• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ధనుస్సురాశి వారి జాతకం ఎలా ఉంటుంది.. కష్టాలు గట్టెక్కుతాయా..?

|

ధనుస్సురాశి వారికి 2020 లో గోచార ఫలితములు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఆదాయం - 8, వ్యయం - 11 రాజపూజ్యం - 6, అవమానం - 3

• జన్మరాశిలో ఉన్న గురుకేతువులు, సప్తమంలో ఉన్న రాహువు, ద్వితీయస్థానంలో ఉన్న శని కారణ ఫలితంగా

• గత ఐదు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు నిధానంగా తొలగిపోతాయి.

Sagittarius 2020 Horoscope - Major Life Changes to expect!

• ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థికంగా ఎదుగుతారు.

• పేరుప్రతిష్టలు పెరుగుతాయి.

• గృహప్రవేశాలు, శుభకార్యాలు సంతోషపరుస్తాయి.

• ఆర్థిక పురోగతి బాగుంటుంది. స్థిరాస్తులు వృద్ధిచేస్తారు. పట్టుదలతో కృషి చేసి సానుకూల ఫలితాలు సాధిస్తారు.

• నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

• మీ ద్వారా సహాయసహాకారాలు పొంది ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల నుంచి లబ్ది పొందుతారు.

• చిన్నపిల్లలు, వృద్దులు, మహిళలు, అనాథలు వారికి సంబంధించిన సేవాసంస్థలకు చెప్పుకోదగిన సహాయం చేస్తారు.

• మహిళల వల్ల మేలు జరుగుతుంది. అధికార స్థానంలో ఉన్నవారి వల్ల మరింత మేలు జరుగుతుంది.

• ఉద్యోగంలో స్థానచలనం తప్పదనుకుంటారు. కానీ చివరి క్షణంలో ఆ స్థాన చలనం ఆగిపోతుంది.

• ప్రతి విషయంలోను స్త్రీల సహాయసహకారాలు మీకు లభిస్తాయి.

• వ్యాపారం నిమిత్తం స్థలం కొనుగోలు చేస్తారు. నూతన అవకాశాలను ఉపయోగించుకుంటారు.

• న్యాయబద్దమైన కోరికలను వారు ఆమోదిస్తారు. సమాజంలో మీరంటో నిరూపించుకుంటారు.

• గతంలో మిమ్మల్ని కించపరిచిన వారే గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

• అర్థాంతరంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు.

• బాల్యంలో సరదాగా నేర్చుకున్న పనులు, విజ్ఞానం ఉపకరిస్తుంది.

• రహస్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.

• మీ ఆద్వర్యంలో నడిచే వ్యాపారాలు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలమే.

• బయట ఆహారానికి దూరంగా ఉండాలి. యోగ మొదలకు ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు.

• చండీ హోమం చేయండి మరిన్ని శుభాఫలాలు లభిస్తాయి.

• పోటి పరీక్షలలో విజయం సాధిస్తారు.

• విదేశాలలో ఉద్యోగం చేసే వారికి అనుకూలం, గ్రీన్ కార్డ్ లభిస్తుంది.

• పెద్దల, గురువుల మాట వినడం సర్వదా మీకు శ్రేయష్కరం.

మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.

English summary
People with sagittarius zodiac sign will see a good life ahead with the past five years coming to an end
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X