మిధునరాశిలో కుజ గోచారం.. ఆగస్టులో వీరికి మహారాజయోగం!!
గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి జీవితాలలోనూ సంచలన మార్పులు వస్తాయి. ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న కుజుడు త్వరలో రాశిని మార్చుకుంటాడు. కుజుడు ప్రతి 45రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. ఆగస్టు నెలలో 26వ తేదీన కుజుడు మిధున రాశిలో సంచరించబోతున్నాడు. మిధున రాశిలో కుజ సంచారం వలన కొన్ని రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం వల్ల కనకవర్షం కురుస్తుంది. మరి ఆ రాశులేమిటో తెలుసుకుందాం.
వృషభ రాశి
కుజుడు సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరికి బంగారం లాంటి అవకాశాలు వస్తాయి. వృషభ రాశి జాతకులు ఏ రంగంలో పనిచేసిన పురోగతికి అవకాశం ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది.

సింహరాశి
కుజ సంచారం కారణంగా సింహ రాశి వారు అదృష్టాన్ని పొందుతారు. ఈ సమయంలో సింహ రాశి వారికి ధన లాభం కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో అఖండ విజయాలు ప్రాప్తిస్తాయి. వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారి కెరీర్ ఊహించని విధంగా మారుతుంది.
వృశ్చిక రాశి
కుజ సంచారం కారణంగా వృశ్చిక రాశి వారి జీవితాల్లో అనుహమైన మార్పులు వస్తాయి. ఈ సమయంలో వీరికి ధనలాభం కలుగుతుంది. పూర్వీకుల ఆస్తి వారసత్వంగా వస్తుంది . ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బులు వసూల్ అవుతాయి. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. కెరీర్ లోనో గణనీయమైన పురోగతి సాధ్యమవుతుంది. కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం.
మకర రాశి
కుజ సంచారం కారణంగా మకర రాశి వారికి అన్ని విధాలుగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగం చేసే చోట సహ ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పనైనా సులభంగా పూర్తిచేసే శక్తి కలిగి ఉంటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications