మేలుకో మానవ మేలుకో : ఇప్పటికీ జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరుగుతుందో తెలుసుకో..!

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ప్రస్తుత కాలం అంత అనుకూలం కాదు కాబట్టి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడం ఎంతో అవసరం.

మనం ఇప్పుడు చాలా విషమ పరిస్థితిలో ఉన్నాం. మన చుట్టు ప్రక్కల కరోనా మహమ్మారి దాక్కుని ఉంది.

సర్వేల ప్రకారం..... మనం టీవీలలో టెస్టులు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే వింటున్నాం.

Man should wake up and take precautions to battle against Coronavirus

టెస్టులు చేయించుకోకుండా వైరస్ సోకి ఉన్న వారు లక్షల్లో మన మధ్యే ఉన్నారు.

అందుచేత..... అనవసరంగా ఎవ్వరూ ఎవరి ఇంటికి వెళ్ళకండి.

తెలిసిన వారే కదా అని వెళ్లి, వారిని ఇబ్బంది పెట్టకండి.

చెప్పకుండా చొరవగా వెళ్లి, వాళ్ల ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకండి. బయట ఏ వస్తువులను సాధ్యమైనంతవరకు ఎక్కడ పడితే అక్కడ వాటిని ముట్టుకోకండి.

ఒకవేళ బంధుమిత్రులతో మాట్లాడాలనుకుంటే, ఫోన్ కాల్ చేసి మాట్లాడండి.

చూడాలనిపిస్తే వీడియో కాల్ చేసి మాట్లాడండి.

ప్రత్యక్షంగా కలవాలి అనుకుంటే ముందే ఫోన్ చేసి ఇంటి ముందుకు వెళ్లి బయటకు పిలిచి ఎన్ 95 మాస్కు ధరించి భౌతిక దూరం పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకొని కాసేపు మాట్లాడిరండి. డబుల్ మాస్కులు పెట్టుకోవడం ఉత్తమం.

అంతేకానీ చొరవతో తగుదునమ్మా అంటూ నేరుగా ఇంట్లోకి వెళ్లి ఏమిటి కబుర్లు అంటూ అనవసరవిషయాలు మాట్లాడకండి.

వారు మొహమాటంతో అప్పుడు మిమ్మల్ని ఏమీ అనకపోయినా మీరు వెళ్లిపోయిన తర్వాత మిమ్మల్ని తిట్టుకోవడం ఖాయం.

వారు మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచినా మీరు గౌరవంగా పర్వాలేదు, మరోసారి వస్తానని చెప్పి వెళ్ళండి, అప్పుడే మీరు మర్యాద తెలిసిన వ్యక్తులుగా పరిగణించబడతారు.

మీరు వారికి ఎంత ప్రాణ స్నేహితులైనా కావచ్చు లేక ఎంత దగ్గరి బంధువులైనా కావచ్చు ఎవరిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకండి.

ఇక ఇరుగు పొరుగు వారు ఇచ్చే వంటకాలను ససేమిరా తీసుకోకండి.

అలాగే వారికి మీ వంటకాలను ఇతర తినుబండారాలను ఏమీ ఇవ్వకండి.

ఇచ్చి పుచ్చుకోవడాలు కొంతకాలం ఆపేయండి.

ఈ విషయమై వారితో ఒకసారి సౌమ్యంగా చెప్పండి.

స్నేహితులతో కలిసి అన్నిరకాల పార్టీలు కొన్ని రోజులు ఆపేయండి.

ఈ పార్టీల వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

అవసరం లేకపోయినా రోడ్డు మీదకు వెళ్ళకండి, వాకింగ్ కూడా మానేయండి.

ఇంట్లోనే యోగ, మెడిటేషన్, సూర్య నమస్కారాలు, స్కిప్పింగ్ వంటివి చేయండి.

నువ్వు నీ శ్రేయోభిలాషులకు ఇచ్చే గౌరవం వారిని కలవకపోవడమే. అదే ఇరువురికీ క్షేమదాయకం.

అమ్మనాన్నకు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు ఇదే సదావకాశంగా భావించి వారికి సేవలు చేసి తరించండి.

చిన్న పిల్లలను ముద్దులు పెట్టుకోకుండా జాగ్రత్త పడండి.

తప్పని సరిగా బయటకు వెళ్లివస్తే సానిటైజర్ చేసుకోవడం మర్చిపోవద్దు.

తరచు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

బట్టలు ఉతుక్కునేప్పుడు డెటాల్ ఉపయోగించండి.

ఇల్లు, ఒళ్ళు ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోండి.

సాయం సంధ్యాకాలంలో ఇంట్లో దూపం వేసుకోండి.

కుటుంబ సభ్యులలో ఎవరికైనా జలుబు, దగ్గు, నీరసం, జ్వరం లాంటివి అనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వైద్య పరీక్ష చేయించండి.

పొరపాటున పాజిటివ్ వస్తే బయట తిరగకండి, మీ వల్ల ఎందరో ఇబ్బందులపాలు అవుతారు.

పాజిటివ్ వస్తే అనవసరమైన భయదోళనలు చెందకండి, డాక్టర్లు సూచించిన పద్దతులలో నడుచుకుంటే త్వరగా కోలుకుంటారు.

అనవసరంగా అధైర్య పడవద్దు... ధైర్యమే కరోనాకి మొదటి పెద్ద మందు.

రోజు ఉదయం గోరువెచ్చని నీళ్ళతో గాగ్లింగ్ చేయండి. పరిగడుపున గోరువెచ్చని నీళ్ళనే త్రాగండి.

దాహం వేయకపోయినా తరచు గొంతు నీళ్ళతో తడుపుతూ.. ఉండండి.

ఆవిరి పట్టుకోవడం వలన ఎన్నో లాభాలున్నాయి.

ఎవరికైనా తెలిసిన వాళ్లకు కరోనా పాజిటివ్ వస్తే..? మీరు వారికి ఫోన్ ద్వార మనోధైర్యాన్ని ఇవ్వండి.

ప్రభుత్వ సూచనలను పాటించండి, మానవజాతి ఆరోగ్య సంరక్షణకు నీ వంతుగా పరిపూర్ణంగా సహకరించు..

లేనిపోని అనవసరమైన 'వదంతులు' తప్పుడు ప్రచారాలను నమ్మకండి. మనోధైరంతో ఉంటూ సాటివారికి భాద్యతగా ధైర్యనివ్వండి.

ఇవి యదార్ధములుగా భావించి ఆచరించి ఆరోగ్యంగా ఉండండి.

సమస్త లోకా: సుఖినో భవంతు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+