ఈరాశివారు చివరి 8 నెలలు కుబేరులే!

ఈరాశి వారు ఈ సంవత్సరం స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది

ధనస్సు రాశి వారికి ఏప్రిల్ 22 వరకు గురువు నాలుగో స్థానమైన మీనరాశిలో ఉంటాడు. తర్వాత 5వ స్థానమైన మేషరాశిలోకి ప్రవేశించి ఏడాదిపాటు ఇదే స్థానంలో సంచరిస్తాడు.

 ఈ ఏడాది అనుకూలం

ఈ ఏడాది అనుకూలం

ధనస్సు రాశివారికి ఈ ఏడాది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మొదటి నాలుగు నెలలు కొంత ఇబ్బంది పడినప్పటికీ తర్వాత వచ్చే ఎనిమిది నెలలు మీకు డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఏలిన నాటి శని పూర్తవడంవల్ల కొంతకాలంగా వేధిస్తోన్న ఆర్థిక సమస్యలు తొలగుతాయి. శని మూడో ఇంటిలో గోచరించడంవల్ల స్థిరాస్తులు, వారసత్వ ఆస్తుల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. 12వ ఇంటిపై శని దృష్టి ఉండటంతో ఖర్చులు పెరుగుతాయి.

స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు

స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు


ఈరాశి వారు ఈ సంవత్సరం స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు ఆదాయాన్ని మించిన ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో గురువు గోచారం నాలుగో ఇంటిలో సంచరించడంవల్ల అంతా అనుకూలంగా ఉండదు. ఏప్రిల్ తర్వాత నుంచి వీరికి బాగుంటుంది. గతంలో చేసిన అప్పులు, లోన్లు అన్నీ తిరిగి తీర్చాల్సి వస్తుంది. దీంతో బంధువులు, తోబుట్టువుల సాయం తీసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి గురు గోచారం అనుకూలంగా రావటంతో ఆదాయంలో అభివృద్ధి సాధ్యమవడంతోపాటు కోర్టు కేసులు, ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవడం వల్ల ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది.

షేర్ మార్కెట్ లో లాభం పొందుతారు

షేర్ మార్కెట్ లో లాభం పొందుతారు


గురువు 5వ ఇంటిలో సంచరించడంవల్ల షేర్ మార్కెట్ తోపాటు ఇతర పెట్టుబడుల ద్వారా కానీ లాభం పొందుతారు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఉద్యోగంలో అభివృద్ధి ద్వారా ఆదాయం పెరుగుతుంది. రాహు గోచారం అక్టోబరు చివరి వరకు ఉంటుంది. దీనివల్ల పెట్టే పెట్టబడుల్లో కొంత శాతం ఇతరుల మాటలవల్ల ప్రలోభానికి గురయ్యే అవకాశం ఉంటుంది. రాహువు 5వ ఇంటిలో ఉండటంద్వారా తొందరపడి ఇతరుల మాటలకు లొంగకుండా స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకొంటుండాలి. రాహువు 4వ ఇంటిలో గోచరించడంవల్ల స్థిరాస్తి వ్యవహారాలు, వాహనాల కారణంగా డబ్బు ఖర్చుచేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+