మగువల మాంగళ్యసూత్రం మర్మం ఏమిటి?

Posted By:
Subscribe to Oneindia Telugu

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

హిందూ వివాహాం బంధంలో మంగళ్యానికి"మంగళ సూత్రానికి ఎంతో ప్రాధాన్యత చోటు చేసుకుంది.పురుషుడు తన జీవన ప్రయాణంలో తోడు,కుటుంబ అభివృద్ధి కొరకు స్త్రీ తన అర్ధ భాగస్వామిగా నిర్ణయించుకున్న స్త్రీని తాళికట్టి తన అర్ధాంగిగా స్వీకరిస్తాడు.ఆ మంగళ సూత్రం కట్టే తంతు కార్యక్రమ సమయంలో వేధ పండితులు మాంగళ్య మంత్రాన్ని పెళ్లి కొడుకునకు వినిపించి,అనిపించి ఆభావార్ధాలను తెలియజేస్తారు.

"మాంగల్య తంతునానేనా మమజీవన హేతునా!
కంఠే భధ్నామి సుభగే సంజీవ శరదశ్శతం"

పెళ్ళికొడుకునైన నేను పెళ్ళి కూతురివైన నీ మెడలో ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను.నీవు దీనిని ధరించి నా జీవితంలో అన్నింట సగభాగమై,నాకు తోడు నీడగా ఉంటూ మనమిద్ధరం నిండు నూరేళ్ళు కలిసి ఆనందంగా జీవిద్ధాం. అంటే పుణ్యస్త్రీగా ముత్తయిదువు గా జీవించు అని స్పష్టముగా మంత్ర భావం తెలుస్తుంది.ఈ మంగళ సూత్రంలో స్త్రీ శారీరక,మానసిక రక్షణ కోరకు ముత్యం,పగడం వాడతారు.వీటి ప్రయోజనం ఎలా ఉందో అని పరిశీలిస్తే తెలుస్తుంది.

The importnace of Mangala Sutra, Sacred thread

మన పూర్వీకుల నుండే మంగళ సూత్రంలో తప్పక ముత్యం,పగడం ధరించిన పాత తరం స్త్రీలలో వారు సంతానం కనే సమయంలో ఆపరేషన్ లేకుండానే సహజ సిద్ధంగా పిల్లలను కనేవారు.ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం,కాని ప్రస్తుత కాలంలో స్త్రీలలో కానుపు సిజేరియన్ ఆపరేన్ తోనే జరగటం సర్వసాధారణమైపోయింది.ఈ ముత్యం,పగడం వల్ల ప్రయోజానాలను చూద్దాం.

ముత్యం,పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ శరీర భాగం లోని అన్ని నాడీ కేంద్రములను ఉత్తేజపరచి శారీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాల వలన ఆరోగ్య పరంగా స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనటం ఎటువంటి సందేహం లేదు.
కనుక చంద్ర,కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభఫలితాలు అందిస్తాయి.

స్త్రీలకు కుజ గ్రహ ప్రభావ వలన అతికోపం, కలహాలు,మొండితనం ,సామర్ధ్యము, రోగము,ఋణపీడలు, అగ్ని, విద్యుత్ భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషములు మొదలగునవి ఏర్పడతాయి.

ఖగోళంలో ముఖ్యమైనవి 27 నక్షత్రాలు.ఈ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారం చేసి 28వ రోజున

కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతు సమయం అవుతుంది.ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుశ్రవం కావాలి.
భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళ సూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు,దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది,

సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యుల వారు మంగళ సూత్రానికి విశేష విశిష్టత కల్పించారు.

మంగళ సూత్రంలో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకు అంటే ముత్యం చంద్ర గ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు,అన్యోన్య దాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భదారణ, ప్రసవములకు కారకుడు.
పగడం కుజగ్రహనికి ప్రతీక.

పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ నడుస్తున్న కాలంలో ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి. భారతదేశంలో పిండారీలు,ధగ్గులు అనే కిరాత జాతులవారు మన దేశానికి వలసవచ్చారు.వీరు ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొనిపోయేవారు.మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. అంతటి కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు.అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడిందీ మంగళసూత్రం.అందుకే ఆకాలంలోని సామాజిక పరిస్థితుల కారణంగా ఏ ఇంట్లో అయిన ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి మాంగల్యం వేసేవారు,రక్షింప బడుతుందనే భావంచేత చిన్నతనంలోనే పెళ్లిలు జరిగాయి.

"మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మ్రింగుమనే సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో!"

పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవి గా ఉన్నడంటే అది ఆయన గొప్ప కాదట,పార్వతీ దేవి మెడలో ఉన్న ఆ మంగళ సూత్ర మహిమే అని పురాణాల ద్వార తెలుస్తుంది.

ప్రస్తుత కాలంలో మనదేశ స్త్రీలు ఎక్కువ శాతం ఎందుకు పనికిరాని ఉపయోగంలేని విదేశీ సాంప్రదాయ మోజులో పడి సనాతనమైన,ప్రయోజనకరమైన మనదేశ సాంప్రాదాయ ధర్మాన్ని మరచి అనారోగ్య బారిన పడుతున్నారు.డేలివరీలకు సర్వసాధారణంగా సీజేరియన్ ఆపరేషన్ లేనిది పిల్లలను కనటం లేదని మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.

శాస్త్రీయ సాంప్రదాయ పరంగా ఆరోగ్య పరంగా,జ్యోతిష పరంగా మంగళసూత్రాలు, మట్టేలు, బొట్టు,గాజులు అనేవి స్త్రీని అన్ని విధాలుగా కాపాడుతూ,చక్కటి దేహాకాంతితో ఆరోగ్యకరమైన సంసార జీవనాన్ని కొనసాగించేలా చేస్తాయి.ఇవి లేకుండా ఉండటం ఎంత మాత్రం ఆరోగ్యదాయకం కాదు,ఏ విధంగా చూసినా మంచిది కాదు.విలువలు తెలియని వివాహాలు విడాకుల వరకు తీసుకు వెలుతాయి,సాంప్రదాయ సంస్కారంలేని కుటుంబంలో కలతలు చోటు చేసుకుంటాయి.సాంప్రాదాయాన్ని కాపాడుదాం సంతృప్తిగా జీవిద్దాం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer explained the importance and meaning of Magala sutra, the sacred thread, weared by women in Hindu tradition.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి