షట్టిల ఏకాదశి.. ఈ పనులు చేస్తే డబ్బే డబ్బు!!
హిందూ పంచాంగం ప్రకారం ప్రతీ సంవత్సరం మాఘ మాసంలోని కృష్ణ పక్షంలోని 11వ రోజున షట్టిల ఏకాదశి వస్తుంది. ఈ సంవత్సరం షట్టిల ఏకాదశి నేడు వచ్చింది. అయితే షట్టిల ఏకాదశి నాడు కొన్ని పనులు చేస్తే విశేషమైన ఫలితాలు ఆ కుటుంబానికి వస్తాయని, సంపద, శ్రేయస్సు పెరుగుతుందని చెప్తున్నారు.
మాఘమాసంలో విష్ణువుకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వబడుతుంది . షట్టిల ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి ఎవరైతే షట్టిల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి శుభాలు చేకూరుతాయని చెబుతారు. ఈ వ్రతం బంగారాన్ని దానం చేసినంత, వేల సంవత్సరాలు తపస్సు చేసినంత ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు. ఎవరైతే ఈ రోజు శ్రీమహావిష్ణువుని నిష్టతో ఆరాధిస్తారో వారికి భవిష్యత్తు అంతా శుభదాయకంగా ఉంటుందని చెప్తున్నారు.

షట్టిల ఏకాదశి వ్రతంలో భాగంగా ఉపవాసం చేయడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చని చెబుతున్నారు. షట్టిల ఏకాదశి వ్రతం లో భాగంగా కొన్ని పనులు చేయవచ్చు. కొన్ని పనులు అసలు చేయకూడదు. ప్రస్తుతం అవేంటో తెలుసుకుందాం. షట్టిల ఏకాదశి సందర్భంగా చేయవలసిన పనులలో విష్ణుమూర్తికి నువ్వులను సమర్పించి ఆ నువ్వులను ప్రసాదంగా తీసుకోవాలి.
పొరపాటున కూడా నువ్వులు క్రింద పడనివ్వకూడదు. పాదాలకు నువ్వులు తగిలితే పాపం. షట్టిల ఏకాదశి ఉపవాస కాలంలో బియ్యం, ఉప్పు, నూనె వినియోగానికి దూరంగా ఉండండి. పప్పు ,తేనె వంటి వాటిని తీసుకోవడం మానుకోండి. ఇక షట్టిల ఏకాదశి విశేషమైన ఫలితాలు పొందడం కోసం నువ్వులను దానం చేయండి.
నెయ్యి దీపాలతో విష్ణువుకు హారతి ఇవ్వండి. ఈ విధంగా చేస్తే సంపద మరియు శ్రేయస్సు పెరుగుతుంది. విష్ణు మంత్రమైన ఓం మాధవాయ నమః 21 సార్లు జపిస్తే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఏకాదశి రోజున పంచామృతం లో నువ్వులను కలిపి విష్ణుమూర్తికి సమర్పిస్తే జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితం ఉంటుంది. కనుక ఈ సంవత్సరం అంతా విష్ణువు కటాక్షంతో సంతోషంగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ పనులు చెయ్యండి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications