• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పితృ దోషాల ప్రభావ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

జోతీష్య శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి జన్మ కుండలిలో కొన్ని గ్రహాల స్థితి కారణంగా పితృదోషం ఉన్నట్లు గుర్తించవచ్చు. పితృదోషానికి ముఖ్య కారణం జన్మకుండలిలో రవి మరియు శని భగవానుడు గ్రహములకు మధ్య ఉన్న సంబంధంగా చెప్పవచ్చు. రవి, శని భగవానుడు ఈ రెండు గ్రహాలు పరివర్తన చెందితే దానిని పితృదోషముగా గుర్తించాలి. రవి, శని భగవానుడు ఒకరిపై మరొకరి దృష్టి పడినప్పుడు లేక రవి, శని భగవానుడు కలిసి ఒకే భావంలో ఉన్నప్పుడు జాతకునికి పితృదోషం ఉన్నట్లు గుర్తించాలి. ఇక్కడ రవి, శని భగవానుడు సంబంధం లాగానే జాతకంలో గురు, బుధ గ్రహముల వలన కలిగే సంబంధం కూడా పితృదోషంను సూచిస్తుంది. కాకపోతే గురు, బుధ వలన కలిగే పితృదోషం ఎక్కువ ప్రభావం చూపదు.

పురాణాల ప్రకారం మన పితృదేవతలు ( గతించిన తండ్రి, తాత, ముత్తాత ) జీవించి ఉన్నప్పుడు చేసిన దోషములు, పాపాలు శాపంగా మారి తర్వాతి తరం వారికి కూడా అవి ప్రభావితం చేస్తాయి. దీనిని పితృదోషం అని అంటారు. నిజానికి ఒక వ్యక్తి తాను గత జన్మలో చేసిన పాప పుణ్య కార్యముల వలన మాత్రమే ఈ జన్మలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆత్మలు అందరూ కూడా ఇప్పుడు నివసిస్తున్న వారికి ఎవరో ఒకరికి పూర్వీకులు అయే ఉంటారు. పూర్వీకులు గతించిన తర్వాత అటు మోక్షం పొందక ఇటు ఇంకో జన్మను ఎత్తి పాప ప్రక్షాళన చేసుకోలేక ఊర్థ్వలోకంలో ఉన్నవారిని పితృదేవతలు అంటారు. ఈ పితృదేవతలు మన DNA రూపంలో గోత్రమును కొనసాగిస్తూ కుటుంబంలోని మగవారిలో 'y'chromosomes (క్రోమోజోమ్) రూపంలో ఉంటారు.

Know the impact of fore fathers mistakes on us

మన ఆరాలో కూడా పొసిస్ అయి ఉంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పితృదోషం వలన బాధపడతాడో, ఆ వ్యక్తి తర్వాతి తరమును ( కొడుకు, మనుమడు) చూచుటకు కష్ట తరం అవుతుంది. ఆ వ్యక్తి కి సంతానం కలగకపోవడం లేక తన సంతానం తన నుంచి వీడిపోవడం లేక వంశాభివృద్ది కలిగే పుత్ర సంతానం కలుగకపోవడం లాంటి పితృదోషం ఉన్న వారు అనుభవించాల్సి వస్తుంది.

పితృదోషం వలన మానవుడు ఎదుర్కొనే ప్రభావాలు :-

* పితృదోషం ఉన్న వ్యక్తి తన గొత్రాన్ని కొనసాగించడానికి 'వంశాభివృద్ది' కొరకు పుత్ర సంతానం కలగదు.

* పితృదోషం ఉన్న వ్యక్తికి తరచూ గర్భవిచ్చితులు జరగటం,

* సోదర సోదరీమణుల మధ్య విభేదాలు వచ్చి వీడిపోవడం.

* పితృదోషం ఉన్న వారి యొక్క పుత్రుడు ఎటువంటి కారణం లేకుండానే విద్యను లేక ఉద్యోగాన్ని మధ్యలోనే అర్థాంతరంగా ఆపివేసి రావడం.

* వివాహం చేసుకోవడానికి అంగీకరించకపోవడం.

* వివాహం చేసుకునేందుకు సరైన వారు దొరక్కపోవడం.

* పితృదోషం ఉన్న వారి సంతానం అతి చిన్న వయసులోనే మధ్యానికి లేక డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లు చేసుకుని జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటారు.

* శారీరక లేదా మానసిక దౌర్బల్యం కలిగిన సంతానానికి జన్మనివ్వడం జరుగుతుంది.

* పితృదోషం ఉన్న వారి ఇంట్లో తరచూ పాలు పొంగిపోవడం, కొత్త గోడలకు తొందరగా చీలికలు రావడం. నీటి పంపులు లీకేజీ రావడం, కుళాయిలోని నీరు కారుతూనే ఉండటం తరచూ జరుగుతాయి.

* పితృదోషం ఉన్న వారి వ్యాపారంలో అప్పులు, నష్టములు కలగటం, తన కింద పనిచేసే వారు కూడా చిన్న చూపు చూడటం జరుగుతుంది.

* పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క ఉద్యోగం మారుతూనే ఉండటం లేదా ఉద్యోగమే లేకపోవడం జరుగుతుంది.

* వారి సంతానం పెద్ద వారిని గౌరవించక, అతి దురుసుతనంగా మాట్లాడటం జరుగుతుంది.

* ఇంట్లో తరచూ చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి.

* పీడ కలలు రావడం జరుగుతూ ఉంటుంది, ఇంట్లో శుభ్రత ఉండదు.

*పితృదోషం ఉన్న వారు పాటించాల్సిన నియమాలు :-

* పని మీద బయటికి వెళ్లినప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి.

* గతించిన పితృలకు సాంప్రదాయ పద్ధతిలో శార్థ కర్మలు జరిపించాలి.

* గతంలో చేసిన పాపకార్యాలకు మనసులో ప్రాయశ్చిత్తం తెలుసుకోవాలి, పేదవారికి ధానాలు చేయాలి.

* కుటుంబంతో మరియు సొదర సోదరీలతో మంచి అన్యోన్యత పాటించాలి.

* పూర్వీకుల ఆశీర్వాదం కోసం ఒక అమ్మాయి యొక్క వివాహ బాధ్యత తీసుకోవాలి.

* రావి చెట్టుకు రోజు నీరు పోస్తూ 11 ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి,

* అమావాస్య పౌర్ణమి రాత్రి పూట ఉపవాసం పాటించాలి.

* సలైన పరిహారాలు వ్యక్తిగత జాతకచక్రాన్ని అనుసరించి దోషాలు కనుగొని దానికి తగిన పరిహారాలు చేసుకున్నచో సంపూర్ణ శుభ ఫలితాలు పొందవచ్చును. జాతక చక్ర పరిశీలనలో చూడాల్సిన అత్యంత ప్రధాన అంశాలు దోషాలు, శాపములు, అవయోగాలు, అరిష్టాలను కలగ చేసే పితృశాపం.

English summary
Know the impact of fore fathers mistakes on us
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X