ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా
మాస్ డైలాగ్స్.. యూత్ మెచ్చే లవ్ స్టోరీ.. కళ్ళెంబడి నీళ్లు తెప్పించే ఎమోషన్స్.. వీటన్నిటి కలయికే 'డ్రింకర్ సాయి'. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనే క్రేజీ ట్యాగ్‌లైన్‌తో థియేటర్లలోకి వచ్చి, మాస్ అండ్ యూత్ ఆడియెన్స్ మనసులు గెలుచుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న 'డ్రింకర్ సాయి'.. అక్కడ కూడా తన విజయయాత్రను దూకుడుగా కొనసాగిస్తోంది. మరీ ముఖ్యంగా ఫ్రీ ఆన్ జీ5 విభాగంలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో టాప్-1 ట్రెండింగ్ మూవీగా దూసుకుపోతోంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు, మళ్లీ మళ్లీ చూడాలనుకునే వాళ్లు ఈ సినిమాను ఓటీటీలో ఎగబడి చూస్తున్నారు.
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్.. హీరో ధర్మ మహేష్ వన్ మ్యాన్ షో. ఒక సాధారణ యువకుడి జీవితంలో వచ్చే ఒడిదుడుకులు, లవ్, ఎమోషనల్ పెయిన్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆవేశం, తిరుగుబాటు.. ఇలా అన్ని రకాల వేరియేషన్స్‌ను ధర్మ మహేష్ ఎంతో నేచురల్‌గా పండించాడు. ఈ సినిమాలో చూపించిన అద్భుత నటనకు గానూ ధర్మ మహేష్ దుబాయ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక గామా అవార్డ్స్‌లో బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. కీలక సీన్స్‌లో ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్య శర్మ తన అందం, యాక్టింగ్‌తో కుర్రకారును పడేసింది. హీరోతో ఆమెకున్న కెమిస్ట్రీ సినిమాకు మెయిన్ హైలైట్. ఇక సీనియర్ నటులు పోసాని కృష్ణ మురళీ, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, రీతూ చౌదరి, భద్రం, కిర్రాక్ సీత, ఫన్ బకెట్ రాజేష్, రాజ ప్రజ్వల్ లాంటి భారీ తారాగణం తమ నటనతో కథను మరింత ముందుకు నడిపించారు. డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి నేటి తరం యువత పల్స్ పట్టుకుని, లవ్ , ఎమోషన్స్‌ను పర్‌ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ స్క్రీన్ పై మ్యాజిక్ చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్ అందించిన సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఎమోషనల్ సీన్స్‌లో మ్యూజిక్ థియేటర్లలోనే కాదు, ఇప్పుడు హోమ్ థియేటర్లలోనూ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తోంది. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్ర్కీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మాతలు బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ధర్మ మహేష్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన 'డ్రింకర్ సాయి'.. రోజురోజుకూ ఓటీటీలో వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.












Click it and Unblock the Notifications