AP EAPCET 2026 Results: ఎంసెట్ ఫలితాల రిలీజ్-ఇలా చెక్ చేసుకోండి..!

ఏపీలో దాదాపు 3 లక్షల మందికి పైగా విద్యార్ధులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎంసెట్ (AP EAPCET 2026 Results) ఫలితాలు ఇవాళ విడుదల కాబోతున్నాయి. మరికొద్ది గంటల్లోనే ఈ ఫలితాల విడుదలకు ఈసారి పరీక్షలు నిర్వహించిన కాకినాడ జేఎన్టీయూ ఏర్పాట్లు చేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫలితాలు విడుదల చేస్తారు. అనంతరం ఉన్నత విద్యామండలి కామన్ ఎంట్రన్స్ టెస్టుల వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలు తెలుసుకునేందుకు వీలుంది.

JoSAA 2026: జోసా కౌన్సెలింగ్ లో టాప్ బ్రాంచ్, టాపర్ల ఛాయిస్ ఐఐటీలివే..!
JoSAA 2026: జోసా కౌన్సెలింగ్ లో టాప్ బ్రాంచ్, టాపర్ల ఛాయిస్ ఐఐటీలివే..!

ఈసారి రాష్ట్రంలో మొత్తం 3.29 లక్షల మంది వివిధ విభాగాల్లో ఎంసెట్ పరీక్షలు రాశారు. మే 12 నుంచి 30వ తేదీ వరకూ ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలను జూన్ 1నే విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ, సీబీఎస్ఈ రీవెరిఫికేషన్ ఫలితాల కోసం వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి ఇవాళ ఫలితాలు విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ ఫలితాలు వెబ్ సైట్ లోకి కచ్చితంగా మధ్యాహ్నం 3 గంటలకు అప్ లోడ్ చేస్తారు. అనంతరం వెబ్ సైట్ లోనూ, మనమిత్రా వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

AP EAPCET 2026 Results out today here is how to check download score cards
అమెరికాలో క్యాంపస్ ఓపెన్ చేయబోతున్న భారతీయ ఐఐటీ..!
అమెరికాలో క్యాంపస్ ఓపెన్ చేయబోతున్న భారతీయ ఐఐటీ..!

ఆ తర్వాత అభ్యర్ధులు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. వెబ్ సైట్ లోకి వెళ్లగానే ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాల పేరుతో లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మరో విండో ఓపెన్ అవుతుంది. అక్కడ విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. అలాగే వాటిని ప్రింట్ తీసుకునేందుకు కూడా అక్కడే ఆప్షన్ ఇస్తారు. ఇలా స్కోర్ కార్డుల్ని ప్రింట్ తీసుకుని కౌన్సిలింగ్ కు వెళ్లాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+