మీ దరిద్రం భరించలేనంటూ ఈ రాశులకు అష్టైశ్వర్యాలను ప్రసాదించిన శనిదేవుడు

ఖగోళ శాస్త్రం ప్రకారం మండలంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరో రాశిలోకి పరిభ్రమిస్తుంటాయి. ఇది వాటి సహజ పరిణామం. నిర్దిష్ట సమయంలోనే ఇలా జరుగుతుంటుంది. గ్రహాలు ఇలా రాశుల సంచారం చేయడంవల్ల కొన్ని రాశులకు మంచి ఆర్థిక ప్రయోజనాలను ఇవి కలిగిస్తుంటాయి. అలాగే మరికొన్ని రాశులవారు వారి వారి కర్మలను బట్టి ఫలాలను అనుభవించాల్సి ఉంటుంది. నవగ్రహాల్లో కీలకమైన శనిదేవుడు అంటే అందరికీ భయమే. ఎందుకంటే అన్నీ అశుభాలే ఇస్తుంటాడని, కష్టాలను ఇస్తుంటాడని అనుకుంటారు.

కానీ ఆయన అనుగ్రహిస్తే జీవితమే మారిపోతుందనే విషయం చాలామందికి తెలియదు. ఆయన న్యాయదేవుడు. కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటారు. రాహువుకు సంబంధించిన శతభిష నక్షత్రంలోకి శనిదేవుడు సంచారం చేస్తుండటంవల్ల కొన్ని రాశులపై శని అశుభ దృష్టి తొలగిపోయి మంచి జరుగుతుంది. ఈ ఏడాది చివరి వరకు అక్కడే సంచరిస్తాడు. దీనివల్ల ఏయే రాశులకు శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం.

lord shanidev transit in satabhisha nakshatram three zodiac signs will get more money and somany benefits

మేషరాశి
పెద్దలకు సంబంధించిన ఆస్తులు కలిసివస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలోనే కొత్త పనులు ప్రారంభించవచ్చు. అనుకూల సమయం. వ్యాపారస్తులకు ఆకస్మిక లాభం ఉంది. ఎంత కష్టపడితే అంత డబ్బును సంపాదిస్తారు. అదనపు ఆదాయానికి మార్గాలు తెరుచుకుంటాయి.

తులా రాశి
కొన్ని సంవత్సరాలుగా ఈ రాశివారు అనుభవిస్తున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. చిరకాలంగా మీరు కలలు కంటున్న కోరికలు నెరవేరే సమయం ఇది. ఆదాయం పెరగడంతో కుటుంబ సభ్యుల మధ్య ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. దాంపత్య జీవితంలో ఉన్నవారు సుఖసంతోషాలను అనుభవిస్తారు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు.. ఇద్దరికీ బాగుంటుంది.

కుంభ రాశి
కష్టాలన్నీ పటాపంచలవుతాయి. వీరి జీవితంలో సంపద పెరుగుతుంది. దీనివల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులవల్ల విజయం చేకూరడంతోపాటు వారికి పనులన్నీ పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉండే సమయం. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+