బుధుడి తిరోగమనం.. ఈ రాశులకు కొత్త ఏడాదిలో ఆకస్మిక ధనలాభం
జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాకుమారుడు బుధుడు. తెలివితేటలు, వ్యాపారం, తర్కం, రచన, జ్ఞానం,ఆర్థిక వ్యవస్థకు కారకుడు. జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు. 2026లో బుధుడు మూడుసార్లు తిరోగమనంలో సంచరించనున్నాడు. ఒకసారి తిరోగమనంలోకి వెళితే దాదాపు 69 రోజుల వరకు ఉంటాడు. అలా ఏడాది మొత్తం మీద మూడు సార్లు జరుగుతుంది. దీనివల్ల జాతకులు అనుకన్న పనులన్నింటినీ చాలా సులువుగా పూర్తిచేయగలుగుతారు. ఏయే రాశులకు కలిసిరాబోతోందనే విషయాన్ని తెలుసుకుందాం.
వృషభ రాశి
ఆర్థిక నిర్ణయాలనేవి సకాలంలో తీసుకుంటారు. ఉద్యోగులకు బోనస్ లభిస్తుంది. కార్యాలయంలో మంచి పేరు తెచ్చుకుంటారు. లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తారు. ఆన్ లైన్ గేమింగ్ కు బాగా అలవాటుపడతారు. అయితే అదృష్టం కొద్దీ కొంత డబ్బును పొందుతారు. అయితే దీన్ని వ్యసనంగా మార్చుకుంటే రోడ్డునపడే అవకాశం ఉంది. అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి.

మిథున రాశి
లాటరీలు కొనుగోలు చేస్తే భారీ మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. అయితే అదేపనిగొ కొనొద్దని పండితులు సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఈ వ్యాపారం వీరికి బాగా కలిసివస్తుంది. వ్యూహాత్మక ఆలోచనలతో నిర్ణయం తీసుకుంటారు. మంచి ఫలితాన్ని పొందుతారు. గతంలో కంటే ఆర్థికంగా బలపడతారు. కమ్యూనికేషన్స్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలున్నాయి.
కుంభ రాశి
అద్భుతమైన విజయాలు సాధిస్తారు. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నావారికి ఈ సమయం చాలా బాగుంటుంది. అంతేకాకుండా కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధిస్తారు. చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. గతంలో ఆగిపోయిన మీ డబ్బులు తిరిగి చేతికి అందుతాయి.












Click it and Unblock the Notifications