• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హస్త రేఖలు మీ జీవిత రహస్యాలను చెబుతుందా?

By Pratap
|

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"

ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

జీవితరేఖ సాధారణముగా గురుని యొక్క గృహమునకు, ద్వితీయ కుజుని యొక్క గృహమునకు మద్యగా అంగుష్ఠం వైపు అరచేయి అంచు నుంచి (బ్రొటన వేలు, చూపుడు వేలు మద్య నుండి ప్రారంభమయ్యి ద్వితీయ కుజ, శుక్ర గృహములను ఆవరించుచూ అరచేయి అడుగు భాగమున మణి బంధనము వద్ద అంతమగు రేఖను జీవిత రేఖ, ఆయురేఖ, శక్తిరేఖ అని పిలువబడుతుంది. అన్ని రేఖలకంటే ఉత్తమమైనది. నాయకుని వంటిది.

ఆరోగ్య విషయములు,ఆకస్మిక ప్రమాదాలు,గండాలు, కష్టనష్టాలు, ధైర్యం, శారీరక బలం, అభివృద్ధి, అధోగతి, కీర్తి ప్రతిష్ఠలు, ఆయుర్ధాయము, ఆశ్యాలు, కోరికలు, మంచి యోగాలు జీవితంలో జరిగే ముఖ్య సంఘటనలు జీవితరేఖ ద్వారా తెలుసుకోవచ్చును. జీవితరేఖ బలహీనమైతే మిగతా రేఖల యొక్క శక్తి సన్నగిల్లుతుంది. ఈ జీవితరేఖ సన్నగా ఉన్న, చిన్నగా ఉన్న ఆయుర్ధాయం తక్కువని అంచనా వేయరాదు. మిగతా రేఖల బలాబలాలను కూడా సమన్వయపరచి జీవితరేఖపై ఆయుర్ధాయం నిర్ణయం చేయాలి.

 జీవిత రేఖ ఇలా ఉంటుంది...

జీవిత రేఖ ఇలా ఉంటుంది...

జీవితరేఖ గురు, కుజ, శుక్ర, శని, శిరోరేఖతో విడిగా ఇలా పలు విధాలుగా బయలుదేరవచ్చును. జీవితరేఖపై అడ్డు రేఖలుంటే ప్రమాదాలు జరగవచ్చును. జీవితరేఖ సంపూర్ణంగా, స్పష్టంగా, లోతుగా కాంతివంతంగా, అందంగా ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యకరంగా ఉంటాడు. ఆదాయం, సుఖ సంతోషాలు, మంచి అబివృద్ధి ఉంటుంది.జీవితరేఖపై మచ్చలు, డాగులు, అడ్డురేఖలు, గుంటలు, లంకలు, చెడు గుర్తులు ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు వేదిస్తుంటాయి. అనేక రకాల కష్టాలు, నష్టాలు, సమస్యలు ఎదురవుతాయి. ఆర్ధిక నష్టాలు, నిలకడలేని జీవితం, నిలకడలేని ఆదాయంతో కష్టాలు పడుతూ ఉంటారు.

ఇలా ఉంటే సుఖశాంతులు

ఇలా ఉంటే సుఖశాంతులు

కుజ స్ధానమును, శుక్ర స్ధానమును పూర్తిగా చుట్టి, స్పష్టంగా, లోతుగా, కాంతివంతంగా జీవితరేఖ ఉన్నట్లయితే ఆ వ్యక్తి మంచి చురుకుదనం కలిగి మంచి ఆరోగ్యవంతుడుగా మంచి సంపాదనతో సుఖ శాంతులు అనుభవిస్తాడు.జీవితరేఖ చాలా వెడల్పుగా, మోటుగా, పాలిపోయినట్లయితే అనారోగ్యాలు తొందరగా రావు. వస్తే తొందరగా వదలవు. మనిషిని పట్టి పీడిస్తాయి. పశుసంపద బాగుంటుంది. ఆదాయం ఉండదు. కూలిపని చేసి జీవిస్తారు. తరచుగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవితరేఖ సన్నగా ఉంటే అనారోగ్యాలు తొందరగా వస్తాయి. తొందరగా పోతాయి.

జీవిత రేఖ గొలుసులాగా ఉంటే..

జీవిత రేఖ గొలుసులాగా ఉంటే..

జీవితరేఖ గొలుసులాగా ఏర్పడి ఉంటే అనారోగ్యం, నిలకడలేని జీవితం, చెడు అలవాట్లు ఏర్పడతాయి. జీవితరేఖ ముక్కలు, ముక్కలుగా ఉంటే తరచూ అనారోగ్యం, వృత్తిలో నిలకడ ఉండదు. ఆర్ధిక నష్టం ఉంటుంది.జీవితరేఖ విరిగి పోయినట్లు ఉంటే ఆ వయస్సులో అతనికి ప్రమాదం జరుగుతుంది. రెండు జీవితరేఖలు ఉన్నను, జీవిత రేఖ ముక్కలు ఒకదానిపై ఒకటి ఉన్నను, చతురస్త్రాకారపు గుర్తు ఉన్నను ప్రమాదం నుండి బయటపడతాడు. జీవితరేఖ, అదృష్టరేఖతో కలసిపోయినట్లయితే అదృష్టం వలన ప్రమాదం నుండి బయటపడగలుగుతాడు.

