ఈనెల 13 నుంచి 5 రోజులపాటు మృత్యు పంచక యోగం.. ఈ పనులు చేయొద్దు
ఈనెల 13వ తేదీన మృత్యు పంచక యోగం ఏర్పడింది. అగ్ని పంచకం, మృత్యు పంచకం, రాజ పంచకం, చోర పంచకం, రోగ పంచకం వంటి వివిధ పంచకాల్లో మృత్యు పంచక యోగం ఒకటి. ఇది ఐదురోజులు ఉంటుంది. ఇది చాలా అశుభకరమైనదిగా పంచాంగం భావిస్తుంది. ఎటువంటి శుభకార్యాలు చేయరు. వాటిని పూర్తిగా నిషేధిస్తారు. పంచకం ప్రతి నెల వస్తుంది. అయితే నెలలోని రోజుపై ఆధారపడి శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి.
మృత్యు పంచక కాలంలో ఎవరైనా మరణిస్తే, అది కుటుంబానికి మంచి చేయదు. ఆ కుటుంబంలో కలిగే ఇబ్బందులకు సూచికలాంటిదని పండితులు చెబుతున్నారు. మృత్యు పంచకం ఎప్పుడు మొదలవుతుంది? ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? అనే వివరాలు తెలుసుకుందాం.
మృత్యు పంచక సమయం.. మే 13 ఉదయం 12:18 గంటలకు ప్రారంభమై మే 17 ఉదయం 7:39 గంటలకు ముగియనుంది.

పంచక సమయంలో ఏ రాశులు నివసిస్తాయంటే : జ్యోతిష్యం ప్రకారం మొత్తం 27 రాశులుంటాయి. ఈ 27 రాశులలో.. చివరి ఐదు రాశులు - ధనిష్ఠ, శతభిష, పూర్వాభాద్రపద, ఉత్తరా భాద్రపద , రేవతి రాశుల కలయికను పంచకంగా పరిగణిస్తారు. ఈ ఐదు రాశుల కలయిక శుభాలనివ్వకుండా కేవలం అశుభాలనే ఇస్తోంది. చంద్రుడు కుంభ, మీన రాశుల్లో సంచరించినప్పుడు పంచకం కాలం ఏర్పడుతుంది.
మృత్యు పంచకం అని ఎందుకు అంటారు : ఈ పంచకం మృత్యువవలే చాలా ఇబ్బందికరమైనది. ఈ సమయంలో సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఈ సమయంలో చేసే శుభకార్యంవల్ల కూడా మృత్యువు సంభవించే అవకాశం ఉంది.
ఏ పనులు చేయడకూడదంటే..
* ఈ 5 రోజుల్లో కలపను సేకరించడం లేదంటే కొనుగోలు చేయడం నిషేధం.
* మంచాలు తయారుచేయకూడదు. ఇంటి పై కప్పు నేయకూడదు.
* దక్షిణ దిశలో ప్రయాణాలు మానుకోవాలి. (దీన్ని యముడి దిక్కుగా భావిస్తారు. మృత్యు పంచక సమయంలో ప్రయాణం చేస్తే ప్రమాదాల పాలయ్యే అవకాశం ఉంటుంది).
* ఈ సమయంలో ఎవరైనా మరణిస్తే అదే గ్రామంలో మరో ఐదుగురు మరణిస్తారని నమ్ముతారు. పంచకంలో మరణించిన వ్యక్తికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాతే దహనానికి ఏర్పాట్లు చేయాలి.












Click it and Unblock the Notifications