భార్యాభర్తల అన్యోన్యతకు, ఆర్ధిక, మానసిక ఇబ్బందుల విముక్తికి.. రాతి ఉప్పు పరిహారాలు
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు, అన్నీ ఉన్నప్పటికీ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల జీవితమే నరకప్రాయంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలన్న, ఆర్ధిక, మానసిక ఇబ్బందుల నుండి బయట పడాలన్నా, మనకు తెలియకుండా మన కంటికి కనపడకుండా ఉండే ప్రతికూల శక్తుల నుండి విముక్తి పొందాలన్నా కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
రాతి ఉప్పుకు బోలెడు శక్తి
కంటికి కనిపించని ప్రతికూల శక్తుల వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, చిరాకులు, గొడవలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి అలాంటి ప్రతికూల శక్తులను బయటకు పంపించి, సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి రాతి ఉప్పుకు ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రాతి ఉప్పుతో చేసే కొన్ని చిట్కాలు మంచి ఫలితాలను ఇస్తాయని అంటున్నారు.

రాతి ఉప్పుతో దృష్టి దోష నివారణలు
కంటి దృష్టి లోపాలను తొలగించుకోవాలంటే రాతి ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయాలి. ఒక గాజు గిన్నెలో వంటకు ఉపయోగించే రాళ్ల ఉప్పును వేయాలి. ఆ ఉప్పు గిన్నెను స్నానం చేసే గది అల్మారాలో పైభాగాన ఉంచాలి. గిన్నెలో ఉప్పు కొద్దికొద్దిగా కరిగి నీరుగా మారితే దానిని తొలగించి, మళ్లీ ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల దరిద్రం తొలగిపోవడంతో పాటు, ఇంటి పై నరదృష్టి పూర్తిగా పోతుంది.
వారానికోసారి రాతి ఉప్పుతో ఇలా చెయ్యండి
అంతేకాదు ఇంటిని వారానికి ఒకసారి రాతి ఉప్పు, పసుపు వేసిన నీళ్లతో శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూలతలు తొలగిపోతాయి. మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగానూ బాగుంటుంది. అంతేకాదు డబ్బు దాచుకునే పర్సు లలో చిటికెడు రాళ్ల ఉప్పును చిన్న పేపర్లో మడతపెట్టి పొట్లం కట్టి పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవు.
భార్యాభర్తల అన్యోన్యతకు రాతి ఉప్పు పరిహారం
ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే, ఇద్దరూ సఖ్యంగా ఉండాలంటే పడక గదిలోని పై అల్మారాలో రాళ్ల ఉప్పుతో నింపిన గిన్నెను పెట్టి, వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉంటే సరిపోతుంది. అంతేకాదు ప్రతిరోజు మన ఉపయోగించే వాహనాలను శుభ్రం చేసేటప్పుడు, వాహనాలను కడిగే నీటిలో కూడా రాళ్ల ఉప్పును వేసి కడిగితే ప్రతికూల శక్తుల నుంచి తప్పించుకోవచ్చు.

స్నానం చేసే నీటిలోనూ రాతి ఉప్పు .. గొప్ప ప్రయోజనం
దీనివలన వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. వాహనాలకు సంబంధించి అనవసరపు ఖర్చులు పెరగకుండా ఉంటాయి. ఇక వాహనాలకు మాత్రమే కాదు వారానికి ఒకసారి మనం స్నానం చేసేటప్పుడు, స్నానం చేసే నీటిలో రాతి ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు. మానసిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. సానుకూల ప్రభావం ఏర్పడుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications