ఈనెలలో 15 రోజుల తేడాతో రెండు గ్రహణాలు.. అంత క్షేమం కాదు!

ప్రతి సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమి రోజు మహాలయ అమావాస్య ప్రారంభమవుతుంది. ఇది ఎందుకు వచ్చిందంటే మన పితృదేవతల కోసం 16 రోజులు ప్రత్యేకంగా కేటాయించారు. ఆ 16 రోజులు వారు భూలోకంలో సంచారం చేస్తుంటారు. వారిని సంతృప్తపరచడానికి వారి కుటుంబీకులు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది.బ్రాహ్మణులకు, పేదలకు దానమివ్వడం, పెద్దలకు పిండ ప్రదానం చేయడంతోపాటు పితృదేవతలకు తర్పణం వదలాలి. అయితే ఈ ఏడాది మహాలయ అమావస్యకు ఓ ప్రత్యేకత ఉంది. దీని ప్రారంభం, ముగింపు రెండింటికీ ఉన్న ప్రత్యేకత గురించి తెలుసుకుందాం.

రెండు గ్రహణాలు అంత శుభకరం కాదు
ఈనెల 17వ తేదీ నుంచి పితృపక్షం ప్రారంభమై అక్టోబరు రెండోతేదీతో మహాలయ అమావాస్య ముగుస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. మహాలయ అమావాస్య అంటే అతి పెద్ద అమవాస్య. ప్రారంభం రోజే చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. అలాగే ముగింపు రోజైన అక్టోబరు రెండున సూర్య గ్రహణం ఏర్పడుతోంది. కేవలం రెండు వారాల వ్యవధితో సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడుతున్నాయి.

september 17th lunar eclipse and october 2nd solar eclipse are occurring

ఈ సంవత్సరం రెండో సూర్య గ్రహణం ఆరోజు రాత్రి 9.13 గంటలకు ఏర్పడుతోంది. అయితే ఇది మనదేశంలో కనిపించదు. మనదేశంలో కనిపించకపోయినంతమాత్రాన సూర్యచంద్రులంతా ప్రపంచానికి ఒకటే కాబట్టి కొంతవరకైనా ప్రభావం ఉంటుందని, ఇది అంత శుభకరం కాదని పండితులు తెలియజేస్తున్నారు.

ఏడాది ఫలితం కలుగుతుంది
మహాలయ అమావాస్య సమయంలో పెద్దలకు నల్లనువ్వులతో పిండిని తర్పణం ఇవ్వాలని. ఇలా చేయడంవల్ల వారి ఆత్మ శాంతిస్తుంది. పితృదేవతలను సంతృప్తిపరచడంవల్ల వంశం అభివృద్ధి చెందుతుంది. మరణించినవారి కోసం వారి కుటుంబ సభ్యులు ప్రతి అమావాస్యకు తర్పణం వదలాలి. అలా చేయలేనివారు మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణం వదిలితే సంవత్సరం మొత్తం తర్పణం వదిలిన ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+