వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుక్ర మౌఢ్యమి ప్రారంభం: శుభకార్యాలకు అనువైన సమయం ఎప్పుడు..?

|
Google Oneindia TeluguNews

డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

సెప్టెంబర్ 15 గురువారం నుండి డిసెంబర్ 2 శుక్రవారం వరకు శుక్ర మౌఢ్యమి. జ్యోతిష్య శాస్త్రం రెండు రకాల మౌఢ్యమిల గురించి చెబుతోంది. ఒకటి శుక్ర మౌఢ్యమి , మరొకటి గురు మౌఢ్యమి. సెప్టెంబర్ మాసం 15 వ తేదీ నుండి డిసెంబర్ 2 వ తేదీ వరకు అనగా 79 రోజులపాటు శుక్ర మౌఢ్యమి ఉంటుంది. మౌఢ్యమినే వాడుక భాషలో మూడం అంటారు. నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. భూమి , సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమిపై ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూడం అంటారు.

గ్రహాలకు రాజు సూర్యుడు అంటే సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆగ్రహం తన శక్తిని కోల్పోతుంది, అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం , శుక్రడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. అందుకే దానికి మూఢం అనే పేరు పెట్టి శుభ కార్యాలకు దూరంగా ఉండమని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అన్ని గ్రహాలకు ఈ పరిస్థితి వస్తున్నప్పటికీ ప్రధానంగా శుభ గ్రహాలైన గురువు, శుక్రునకు శక్తి హీనత మాత్రమే దోషంగా పరిగణిస్తుంది జ్యోతిష్య శాస్త్రం.

గురు, శుక్రులు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు అని చెబుతారు. ఏ శుభ కార్యక్రమానికైనా గురు శుక్రులు బాగుండాలని, శక్తివంతంగా ఉంటే శుభం జరుగుతుందని విశ్వసిస్తారు. మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం జరుగుతుందని. కష్టం కలుగుతుందని, నష్టం వాటిల్లుతుందని జ్యోతిషశాస్త్రం ద్వారా తెలుస్తున్నది.

shukra moudyami 2022:When to start a good work when Mouyami is around, Know here

శుక్రమౌఢ్యమి కాలంలో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం. ఆటు, పోటులలో మార్పులు వస్తాయి. శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు, ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. స్త్రీల మీద అత్యధికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి. శుక్రుడు సంసార జీవితానికి, శృంగార జీవితానికి కారకుడు జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు. ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయాలి.

* మూఢంలో చేయతగినవి :-

అన్నప్రాసన చేసుకోవచ్చును.

ప్రయాణాలు చేయవచ్చును.

ఇంటి మరమ్మత్తులు చేసుకోవచ్చును.

భూములు కొనుగోలు, అమ్మకాలు, అగ్రిమెంట్లు చేసుకోవచ్చును.

నూతన ఉద్యోగాల్లో చేరవచ్చును. విదేశాల్లో విద్య / ఉద్యోగం కోసం వెళ్ళవచ్చును.

నూతన వాహనాలు, వస్త్రాలు కొనవచ్చును.

జాతకర్మ, జాతకం రాయించుకోవడం, నవగ్రహ శాంతులు, జప, హోమాది శాంతులు, గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు చేయవచ్చును.

సీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు చేయవచ్చును. గర్భిని స్త్రీలు , బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో ప్రయాణం చేయాల్సి వస్తే శుభ తిథులలో అశ్విని , రేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.

** మూఢంలో చేయకూడని పనులు :-

వివాహాది శుభకార్యాలు జరుపకూడదు.

లగ్నపత్రిక రాసుకోకూడదు. వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు.

పుట్టు వెంట్రుకలు తీయించరాదు.

గృహ శంకుస్థాపనలు చేయరాదు.

ఉపనయనం చేయకూడదు.

యజ్ఞాలు, మంత్రానుష్టానం, విగ్రహా ప్రతిష్టలు , వ్రతాలు చేయకూడదు.

నూతన వధువు ప్రవేశం , నూతన వాహనం కొనుట పనికిరాదు.

బావులు , బోరింగులు , చెరువులు తవ్వించకూడదు

వేదావిధ్యారంభం, చెవులు కుట్టించుట. నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయకూడదు.

English summary
According to Jyothishyam shukra moudyamistarts from september 15th and ends on december 2nd this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X