SIR తో జాగ్రత్త..! నేతలకు చంద్రబాబు అలర్ట్-కీలక నిర్ణయాలు..!
ఏపీలో ఈ నెల 15న ప్రారంభం కాబోతున్న ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)పై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు (Chandrababu) ఇవాళ సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై నిర్వహించిన వర్క్ షాప్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జ్‌లు, పరిశీలకులు, బీఎల్ఏలు హాజరయ్యారు. వీరికి ఓటర్ల జాబితా సవరణపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. SIRలోనూ కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండాలని ఆయన సూచించారు.
2002 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకుని స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ప్రక్రియను చేపడుతున్నారని, జులై 14వ తేదీలోగా రెండుసార్లు ఓట్ల మ్యాపింగ్ చేస్తారని చంద్రబాబు టీడీపీ నేతలకు తెలిపారు. ఈ రెండు సార్లు మ్యాపింగ్ జరిగేలోగా ఓట్ల చేరికలు పర్ఫెక్టుగా పూర్తి కావాలన్నారు. SIRను అందరూ సీరియస్‌గా తీసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన తెలిపారు.
ఓట్లు నమోదు చేసుకోవడం ఓటర్ల బాధ్యత అన్నారు. ఓట్ల చేరికలపై ప్రజలకు అవగాహన కల్పించడం రాజకీయ పార్టీగా మన ప్రాథమిక బాధ్యత అన్నారు. ఏ ఎన్నికలకైనా ఓటర్ల జాబితా అనేది చాలా కీలకమని, ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికల్లో వ్యూహాలు అమలు చేయగలమన్నారు. పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉంటుందన్నారు.

SIRపై ప్రతీ రోజూ పర్యవేక్షణ చేస్తామని, మన ఓట్లు ఉన్నాయా..? లేవా..? అనేది నిరంతరం చూసుకోవాలన్నారు. ఏపీలో స్థానికులు వివిధ రకాల కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్తారని, వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్లు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లేయడం వల్లే కూటమికి 164 సీట్లు వచ్చాయని గుర్తుచేశారు. కూటమి పార్టీలను కూడా సమన్వయం చేసుకుని వెళ్లాలన్నారు. ఎన్నికలప్పుడే మిత్రపక్షాలతో కలుస్తాం, మిగిలిన రోజుల్లో పట్టించుకోం అంటే కుదరదన్నారు. ప్రభుత్వంలోనే కాదు, అన్ని కార్యక్రమాల్లోనూ జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకోవాలన్నారు. పార్టీల మధ్య సమన్వయానికి SIR మొదటి టెస్ట్ అన్నారు.














Click it and Unblock the Notifications