వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదా?: సైంటిఫిక్ ఆధారాలు: ఎలానో తెలుసుకోండి

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

ఉత్తరం దిక్కు తలపెట్టి నిద్రపోకూడదా...ఎందుకు అనీ ?
అనే సందేహం మనకు కలుగుతుంది. ఉత్తరం వైపు తల పెట్టు కొనీ నిద్రపోకూడదు అని తరచు పెద్దలు చెప్పె మాట ఇది. అలా పడుకుంటే ఆయుక్షీణం అని పురాణ ఇతిహసలలో ఆనేక కధలు ఉన్నాయి .

వైద్య శాస్త్రం మాత్రం కొన్ని శాస్త్రీయ ఆధారాలను చూపుతుంది. ఉత్తరం వైపు తలపెట్టి పడుకొంటే ఆ ఆయస్కాంత తరంగాల వలన రోగ నిరోధక శక్తి తగ్గుతుందని వారి పరిశోధనలలో తేల్చి చెప్పారు. ఎందుకు అంటే భూమధ్య రేఖ నుండి 40 డిగ్రీల ఆక్షాంశం వరకు ఆకర్షణ శక్తీ ఎక్కువగా ఉంటుంది.

ఉత్తర దృవం సమీపించే కొద్ది తగ్గుతుంది .మనదేశం 40 డిగ్రీల ఉత్తర ఆక్షాంశ రేఖ మధ్య ఉంది .కాబట్టి ఈ ఆకర్షణ శక్తీ ప్రభావం ఇంక ఎక్కువుగా ఉంటుంది .ఈ సూత్రం ప్రకారం దక్షిణం నుంచి ఉత్తరం దిశ వరకు ఆకర్షణ శక్తి ప్రవహిస్తుంటుంది .

ఇందు వలన శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి .దీని వలన కొన్ని రసాయనాలు తయారయ్యి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.ఇది ప్రకృతి సిద్దమైన నిరంతర ప్రక్రియ .మన శరీరంలో ఇనుము ,నికేల్ ,కోబాల్ట్ వంటి లోహ పదార్ధాలు ఉంటాయి .వీటిపై గురుత్వాకర్షణ శక్తీ ప్రభావం ఎక్కువుగా ఉంటుంది .

ఈ పదార్ధాలు ఉత్తర,దక్షిణ ద్రువాలలో కేంద్రీకృతము అవుతాయి .అంటే ఉత్తరం దిశగా తల పెట్టినప్పుడు మెదడు ,అరికాళ్ళు దగ్గర ఈ పదార్ధాలు ద్రువాలుగా యేర్పడతాయి.దేనితో సహజ సిద్దమైన ఆకర్షణ శక్తి శరీరం లోకి ప్రవేశించకుండా అడ్డుపడతాయి .

దీని వల్ల శరీరంలో బాక్టీరియా వృద్ధి చెందడమే కాకుండా రోగ నిరోధక శక్తీ తగ్గుతుంది .ఈ కారణాల వల్ల మనిషి తొందరగా రోగాల బారిన పడుతాడు .

should we not rest our head towards north and sleep

వాస్తుశాస్త్ర రిత్యా తూర్ఫు ,దక్షిణా దిశలలో మాత్రమే తల పెట్టి పడుకోవాలని నియమం ఉంది .పురాణలలో కూడా దీనికి కారణాలు ఉన్నాయి .

సూర్యుడు మనకు ప్రత్యక్షదైవం కనుక ఆయనవైపు కాళ్ళు పెట్టి నిద్రించ కూడదనేదీ ఒక కారణం.

నిద్రలేవడం ఆలస్యమైతే సూర్యకాంతి కళ్ళపై పడుతుందనేది మరో కారణం .ఉత్తరం వైపు తలపెడితే లేస్తూనే దక్షిణ దిశాధిపతి అయిన యముడి దర్శనం చేసుకున్నట్టు అవుతుంది. అందు వలన ఉత్తరం వైపు తల పెట్టకూడదనే నియమం ఏర్పడింది .

వినాయక జన్మ వృతాంతంలో కూడా ఈ విషయం వివరించబడింది .మరణించిన తన పుత్రునికి ఈశ్వరుడు ఉత్తర దిక్కునకు తలపెట్టు కొని నిద్రిస్తున్న వారి తలను తీసుకురమ్మని ప్రమధ గణాలను అదేశించడం గజాసురుని తల తెచ్చి వినాయకునికి అతికించడం అనే విషయం మనకు తెలిసినదే

.

దీనికి శాస్త్ర సంబంధమైన విశేషాలు కూడా ఉన్నాయి .తూర్పు నుండి వచ్చే ప్రకృతి బద్ధమైన కాంతులు శరీరానికి మేలు చేసే ఆరోగ్యదాయిని .దక్షిణ ,నైరుతి దిక్కులు నుండి వచ్చే శీతల పవనాల వల్ల సుఖ నిద్ర కలుగుతుందని ఆరోగ్య సూత్రాలు చెబుతున్నాయి అందుకే పెదలంటారు దాన ధర్మం చేయకపోయిన దక్షిణం తల పెట్టి పడుకోవాలని అంటారు.

English summary
never slept with their heads pointing north, and explores a few other things that can help us sleep well and rest better.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X