మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఇందులో కేవలం సామూహిక ఫలితాలను మాత్రమే తెలియజేయడం జరుగుతున్నది. ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. సరైన పుట్టిన తేదీ, సమయం ఆధారంగా జాతక విశ్లేషణలో సరైన ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఆసక్తి కలవారు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. . డా.ఎం.ఎన్.ఆచార్య
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారు ధనస్సురాశికి చెందుతారు.
ధనస్సురాశి వారికి'శుభకృత' నామ సంవత్సరంలో ఆదాయం -2, వ్యయం - 8
రాజపూజ్యం - 6, అవమానం - 1.

* గురుగ్రహ ఫలితాలు :- సంవత్సర ప్రారంభం నుండి తృతీయ భావంలో ఉండి ఆ తర్వాత తేదీ 7 ఏప్రిల్ 2022 నుండి చతుర్ధ భావ సంచార ఫలితంగా కుటుంబ సమస్యలు, అన్నదములతో వివాదములు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారముల కొరకు ఋణాలు చేయవలసి వస్తుంది. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బందులు కలిగిస్తాయి. వాహన లేదా గృహానికి సంబంధించిన మరమ్మత్తులు చేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పరస్థల సంచారం అధికమౌతుంది. కొన్ని సందర్భాలలో అత్యవసర అవసరార్ధం యాచించే పరిస్థితి కూడా గోచరిస్తుంది.
* శని "దేవుని" గ్రహ ఫలితాలు:- ధనస్సురాశివారికి ఏలినాటి శని 'మూడవ భాగం' ప్రభావం 17 జనవరి 2023 వరకు ప్రభావితమై ఉంటుంది. ప్రస్తుత గోచారరిత్య శని ఫిబ్రవరి 2023 వరకు ద్వితీయ భావంలో ఉండడం వలన చేసే పనులలో అవకతవకలు ఏర్పడుతాయి. అంతరాయలు, చిక్కులు, చికాకులు కలిగిస్తూఉంటాయి. ప్రతి విషయంలోనూ ఇంట, బయట వ్యతిరేఖ వ్యవహారం నడుస్తుంది. విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆరోగ్యం సహకరించదు. కుటుంబంలో పెద్ద వయస్సు గలవారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. 2023 ఫిబ్రవరి తర్వాత శని భగవానుడు తృతీయ భావంలోకి ప్రవేశం చేసిన తర్వాత ఇంత కాలం పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తిచేస్తారు. ఆనందాన్ని కలిగించే వాతావరణం అనుభంలోకి వస్తుంది. బుద్ది బలంతో యుక్తిని ప్రదర్శించి చేసే పనులలో విజయాలను సాధించి మంచి పేరును సంపాదించుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. అవివాహితులకు అనుకూలంగా ఉంటుంది. వివాహది శుభకార్యములు అనుకూలిస్తాయి. ఈ ఫలితాలు అనేవి మీ జీవిత భాగస్వామి మరియు సంతానానికి సంబంధించిన వారి వారి జాతకాలలోని గోచార స్థితిని బట్టి బలాబలాల ప్రభావం అనేది మీ జాతక ఫలితాలపై హెచ్చు తగ్గులుగా ప్రభావం తప్పకుండా ప్రభావితం చేస్తాయి.
* రాహువు ఫలితాలు:- 15 ఏప్రిల్ 2022 నుండి పంచమ భావంలో ప్రవేశం చేస్తాడు. పుత్రులతో విరోధాలు ఏర్పడతాయి. తమ కంటే చిన్నవారితో లేదా క్రింది స్థాయి వారితో మాట పడవలసి పరిస్థితి వస్తుంది. ఎక్కువ శ్రమ తక్కువ ఫలితం కనబడుతుంది. స్త్రీ మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు.
* కేతువు ఫలితాలు:- 15 ఏప్రిల్ 2022 నుండి లాభ భావంలో సంచారం వలన భోగభాగ్యాలను ఇస్తాడు. కొత్త వస్తువుల కొనుగోలు చేస్తారు. అధికారుల ఆదరణ పొందుతారు. గొప్పవారితో స్నేహం చేసే అవకాశాలు ఏర్పడతాయి. దైవదర్శనాలు, తీర్ధ యాత్ర సందర్శనాలు కలుగుతావి.
గురు గ్రహం ప్రభావం వల్ల ఈ ఏడాదిలో తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. దీంతో మీరు చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. శని గ్రహం ప్రభావం కారణంగా, ప్రతికూల ఫలితాలు రావొచ్చు. రాహువు కారణంగా ఆర్థిక పరంగా చెడు ఫలితాలొస్తాయి. కేతువు గ్రహం వల్ల మాత్రం ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది.
గత ఏడున్నర సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బందు చవిచూసిన మీకు 17 జనవరి 2023 తో మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోనున్నాయి.
ఈ సంవత్సరం చివరి 2 నెలలు అనుకూలంగా ఉంటాయి.
అప్పలు చేసి ఆర్భాటాలు చేయవద్దు. ఖర్చులు తగ్గించండి.
వ్యవసాయదారులకు రెండు పంటలు అనుకూలించి ఆదాయం పెరుగుతుంది.
ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉండును. అనుకూల సమయం కొరకు సహనంగా వేచి ఉండాలి.
వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులకు కాస్త అనుకూలం.
రాజకీయ నాయకులకు అనవసరమైన వివాదాల జోలికి పోవద్దు. మాటను అదుపులో పెట్టుకోవాలి, ఆవేశ పూరితమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు పొందాలి అంటే ఎక్కువ శ్రమ పడాలి.
బంధు విరోదాలు మంచిది కాదు.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు లక్ష్మీ నారసింహా అభిషేకం, హోమ కార్యక్రమాన్ని నిర్వహించండి శుభం కలుగుతుంది. ఇంట్లో, వ్యాపార సంస్థలలో ప్రధాన ద్వారం లోపలి వైపు గుమ్మం పై భాగంలో గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పటం భోజపత్ర యంత్ర యుక్తంగా ఉన్న పటాన్ని ఏర్పాటు చేసి రోజు ఎర్రని పూలతో నిష్టగా పూజిస్తే సకల సంపదలతో పాటు వాస్తు దోషం, దృష్టి దోష నివారణ కల్గుతుంది. గోమాతకు గ్రాసం, పక్షులకు ధాన్యం, త్రాగడానికి నీళ్ళను ఏర్పాటుచేసిన వారికి ఈతి బాధలు తొలగి గ్రహ అనుకూలతలు కలుగుతాయి... సర్వేజనా సుఖినో భవంతు, లోకాస్సమస్తా స్సుఖినోభవంతు.. ఓం శాంతి శాంతి శాంతి: .. మీ ~ డా.ఎం.ఎన్.ఆచార్య
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications