ఫిబ్రవరిలో ఈ రాశులకు అఖండ ధనయోగం

గ్రహాల్లో కీలక గ్రహమైన శనిదేవుడు న్యాయదేవత. ఆయన చేసిన కర్మలనుబట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. మంచి చేస్తే అంతకు రెట్టింపు స్థాయిలో మంచి ఫలితాలు, చెడు చేస్తే అంతకుమించిన చెడు ఫలితాలను ప్రసాదిస్తాడు. నీతి, నిజాయితీతో ఉండేవారికి ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. గతేడాది నవంబరు 15వ తేదీ నుంచి కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఈ ప్రభావం ఏయే రాశులపై ఏవిధంగా ఉంటుంది, ఫిబ్రవరిలో వీరికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

వృషభం
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో పూర్తిచేస్తారు. అందుకు అదృష్టం తోడుంటుంది. వీరికి ధనం కొంత తగ్గుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో మంచిపేరు వస్తుంది. తోటి ఉద్యోగుల నుంచి సహకారం అందుతుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా మంచి జరుగుతుంది. జీవితంలో స్థిరపడతారు.

saturn transit in aquarius three zodiac signs will become millionaires

కన్యారాశి
ఈ రాశి ఆరో ఇంట్లో శనిదేవుడు ప్రత్యక్ష సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఆర్థికంగా వీరి పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. కన్యారాశి వరకు మంచి యోగం కలుగుతుంది. ఆధ్యాత్మిక వాతావరణంపట్ల ఆసక్తి చూపుతారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మేషరాశి
ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు ఇతర ఉద్యోగుల నుంచి సహకారాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అందరూ కలిసి తీర్థయాత్రలకు వెళతారు. వైవాహిక జీవితంలో ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. మాట్లాడేటప్పుడు మాట మధురంగా ఉండాలి. లేకుంటే పనులు పూర్తికావడం చాలా కష్టమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+