• search

గ్రహ దోషాలు, బాధలకు నివారణ: నిత్య పారాయణ స్తోత్రములు..

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ( ఈ మంత్రోచ్చారణను శుచిగా, నిష్ఠగా చదివిన వారికి మంచి శుభఫలితాలు ఇస్తాయి)

  గమనిక :- ముఖ్యంగా వాక్ శుద్ధితో ఉండాలి, శక్తి కోలది వృక్ష ,పక్షి, జంతు, అనాధలకు,పేదవారికి మీ మీ స్థాయిలో ధాన ధర్మాలు, చేతనైన సహాయ సహకారాలు అందివ్వాలీ, అప్పుడే పరిపూర్ణ మైన శుభాలు కలుగుతాయి.

  1.ఉదయం నిద్ర లేచిన తరువాత

  "కాశ్యాం దక్షిణ దిగ్భాగే కుక్కుటో నామ వై ద్విజ
  తస్య స్మరణ మాత్రేణ దుస్స్వప్న శ్శుభదో భవేత్"

  2.ఉదయం భూప్రార్ధన

  "సముద్రమేఖలే దేవి పర్వతస్తన మండలే
  విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే"

  3.మానసిక శుద్ది

  "అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాంగతోపినా
  య:స్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచి:"

  4.ఉదయం నిద్రనుండి లేవగానే అరచేతిని చూస్తూ చదివే మంత్రం

  "కరాగ్రే వసతే లక్ష్మీ: కరమద్యే సరస్వతి
  కరమూలేతు గోవింద: ప్రభాతే కరదర్శనం"

  parayana slokas to overcome graha doshams

  5.స్నాన సమయంలో

  "గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
  నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు"

  6.భోజనానికి ముందు

  "అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
  జ్ణాన వైరాగ్య సిద్ద్యర్దం భిక్షాందేగి కృపాకరి
  అన్నం బ్రహ్మారసోవిష్ణుః భోక్తాదేవో మహేశ్వరః
  ఇతి స్మ్రరన్ ప్రభుంజాన: దృష్టిదోషై: నలిప్యతే"

  7.భోజన తరువాత

  అగస్త్యం కుంభకర్ణంచ శమించ బడభానలనం
  అహారపరిమాణార్దం స్మరమిచ వృకోదరం

  8.ప్రయాణ సమయంలో 21 పర్యాయములు పఠించాలి

  "గచ్చ గౌతమ శీఘ్రంమే ప్రయాణమ్ సపలం కురు
  ఆసన శయనం యానం భోజనం తత్ర కల్పయ"

  9.అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాలి

  "ఓం నమో పరమాత్మనే పరబ్రహ్మ మమ శరీరే పాహీ కురుకురు స్వహా"
  మరియు / లేదా..

  "క్రీం అచ్యుతానంత గోవింద"

  10.విద్యాప్రాప్తి కోరకు ప్రతి నిత్యం 1 గంట లేక 28 పర్యాయాలు పఠించాలి

  "ప్రాచీసంధ్యా కాచిదంతర్నిశాయా: ప్రజ్ణా దృష్టే రంజన్అ శ్రీరపూర్వా
  వక్రీవేదాన్ పాతుమే వాజివక్ర్తా వాగిశాఖ్యా వాసుదేవస్య మూర్తిః
  ప్రణతాజ్ణానసందోహ ధ్వాంత ధ్వంసనకర్మఠం
  నమామి తురగ్రీవ హరీం సారస్వత ప్రదం
  శ్లోకద్వయం మిదం ప్రాతః అష్టావింశతి వారకం
  ప్రయతః పఠతే నిత్యం కృత్న్సా విద్యా ప్రసిద్ద్యతి"

  11.విద్యార్జన లేక ఉద్యోగ నిమిత్తం నివాసానికి దూరంగ ఉన్నప్పుడు మానసిక / ఆరోగ్య సమస్యలు లేకుండ ఉండటానికి పఠించాల్సిన మంత్రం

  "గచ్చ గౌతమ శీఘ్రంత్వం గ్రామేషు నగరేషు చ
  ఆశనం వసనం చైవ తాంబూలం తత్ర కల్పయ"

  12.ప్రారంబించిన పనిని విజయ వంతంగ పూర్తి చేయడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి

  "ఓం నమో మహామాయే మహా భోగదాయిని హూం స్వాహా"

  13.చేపట్టిన కార్యంలో , పోటి పరీక్షలో విజయం సాదించడానికి
  (పుణ్య ఫలం పెంచుకోవడానికి ) ఈ మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి

  "శ్రీ రామ జయరామ జయజయ రామరామ"

  14.అన్ని సమస్యలకు ప్రతి నిత్యం
  సూర్యోదయానికి సూర్య నమస్కారం ఉత్తమం

  "ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ:"

  15.ఉద్యోగంలో ఉన్నతి కోరకు, పై అదికారుల అభిమానం మరియు తన వద్ద పనిచేయువారి సహకారం లభించాలంటే క్రింది మంత్రాన్ని ప్రతి దినం గంట సమయం పఠించాలి

  "ఓం హ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ మమ గృహే పూరయ పూరయ దూరయ దూరయ స్వాహా" మరియు / లేక "శ్రీ రాజ మాంతాంగై నమ:"

  16.ఉత్తమ భర్తను పొందుటకు
  మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి

  "హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియా
  తధామాం కురు కళ్యాణి కాంత కాంతం సుదుర్లభమ్"

  17.ఉత్తమ భార్యను పొందుటకు
  మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి

  "పత్నీం మనోరమాందేహి మనోవృత్తాను సారిణీమ్
  తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్"

