Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కృష్ణాష్టమిని ఎప్పుడు జరుపుకోవాలి: దోసకాయను కోయడ వెనుక ఆచారం ఏంటీ?

ఈ నెల 16వ తేదీన కృష్ణ జన్మాష్టమి. పురాణాల ప్రకారం.. శ్రీకృష్ణుని 5,252వ జయంతి. ఈ సందర్భంగా భారత్ తో తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు, ఉపవాసాలు, భజనలు, దహీ హండి ఉత్సవాలతో ఈ వేడుకలు జరుగుతాయి.

17వ తేదీన నిశిత పూజను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అర్ధరాత్రి దాటిన తరువాత అంటే 12:01 నుండి 12:46 వరకు నిశీత పూజా సమయం. ఈ సమయంలో ప్రార్థనలు చేస్తూ, కీర్తనలు ఆలపిస్తూ శ్రీకృష్ణుడి లీలా విశేషాలను స్మరించుకుంటారు. దహీ హండి వేడుకలు 17న ఉదయం నిర్వహిస్తారు.

శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడనేది భక్తుల విశ్వాసం. అందుకే- నిశీత పూజా కార్యక్రమాలను జరుపుకొంటారు. ఆ సమయాన్ని అత్యంత పవిత్ర కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో భక్తులు పాలు, తేనె, పవిత్ర జలాలతో కృష్ణుడిని అభిషేకిస్తారు. హరే కృష్ణ.. మహా మంత్రాన్ని జపిస్తారు.

ఈ పండుగను గోకులాష్టమి, కృష్ణాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జయంతి వంటి పేర్లతో జరుపుకొంటారు. భాద్రపద మాసం కృష్ణ పక్షంలో అష్టమి తిథి నాటి అర్ధరాత్రి కృష్ణుడి జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. జన్మాష్టమిని స్మార్త, వైష్ణవ సంప్రదాయాల్లో రెండు రోజుల పాటు జరుపుకొంటారు.

జన్మాష్టమి ఉపవాసం విడిచే పారాన సమయం తిథి, నక్షత్రాల మీద ఆధారపడి ఉంటుంది. శాస్త్ర ప్రకారం- అష్టమి తిథి సూర్యోదయం ముందు ముగుస్తుంది. అందువల్ల 17వ తేదీన తెల్లవారుజామున 6:05 నిమిషాల తర్వాత పారన చేయాల్సి ఉంటుంది. చాలా మంది నిశీత పూజ పూర్తయిన తర్వాత.. అంటే 16వ తేదీన అర్ధారత్రి దాటిన తరువాత 12:46 తర్వాత ఉపవాసం విడుస్తుంటారు.

జన్మాష్టమి ఓ పండుగగా మాత్రమే పరిమితం కాలేదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడి బోధనలను గుర్తు చేస్తుందీ పర్వదినం. ధర్మం, కర్మ, భక్తి, జ్ఞానం వంటి వివిధ అంశాలపై లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని పదేపదే గుర్తు చేస్తుంటుంది. ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానాన్ని అలవరచుకోవలని బోధిస్తుంది.

జన్మాష్టమి రోజున దోసకాయను కోయడం కొన్ని రాష్ట్రాల్లో ఉన్న సంప్రదాయం. ఇది శ్రీకృష్ణుని జన్మకు ప్రతీకగా భావిస్తారు. అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మ సమయంలో దోసకాయను కోస్తారు. దాని విత్తనాలను తీసివేస్తారు. ఇలా చేయడం బొడ్డుతాడును కత్తిరించినట్లుగా భావిస్తారు. దోసకాయ.. బొడ్డుతాడుకు ప్రతీకగా పరిగణిస్తారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుంటూ ఈ ఉత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేస్తారు. ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. నివేదనలు సమర్పిస్తారు.

అలాగే- శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు. 17వ తేదీన తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంట‌ల‌కు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపైతిరుమాడ వీధులలో విహరిస్తారు.

ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని 17న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిసేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. మిగిలిన ఆర్జిత సేవల్లో ఎటువంటి మార్పు ఉండదు. అవి యధాతథంగా కొనసాగుతాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+