వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏప్రిల్ 4న చంద్రగ్రహణం: ఏం చేయొచ్చు?

By Pratap
|
Google Oneindia TeluguNews

చైత్ర శుక్ల పూర్ణిమ శనివారము అనగా 04 ఏప్రిల్‌ 2015 రోజున హస్త నక్షత్రంలో కన్యరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుంది.

చైత్రపూర్ణిమ నాడు శనివారం రావడం - అలభ్యయోగం’’. ఈకాలంలో చేసే దానం,జపం వల్ల అశ్వమేధ ఫలం వస్తుంది. స్పర్శ కాలం మధ్యాహ్నం 03.45 సూర్యాస్తమయం (హైదరాబాదు) సాయంత్రం 06.26 మోక్షకాలం రాత్రి 07.17 మొత్తం పుణ్యకాలం 00.49.

గమనిక ` గ్రహణం 03.45 నుండి ప్రారంభమైనా కూడా ,పగటికాలంలో ఎక్కువ ఉండటం వల్ల 06.26 నుండి లెక్కలోకి తీసుకుంటారు.

కాలనిర్ణయ చంద్రిక ప్రకారం ` నిత్యభోజనాలు, ఆబ్దీకాలు చేసుకునే సమాచారం

lunar eclipse on april 4

గ్రస్తోదయేవిధో:పూర్వం నాహర్భోకనమాచరేత్‌ ।
గ్రస్తోదయే భవేదింద్రో: దివాశ్రాద్ధం నకారయేత్‌ ।
రాత్రావపి తదాకుర్యాత్‌ ప్రత్యబ్దం మనురబ్రవీత్‌ ॥

తాత్పర్యం - (దీనిప్రకారం) శుద్ధ మోక్షనంతరం (రాత్రి 07.17 తర్వాత ) చేసుకోవాలి .నిత్యభోజనం ప్రత్యాబ్దీకాలు
జరుపుకోవాలి.ఈరాత్రివేళ శ్రాద్ధాచరణ విశేష ధర్మశాస్త్రంను బట్టి నిర్ణయించారు. ఐతే విధవా కర్తృత్వ శ్రాద్ధమయితేఈ రోజు పూర్తిగా ఉపవసించి మరునాడు జరుపవచ్చు.దమనపూజాదులన్నీ గ్రహణానంతరమే జరుపుకోవాలి.

గహ్రణ గోచారము

హస్త నక్షత్రం వారు, కింద ఇవ్వబడిన అధమఫలితం పొందేవారు .ఈగ్రహణమును చూడరాదు.

మిథున , కర్కాటక, వృశ్చిక ,కుంభ రాశుల వారికి శుభ ఫలితం. వృషభ ,తుల, మకర , మీన రాశుల వారికి మధ్యమ ఫలం. మేష , సింహ , కన్య , ధను రాశుల వారికి అధమ ఫలం.

పాటించవలసిన నియమాలు

గ్రహణ కాలానికి 9 గంటలముందే తినాలి తర్వాత తిన కూడదు. శుభఫలము ఉన్న రాశివారు అనుష్ఠానాదికాలు చేసుకొనడానికి సరైన సమయంగా తెలుసుకోవాలి. మధ్యమ ఫలముఉన్నవారు, అధమ ఫలము ఉన్నవారు శక్తికొద్దీ వస్త్ర, ధాన్య, శాకాది, దానాలు చేసుకోవాలి. గ్రహణ కాలంవరకూ దేవతామూర్తుల మీద ,నిల్వ ఉండే ఊరగాయ, ధాన్యము, నీరు మొదలైన వాటిలో దర్భ వేసిగ్రహణ అనంతరం తీసి వేయాలి.

మరుసటి రోజు దేవతామందిరాన్ని ,దేవతా మూర్తులను శుద్ధపరచుకోవాలి.గ్రహణసమయంలో దేవతా పూజలు అభిశేకాదులు చేయకూడదు .ఉపదేశిత మంత్రము కానీ ఏదైనా దేవతానామాన్నిజపిస్తే గణనీయ ఫలము అని శాస్త్రవాక్యము.గర్భవతులు గ్రహణం చూడరాదు.బయట తిరగారాదు.

English summary
Astrologer Maruthi Sharma explains what to do, what not to do during Lunar eclipse on April 4.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X