  18.వివాహాం తోందరగా జరగడానికి
  మంత్రాన్ని 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి

  "ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిని
  వివాహాం భాగ్యమారోగ్యం పుత్రలాభంచ దేహిమే"

  19.
  అమ్మాయిలకు వివాహాం తోందరగా జరగడానికి
  మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి

  "కాత్యాయని మహామాయే మహాయోగినదీశ్వరీ
  నందగోపసుతం దేవిపతిం మేకురుతేనమ:
  పతింమనోహరం దేహి మనోవృత్తానిసారిణం
  తారక దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం
  పత్నీమనోరమాం దేహి మనోవృత్తానిసారిణం
  తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం"

  20.అబ్బాయిలకు వివాహాం తోందరగా జరగడానికి
  మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి

  "విశ్వాసో గందర్వరాజ కన్యాం సాలంకృతాం
  మమాబీప్సితాం ప్రయచ్చ ప్రయచ్చ నమః"

  21.స్త్రీల కు వైవాహీక జీవన సౌఖ్యం కొరకు
  మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి

  "హరిస్త్వా మారాధ్య ప్రణిత జనసౌభాగ్య జననీం
  పురానారి భూత్వా పురరిపుమపి క్షోభమనయత్
  స్మరోపిత్వాం వత్యా రతినయన లేహ్యేన వవుషా
  మునీనాప్యంత: ప్రభవతి మోహాయ మహతామ్"

  22.వైవాహీక జీవన సౌఖ్యం కోరకు దంపతులు ఇరువురు
  మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాలి

  "శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్తకళ్యాణ గుణాభిరామః
  సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు
  హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియే
  తధామాం కురు కళ్యాణి కాంత కాంతాం సుదుర్లభాం"

  23.కుటుంభాన్ని నిర్లక్ష్యం చేయు భర్తను మార్చుకోవడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి

  "ఓం క్లీం త్రయంబకం యజామాహే సుగంధీం పతిర్వర్దనమ్
  పతిం ఉర్వారుకవ బంధతృతి మోక్ష మామృతాత్ క్లీం"

  24.కుటుంబంలో వచ్చు సమస్యలను తొలగించి సౌఖ్యంగ ఉండడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి

  "ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ" లేక
  "సదాశాంతా సదాశుద్దా గృహచ్ఛిద్ర నివారిణి
  సత్సంతానప్రదారామా గ్రహోపద్రవనాశిని"

  25.కుటుంబ సమస్యలతో దూరమైన భర్త ను పొందడానికి మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి

  :ఓం నమో మహాయక్షిణ్యై మమపతిం
  మే వశ్యం కురు కురు స్వహా"

  26.ఆరోగ్య సమస్యలు లేని గర్భధారణకొరకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం

  "ఓం దేవకిసుత గోవింద జగత్పతే
  దేహిమే తనయం కృష్ణ త్వామహాం శరణాగత:"

  27.సుఖ ప్రసవం కోరకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం

  ఆస్తి గోదావరీ జలతీరే జంభలానామ దేవతా
  తస్యాః స్మరణ మత్రేణ విశల్యాగర్బిణీ భవేత్ జంభలాయై నమః"

  28.ఆపదలు తగ్గడానికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం

  "గౌరి వల్లభకామారే కాలకూట విషాదన
  మాముద్దరాపదాంభోధేః త్రిపుర ఘ్నాంతకాంతక"

  29.ఆపదలు పూర్తిగా తొలగడానికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం

  "అపదామపర్తారం దాతారం సర్వసంపదాం
  లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం
  "దుర్గాపత్తరిణీం సర్వదుష్టగ్రహ నివారిణీ
  అభయాపన్నిహంత్రీచ సర్వానంద ప్రదాయిని"

  30.సర్వకార్యసిద్దికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం

  "నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయచ
  మమాభీష్టంకురుష్వశు శరణాగతవత్సల"

  31.రావిచెట్టు ప్రదక్షిణ మంత్రము 11 ప్రదక్షిణలు నిధానంగా చెట్టును తగలకుండా తిరగాలి

  "ఓం నమో భగవతే వాసుదేవాయ"

  మూలతో బ్రహ్మరూపాయ
  మధ్యతో విష్ణురూపినే
  ఆగ్రత శివారూపాయ
  వృక్షరాజయతే నామ:

  32. విద్యార్థులకు మంచి జ్ఞాపకశక్తిని పెంచేందుకు రోజు శ్రద్ధగా 108 సార్లు చదవాలి.

  ఓం జ్ఞానానందమయం దేవం
  నిర్మల స్పటీకాకృతిమ్
  ఆధారం సర్వ విద్యానాం
  హాయగ్రీవముపాస్మహే

  33. అపులు, ఆర్థిక బాధల నివారణకు కోరకు

  శ్రీ గణేశ ఋణమ్ ఛిoధి ,సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమ:

  34. శని దేవుని అనుగ్రహం కోరకు

  కోణస్త పింగళ బభ్రు:
  కృష్ణో రౌద్రా౦తకో యమ:
  సౌరి శనైశ్చరో మ౦ద:
  పిప్పాలా దేవా సంస్తుత:

  35. సర్వ గ్రహా దోషానివాణకు

  ఆదిత్యాయచ,సోమాయ
  మంగళయ బుధాయచ
  గురు శుక్ర శనిభ్యశ్చ
  రాహావే కేతవే నమ:

  English summary
  Astrologer explains abou how Parayana Slokas work as remedy to overcome graha doshams

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more