ధర్మమార్గంలోనే ఈ రాశివారి సంపద పెరుగుతుంది!
తెలుగు కొత్త సంవత్సరం ఉగాది రోజు నుంచి గ్రహాలు అనుకూలంగా మారి సిరిసంపదలనిస్తాయని, భోగభాగ్యాలనిస్తాయని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు నమ్ముతారు. ఈ ఏడాది తులా రాశివారికి ఎలా ఉందో పరిశీలిద్దాం
వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7గా ఉంది. వీరికి ఈ సంవత్సరం అదృష్టయోగం 50 శాతం ఉంది. చదువులో రాణించడమే కాకుండా ఉద్యోగపరంగా మంచి ఫలితాలను సాధిస్తారు. ధర్మమార్గంలోనే ఆర్థికంగా వృద్ధి చెందుతారు. స్థిరాస్తుల కోసం ఉన్న ధనాన్ని వినియోగిస్తారు. వ్యాపారస్తులు లాభాలను సొంతం చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఏప్రిల్ 23వ తేదీ నుంచి గురువు వల్ల ఈ రాశివారికి అదృష్టం లభిస్తోంది. శని పంచమంలో ఉన్నాడు. దీనివల్ల ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. అలా కాకుండా ఉ:డాలంటే శని శ్లోకం చదవాలి. అక్టోబరు 31వ తేదీ వరకు రాహువు సప్తమంలో ఉన్నాడు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. నవంబరు నుంచి యోగం బాగుంది. కేతువు జన్మరాశిలో ఉండటంవల్ల ఉత్సాహం, చురుకుదనం తగ్గకుండా ఉండేందుకు కేతు శ్లోకం పఠించాలి.

వృశ్చిక రాశివారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3 గా ఉంది.అనుకూలంగా ఫలితాలు పొందేందుకు ఈ రాశివారు ఎంతో చెమటోడ్చాల్సి ఉంటుంది. ఈ ఏడాది వీరికి అదృష్ట యోగం 75 శాతం ఉంది. ఏప్రిల్ 22వ తేదీ వరకు విద్యార్థులు రాణిస్తారు. మొహమాటంవల్ల ఖర్చులు పెరుగుతాయి. దీన్ని నియంత్రించుకోవాల్సి ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఈ రాశివారికి ఏప్రిల్ 22వ తేదీ వరకు గురువు పంచమంలో ఉంటాడు. దీనివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. 23వ తేదీ తర్వాత కలిగే ఇబ్బందుల నుంచి రక్షించుకోవడానికి గురు శ్లోకం చదువుకోవాలి. వీరికి అర్థాష్టమ శనిదోషం ఉంది. అందుకు శని శ్లోకం పఠించాలి. నవంబరు నుంచి లాభకేతువు మంచి శుభ ఫలితాలను అందిస్తాడు.
దీనికి ముందు ఇచ్చిన కథనాల్లో ఇతర రాశుల వివరాలివ్వడం జరిగింది. అందులో మేష రాశి, వృషభరాశి, మిథునరాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశివారి వివరాలివ్వడం జరిగింది. అవి చదువుకోగలరు.












Click it and Unblock the Notifications