2025లో వీరి జీవితాలను తలక్రిందులు చేస్తానని శపథం చేసిన పిశాచయోగం.. జాగ్రత్త!

గ్రహాల గమనం ఒక రాశి నుంచి మరొక రాశికి నిర్దిష్ట సమయంలో జరుగుతుంది. 2025 సంవత్సరంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరించడం కారణంగా ద్వాదశ రాశుల వారి జాతకాల మీద ప్రభావం పడుతుంది. 2025 సంవత్సరంలో శని రాహువుల మధ్య సంయోగం జరగబోతుంది. జ్యోతిష్య శాస్త్రంలో శని రాహువుల సంయోగాన్ని పిశాచ యోగమంటారు

మీనరాశిలో శని, రాహు సంయోగంతో పిశాచ యోగం
మీనరాశిలో ఈ రెండు గ్రహాలు కలిసి పిశాచ యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ రెండు గ్రహాలు కలిస్తే వినాశనానికి కారణం అవుతాయని అందుకే ఈ సంయోగాన్ని పిశాచ యోగమని చెబుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే ఈ పిశాచ యోగం అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాశుల వారి జీవితాలను తలకిందులు చేస్తుంది. మానసిక ఆందోళన, నిరాశ నిస్పృహలు, భయం, సవాళ్లు, అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

pishacha yoga with saturn rahu conjuction gives these zodiac signs difficulties in 2025 Beware

మార్చి 29వ తేదీన రాత్రి పిశాచ యోగం
ప్రస్తుతం కుంభరాశిలో ప్రత్యక్షంగా ఉన్న శని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 మార్చి 29వ తేదీన రాత్రి 10 గంటలు ఏడు నిమిషాలకు మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక రాహువు అప్పటికే మీనరాశిలో ఉంటాడు. ఇక మీనరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక మార్చి 29 నుంచి అన్ని రాశుల వారి పైన పడినప్పటికీ ముఖ్యంగా మూడు రాశులపై మాత్రం విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక ఆ రాశుల వివరాల్లోకి వెళితే

మిధున రాశి
పిశాచ యోగం కారణంగా మిధున రాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇది వారికి కష్టకాలం. వ్యక్తిగత విషయాలలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఏది మాట్లాడినా అవతలి వ్యక్తికి తప్పుగా అర్థమై అనర్ధాలు జరిగే అవకాశం ఉంది. ఇంట్లో, బయట వివాదాలకు అవకాశం ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి.

ఈ పరిహారాలతో ఉపశమనం
ఇక ఉద్యోగాలు చేసేవారు ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారులు భారీ నష్టాలను చూస్తారు. ఈ సమయంలో వీరు ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా, శనివారం ఆంజనేయుడికి వడమాలు వేయడం ద్వారా సమస్యల నుంచి కాస్త మిధున రాశి వారు ఉపశమనాన్ని పొందవచ్చు.

తులా రాశి
శని రాహువుల కలయిక కారణంగా తులా రాశి జాతకులకు కష్టాలు సంభవిస్తాయి. ఈ సమయంలో తులా రాశి జాతకులు వర్తక, వ్యాపారాలలో సమస్యలను ఎదుర్కొంటారు. అతి కష్ట కాలాన్ని వీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. స్నేహితులు, సన్నిహితుల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి.

ఈ పరిహారాలు చేస్తే మంచిది
కుటుంబ సంబంధాలు విడిపోయేదాకా వెళతాయి. తలనొప్పి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. తులా రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే శనివారం రోజు నువ్వుల నూనె దీపంతో శని దేవుడిని ఆరాధించటం వల్ల పిశాచ యోగ ప్రభావం కాస్త తగ్గుతుంది.

కుంభరాశి
2025లో శని రాహువుల సంయోగం కారణంగా కుంభరాశి వారికి కష్టాలు వస్తాయి. ఈ పిశాచ యోగం యొక్క ప్రభావంతో కుంభ రాశి వారి జీవితంలో మానసిక కల్లోలం చోటు చేసుకుంటుంది. కుటుంబ, సామాజిక సంబంధాల్లో గందరగోళ పరిస్థితులు వస్తాయి. కుంభరాశి జాతకులు వృత్తి, వ్యక్తిగత జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ పరిహారాలతో పిశాచ యోగం నుండి రిలీఫ్
వర్తక వ్యాపారాల విషయంలో కుంభ రాశి వారికి గట్టి ఎదురు దెబ్బలు తగులుతాయి . ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఇక కుంభ రాశి వారు ఈ పరిస్థితిని అధిగమించి పిశాచ యోగం నుండి ఉపశమనం పొందడానికి శనివారం నాడు శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆంజనేయుడికి వడమాల వేయడం వంటి పరిహారాలు పాటిస్తే మంచిది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+