పితృపక్షం 2023: పితృ దోష నివారణకు పితృపక్షంలో ఏం చెయ్యాలి?
సనాతన ధర్మంలో పూర్వీకులకు అంకితం చేయబడిన సంవత్సరంలోని నిర్దిష్ట కాలాన్ని పితృ పక్షం అంటారు. పితృపక్షం సమయంలో పూర్వీకులు తమ వారిని కలవటం కోసం భూమి మీదకు వస్తారని చెప్తారు. ఈ సమయంలో స్నానం, దానం, తర్పణం, శ్రార్ధ కర్మలు చేసినప్పుడు పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెంది తమ వారిని పూర్వీకులు దీవిస్తారని చెప్తారు.
అయితే కొంత మంది జీవితాలలో పితృ దోషం వంటి హానికరమైన దోషాలు ఈ సమయంలో నివారణ చేసుకోవచ్చని అందుకు కొన్ని నివారణలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ సంవత్సరం పితృ పక్షాలు సెప్టెంబర్ 29 న ప్రారంభమై, అక్టోబర్ 14 న ముగుస్తుంది. ఈ సమయంలో పితృ దోషాలు ఉన్నవారు దోషాల నివారణకు ఈ పనులు చెయ్యాలని చెప్తున్నారు.

పితృ పక్షం సమయంలో పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూర్చడానికి చేయవలసిన నిర్దిష్ట పరిహారాల విషయానికి వస్తే.. పితృపక్షం సమయంలో స్నానం, దానం, తర్పణం చేయాలని చెప్పబడింది. ఈ సమయంలో పిండదానం చేస్తే నిస్సందేహంగా పూర్వీకుల దీవెనలు పొందుతారని చెబుతున్నారు. పూర్వీకులు మరణించిన తేదీ తెలిస్తే ఆ తేదీన శ్రాద్ధ కార్యక్రమం నిర్వహించి. పిండదానం చేయడం వల్ల వారి ఆత్మలు శాంతిస్తాయి అని చెబుతున్నారు.
ఇక పితృపక్షం సమయంలో వీలైతే సోమవారం నాడు ఉపవాసం ఉండి. ఆకలితో ఉన్నవారికి, పేదలకు ఆహారాన్ని ఇస్తే పితృ దోషాలు తొలగిపోతాయని చెపుతున్నారు. మంగళవారం నాడు హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని హనుమంతునికి నైవేద్యాన్ని సమర్పిస్తే పితృ దోషాలు తొలగిపోతాయి. పితృ పక్షం సమయంలో పెద్దలను గౌరవించాలని, ఎట్టి పరిస్థితులలోను వారిని అగౌరవపరచ వద్దని చెబుతున్నారు.
శుభకార్యాలు చేసే ముందు పూర్వీకులను స్మరించుకోవాలని, పౌర్ణమి రోజున గంగలో స్నానం చేసి పూర్వీకుల పేరిట హవనం చేస్తే కూడా ఫలితం ఉంటుందని చెబుతున్నారు. జంతువులు మరియు పక్షులకు ఆహారాన్ని నీటిని ఇస్తే పితృ దోషం తొలగిపోతుందని చెబుతున్నారు. ఇంటికి వచ్చిన అతిథులను, యాచకులను అవమానించకుండా వారికి ఆహారాన్ని ఇస్తే కూడా పితృ దోషాలు తొలగిపోతాయని, మంగళవారం నాడు వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు సేవ చేస్తే పితృ దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications