mauni amavasya : నేడే మౌని అమావాస్య.. ఈ కూరలు తింటే అష్టకష్టాలు!!
సనాతన ధర్మంలో మౌని అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 9వ తేదీన అంటే నేడు మౌని అమావాస్య జరుపుకుంటున్నాం. మాఘమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. దీనినే చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని చెప్తారు. అంతటి విశిష్టత మౌని అమావాస్యకు ఉంది.
ఎంతో పవిత్రమైన మౌని అమావాస్యకు సంబంధించిన అనేక నియమాలు ఉన్నాయి. ప్రతి నెలలో వచ్చే అమావాస్యతో పోలిస్తే మౌని అమావాస్యకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మాఘమాసంలో మౌని అమావాస్య తిథి ఫిబ్రవరి 9వ తేదీన ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాలకు ప్రారంభమై, మరుసటి రోజు ఫిబ్రవరి 10వ తేదీన ఉదయం నాలుగు గంటల 20 నిమిషాలకు ముగుస్తుంది.

మౌని అమావాస్య రోజు ఎవరైతే నిష్టగా నదీస్నానం చేసి, శ్రీమహా విష్ణువును పూజించి, దానాలు చేస్తారో .. వారు విశేషమైన ఫలితాలను పొందుతారని చెప్తారు . అంతేకాదు మౌని అమావాస్య నాడు పొరబాటున కూడా కొన్ని కూరలు వండకూడదని, తినకూడదని చెప్తున్నారు. ఒకవేళ ఆ కూరలు వండి తింటే అష్ట కష్టాలు తప్పవని చెబుతున్నారు.
మౌని అమావాస్య నాడు ఎవరూ మాంసాహారం వండకూడదు. తినకూడదు. మాంసాహారం వండి తింటే కచ్చితంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మౌని అమావాస్య రోజు పాలు, పెరుగు పొరపాటున కూడా తీసుకోకూడదు. ఒకవేళ వాటిని తీసుకోవలసి వస్తే ఇందులో పసుపు కానీ, బెల్లం ముక్క కానీ వేసి తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు కూరగాయలను వండేటప్పుడు కూడా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
ఈరోజు కూరలలో ఆవాలు ఉపయోగించకూడదు. ముల్లంగి, పొట్లకాయ, దోసకాయ వంటి కాయగూరలను ఈరోజు వండకూడదు. తినకూడదు. ఇక ఈ కూరగాయలు కాకుండా మిగిలిన అన్ని రకాల కూరగాయలను వండుకోవచ్చు. ఖచ్చితంగా సాత్విక ఆహారాన్ని ఈరోజు తీసుకోవచ్చును. ఈ రోజు సాత్విక ఆహారం తీసుకుంటే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మాంసాహారం తింటే దరిద్రం పట్టుకుంటుంది అని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications