ఇష్టదైవాన్ని ఆరాధించాలి.. ఆర్థికంగా కలిసివస్తుంది

రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా ఈ వారంలో ఎటువంటి ఫలితాలు ఎదురవుతున్నాయి? చిన్న చిన్న సమస్యలుంటే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? కలిసి రావడానికి జ్యోతిష్య పండితులు చెప్పినట్లుగా ఏం చేయాలి? తదితర వివరాలను ఈ వారం రాశిఫలాల్లో తెలుసుకోవచ్చు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైతే వాటిని ఎలా అధిగమించాలో సూచిస్తున్నారు. ఈనెల 26వ తేదీ నుంచి డిసెంబరు 2వ తేదీవరకు రాశులవారీగా ఫలితాలను తెలుసుకుందాం.

తులా రాశి
వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును బంగారుమయం చేస్తాయి. సమస్యలు తొలగుతాయి. అవగాహన పెరుగుతుంది. మీ సామర్థ్యం నలుగురికి తెలుస్తుంది. ఆశయం నెరవేరుతుంది. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. ఇష్టదేవతను ధ్యానించడంవల్ల మనశ్శాంతినిస్తుంది.

novermber 26th to december 2nd 2023 weekly horoscope

వృశ్చిక రాశి
ఆర్థికంగా కలిసివస్తుంది. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. మానసికంగా దృఢంగా ఉండాలి. వివాదాలకు తావివ్వొద్దు. లక్ష్యంపై దృష్టి నిలపాలి. కొన్ని విషయాల్లో పరీక్షా కాలంగా అనిపిస్తుంది. ఇష్టదైవాన్ని ఆరాధించాలి.

ధనుస్సు రాశి
సకాలంలో పనులు ప్రారంభించాలి. చెడును అసలు ఊహించవద్దు. సొంత నిర్ణయాలకన్నా మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. శక్తికి మించిన ఖర్చులు వద్దు. వ్యాపారంలో నిర్లక్ష్యం పనికిరాదు. ఇష్టదేవతను ధ్యానించడంవల్ల మేలు కలుగుతుంది.

మకర రాశి
ఉద్యోగంలో మంచి ఫలితాలు కనపడుతున్నాయి. ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అభీష్టసిద్ధి ఉంది. ఎదురుచూస్తున్న పనులు ఇప్పుడు అవుతాయి. సాహసోపేతంగా తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. పనుల్ని మధ్యలో ఆపొద్దు. లక్ష్యం చేరువలోనే ఉంది. ఇష్టదేవతను స్మరించడంవల్ల శుభవార్తను వింటారు.

కుంభరాశి
అభీష్టసిద్ధి ఉంది. ఎప్పటి పనులు అప్పడే పూర్తిచేయాలి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం జయప్రదం. స్వయం కృషితో ఫలితాలు సాధించాలి. కావాలని అడ్డంపడేవారు కొందరుంటారు. ధర్మదేవతానుగ్రహం కాపాడుతుంది. వ్యర్థ ప్రసంగాల జోలికి వెళ్లొద్దు. ఇష్టదేవతను ధ్యానించాలి.

మీనరాశి
ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోను కోల్పోవద్దు. తోటివారి సహకారం తప్పనిసరవుతంది. ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి. పనుల్లో జాప్యం పనికిరాదు. ఆవేశం వద్దు. కార్యాన్ని సాధించడానికి ఒక మెట్టు దిగాలి. ఇష్టదేవతను స్మరించడంవల్ల విజయం లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+