మహా శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
మహాశివరాత్రి పర్వదినాన శివుడికి ప్రత్యేకంగా పూజలు చేయడంతో పాటు, భక్తులు ఉపవాస దీక్షలను ఆచరిస్తారు. ఉపవాసం చేయడం ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనది అయినప్పటికీ ఉపవాసం చేసేవారు ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన ఉపవాస దీక్ష చేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడేవారు కఠినమైన ఉపవాస దీక్షలు చేయకుండా ఉంటేనే మంచిది.
ఉపవాసం ఉంటే ఈ జాగ్రత్తలు పాటించాలి
మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం చేసేవారు తీసుకోవలసిన జాగ్రత్తల విషయానికి వస్తే ఆరోజు ఆహార ఎక్కువగా తీసుకోరు కాబట్టి నీటిని ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి. ఉపవాస నియమాలకు అనుగుణంగా నిమ్మరసం కానీ, కొబ్బరి నీళ్లను కానీ తీసుకుంటే మంచిది. మహాశివరాత్రి పర్వదినాన పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉండలేనివారు పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు.

ఈ వ్యాధులు ఉన్నవారు జాగ్రత్త
మహాశివరాత్రి పర్వదినాన ఉపవాస దీక్షను ఆచరించేవారు అధిక శ్రమ చేయకూడదు.శరీరానికి కావలసినంత విశ్రాంతిని తీసుకోవాలి. శరీరం బలహీనంగా అనిపిస్తే కచ్చితంగా రెస్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా ఉపవాసం ఉండే వారిలో బీపీ, డయాబెటిస్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం మరియు రక్తపోటు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకొని ఉపవాసాన్ని ఆచరించాలి. ఉపవాసం ఉన్నామని రోజువారి మందులు వేసుకోకుండా ఉండకూడదు.
ఉపవాసం తర్వాత భారీగా తినొద్దు
రోజువారి వేసుకునే మందులను సరైన సమయానికి వేసుకోవాలి. అంతేకాదు అప్పటి వరకు ఉపవాసం ఉండి ఉపవాసం ముగించే సమయంలో భారీగా తింటే కూడా ఇబ్బంది వస్తుంది కాబట్టి. ఆ సమయంలో భారీగా తినకుండా తేలికగా ప్రారంభించి, ఆపైన సాధారణ ఆహారానికి మారాలి. ఇక గర్భిణీలు, వృద్ధులు, పిల్లలు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కఠినమైన ఉపవాసాలను పాటించకుండా ఉంటే మంచిది.
శివరాత్రి ఉపవాసం చేస్తే శారీరక ఆరోగ్యం కూడా
మీరు తేలికపాటి విధానాన్ని అనుసరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. శివరాత్రి రోజు భక్తి భావంతో ఉపవాసం ఉండడం మంచిదే కానీ మన ఆరోగ్యం విషయంలో రిస్క్ తీసుకునేలా ఉండకూడదు. రెండింటిని సమతుల్యం చేసుకొని శివరాత్రి ఉపవాసం చేస్తే ఆ శివయ్య కటాక్షం తో పాటు, శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది.












Click it and Unblock the Notifications