వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu Tips: ఇంట్లో తులసి మొక్క ఎక్కడ ఉంచాలంటే..!

|
Google Oneindia TeluguNews

తులసి దాదాపుగా ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. హిందూ శాస్త్రల ప్రకారం తులసి చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే తులసిని లక్ష్మీదేవిగా కొలుస్తారు. ఇంట్లో తులసి మొక్క ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. తులసి మనకు సమృద్ధిగా ఆక్సిజన్ అందించడమే కాకుండా పలు అనారోగ్య సమస్యలకు మందుగా కూడా పని చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం తులసిలో అనేక ఔషధాల గుణాలు ఉన్నాయి.

దిశ, ప్రదేశం

దిశ, ప్రదేశం

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో తులసిని ఎక్కడ ఉంచాలనేది కూడా శాస్త్రం చెబుతుంది. తులసి మొక్కను సరైన దిశలో పెడితే ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. తులసి మొక్కను నాటడంతో పాటు దాన్ని ఏ దిశలో ఉంచాలనేది కూడా ముఖ్యమే.. అదే విధంగా సరైన రోజున నాటడం మంచిది. తులసిని ఉంచే దిశ, ప్రదేశం ముఖ్యమైంది. తులసిని తప్పుడు స్థానంలో ఉంచితే మంచితే మంచిది కాదట.

పాజిటివ్ ఎనర్జీ

పాజిటివ్ ఎనర్జీ

తులసి మొక్క ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం తులసిని ఇంటి పైకప్పు మీద పెట్టకూడదని చెబుతారు. ఇంటి పైకప్పుపై తులసిని ఉంచడం వల్ల దురదృష్టం వెంటాడుతుందట. వాస్తు శాస్త్రం ప్రకారం, తలుపు వద్ద తులసి మొక్కను పెట్టడం శుభంగా భావిస్తారు. ఎందుకంటే, దీనిని పూజించి ఇంటి బయట ఉంచడం, వస్తూ పోతూ అందరి చూపు దాని మీద పడడం మంచదట.

ఉత్తర దిశలో

ఉత్తర దిశలో

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి ఉత్తర దిశలో తులసి మొక్కను నాటడం శుభప్రదంగా పరిగణిస్తారు. తులసిని ఉత్తర దిశలో ఉంచుకోవాలి. ఉత్తర దిశలో ఉంచడం సాధ్యం కాకపోతే, మీరు ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉంచుకోవచ్చు. అలాగే తులసి మొక్కను బాల్కనీలో లేదా కిటికీకి సమీపంలో ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచవచ్చు.

English summary
Basil is found in almost every home. According to Hindu Shastras, Tulsi is considered very sacred. Because Tulsi is considered as Goddess Lakshmi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X