ఇలా అయితే ఆయుర్దాయం

ఇలా అయితే ఆయుర్దాయం

జీవితరేఖ శుక్రస్ధానం లోనికి పోయి ఉన్నట్లయితే ఆ రేఖ వైశాల్యం తగ్గుతుంది కావున ఆ వ్యక్తికి ఆయుర్ధాయం తక్కువ ఉంటుంది. జీవితరేఖ చంద్ర స్ధానంలోకి చొచ్చుకుపోయి పూర్తిగా ఉన్న ఎడల ఆ వ్యక్తి ఎక్కువ కాలం జీవిస్తాడు. వీరికి శృంగార కోరికలు అధికంగా ఉంటాయి.జీవితరేఖ గురుస్ధానం నుండి ప్రారంభం అయి ఉంటే ఆ వ్యక్తికి మంచి ఆలోచనలు, మంచి ఆశయాలు ఉండి మంచి అభివృద్ధి సాధించుకోవచ్చును. జీవితరేఖ సామాన్యంగా బుద్ధిరేఖతో కలసి ఉంటుంది. ప్రారంభంలో అలా కలసి ఉండటం వలన నిదానం, ఓర్పు ఉంటాయి. జీవితరేఖ బుద్ధిరేఖకు దూరంగా ప్రారంభం అయి ఉంటే భార్యా భర్తల మద్య అభిప్రాయబేధాలు, కలహాలు ఏర్పడతాయి.

ఇలా ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు

ఇలా ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు

జీవితరేఖను, బుద్ధిరేఖను కలుపుతూ చిన్న, చిన్న రేఖలు ఉంటే ప్రతిరోజు భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి గాని విడిపోరు. జీవితరేఖ ప్రారంభం అయిన చోట రెండు పాయలుగా చీలి ఉంటే ఆ వ్యక్తికి న్యాయమైన బుద్ధి,, మంచి ఆలోచన, మంచి మనస్సు ఉంటుంది.జీవితరేఖ, బుద్ధిరేఖ చాలా దూరం కలసి ఉన్నట్లతే ఆ వ్యక్తికి పిరికితనం, సోమరితనం ఏర్పడతాయి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోలేరు. అందువల్ల వీరు జీవితంలో తొందరగా పైకిరాలేరు. జీవితరేఖ నుండి నిలువురేఖ గురు స్ధానం చేరినట్లయితే ఆ వ్యక్తికి గౌరవం, పలుకుబడి, అధికారం, సంపాదన, పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. నిలువురేఖను ఏదైనా చిన్న అడ్డురేఖ ఖండించి ఉన్నట్లయితే ఆ వ్యక్తికి గౌరవం, పలుకుబడి, అధికారం, సంపాదన, పేరు ప్రతిష్ఠలు మరలిపోవును.

ఇలా ఉంటే ఆర్థిక పరిస్థితులు మెరుగు

ఇలా ఉంటే ఆర్థిక పరిస్థితులు మెరుగు

జీవితరేఖపై చిన్న చిన్న ఊర్ధ్వ రేఖలు ఉంటే ఆర్ధిక పరిస్ధితులు మెరుగుపడతాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈ ఊర్ద్వరేఖలు బుద్ధిరేఖను తాకినట్లయితే కోర్టు గొడవలు వస్తాయి. ఊర్ద్వరేఖలను ఖండించు రేఖలు ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ధన నష్టం,వృత్తిలో సమస్యలు వస్తాయి.జీవితరేఖపై పుట్టుమచ్చ ఉంటే విషప్రయోగాల వలన ఇబ్బందులు ఏర్పడతాయి. జీవితరేఖ క్రింది భాగంలో రెండు పాయలుగా చీలి ఉంటే ఆ వ్యక్తి చివరి దశలో అనారోగ్యంతో బాధపడతాడు. జీవితరేఖ, బుద్ధిరేఖ, ఆత్మరేఖ కలసి ఒకే చోట నుండి వస్తే తరచుగా ప్రమాదాలు సంభవిస్తాయి.

ఇలా ఉంటే సొంత తెలివితేటలు...

ఇలా ఉంటే సొంత తెలివితేటలు...

జీవితరేఖలో నుండి అదృష్టరేఖ బయలుదేరి శనిస్ధానం చేరి ఉన్నట్లయితే ఆ జాతకుడు స్వంత తెలివితేటలు, స్వయం కృషి, ఇతరులపై ఆధారపడడు. సూర్యరేఖ ఈ జీవితరేఖలో నుండి మంచి విద్యావంతుడు అవుతాడు. గౌరవాలు పొందుతాడు. బుధరేఖ ఈ జీవితరేఖలో నుండి ప్రారంభం అయి ఉన్నట్లయితే వ్యాపారాభివృద్ధి, అనేక వ్యాపారాలలో రాణిస్తాడు.

జీవితరేఖపై లంక గుర్తు ఏర్పడి ఉన్నచో అజీర్ణవ్యాధి, స్త్రీలకు ప్రసవ సమయంలో మిక్కిలి బాధ కలుగుతుంది. జీవితరేఖపై వృత్తం గుర్తు ఉన్నచో కంటి సమస్యలు వచ్చును. త్రికోణం గుర్తు ఉంటే వ్యక్తి ఇతరులను మోసం చేసి సంపాదిస్తాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer says Pailmistry will help in finding out the life of a human being.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more