కుంభ రాశిలో సూర్యుడు.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే!

జ్యోతిష్యం ప్రకారం సూర్యుడిని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. సూర్యుడి కదలికలో వచ్చే మార్పు మానవుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం మకరరాశిలో సంచరిస్తున్న భాస్కరుడు ఈనెల 13వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఏడాది తర్వాత ఆదిత్యుడు కుంభరాశిలోకి రాబోతున్నాడు. దీని వల్ల నాలుగు రాశులవారి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులవారికి కలిసి రానుందనే విషయాన్ని తెలుసుకుందాం.

వృషభ రాశి
సూర్యుడి సంచారం ఈ రాశివారికి మంచి ఫలితాలను ఇవ్వబోతోంది. ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు కెరీర్ కూడా బాగుంటుంది. పిల్లల నుంచి శుభవార్తలను వింటారు. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. రుణాల ఊబి నుంచి బయటపడతారు. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు. ఉద్యోగస్తులు, వృత్తిలో ఉన్నవారు, వ్యాపారస్తులకు బాగుంటుంది.

Sun transit in Kumbh Rashi 2024 four zodiac sign people are lucky

కన్యా రాశి
ఈ రాశివారు కొత్త అవకాశాలను అందిపుచ్చుకొని అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. అంతేకాకుండా ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. శ్రమకు తగిన గుర్తింపు ఎప్పుడూ లభిస్తుంటుంది. వీరు కష్టాన్నే నమ్ముకుంటారు.

మేష రాశి
భానుడి సంచారం వీరికి ఎంతో మేలు కలిగించనుంది. గతం కంటే వీరి ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కార్యాలయంలో సహచర ఉద్యోగుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. చేపట్టిన ప్రాజెక్టు విజయవంతమవుతుంది. ఆగిపోయిన పనులు వెంటనే పూర్తిచేస్తారు.

మిథున రాశి
సూర్యుడి సంచారం వీరికి బాగా కలిసిరానుంది. విదేశాలకు వెళతారు. ఆర్థికంగా లాభాలున్నాయి. కెరీర్ లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ప్రతి పనిలో విజయాలు సాధించడంతోపాటు అదృష్టం తోడుంటుంది. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+