6వ సంఖ్య అదృష్ట సంఖ్యగా గల జాతకుల జీవితం

Posted By:
Subscribe to Oneindia Telugu

అదృష్ట సంఖ్య 6 ఉన్నవారికి శుక్రుడు అధిపతి. ఏ నెలలోనైనా, సంవత్సరములో నైనా 6, 15, 24 తేదీలలో పుట్టిన స్త్రీ పురుషులంతా శుక్రజాతకులు. 6వ సంఖ్యకు శుక్రుడు అధిపతి. వీరంతా 6వ సంఖ్యకు చెందినవారు.

6వ సంఖ్యలో పుట్టిన శుక్రజాతకులు అందంగా ఉంటారు. మాగ్నెట్‌ వలె ఇతరులను వారి వైపు ఆకర్షించే శక్తి వారికి ఉంటుంది. ఎలాంటి వారినైనా ఇట్టే ఆకర్షించగలరు. భగవంతుడు వారికి ఇచ్చిన ప్రత్యేకమైన శక్తి.
6వ సంఖ్య శుక్రజాతకులు అందానికి దాసోహం అంటారు.

అందమైన వస్తువులు, విలాసవంతమైన వస్తువులు, విలాసవంతమైన జీవితం, వాతావరణంను కోరుకొంటారు. వీరు ఇతరులను ప్రేమిస్తారు. ఇతరులు వీరిని ప్రేమిస్తారు. ఈ 6వ సంఖ్య వారు వారి ప్రేమ కొరకు కట్టుబడి ఉంటారు. ప్రేమ, విలాస జీవితం కొరకు ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తారు. అందమైన సుఖమైన జీవితం కోరుకుంటారు. సుఖపడాలన్నదే వారి ధ్యేయం.

The lofe of the persons having 6 as lucky number

ప్రేమ కొరకు త్యాగం చేయగలరు. ఈ 6వ సంఖ్య వారు 3,9 సంఖ్యల వారితో స్నేహం చేస్తారు. 3,6,9 సంఖ్యల వారి మధ్య స్నేహం ఉంటుంది. అభిప్రాయాలు కలుస్తాయి. కలిసి ఉండగలరు. 6వ సంఖ్య వారి ప్రేమ తల్లి ప్రేమవంటిది. పూర్తి సదుద్దేశంతో అభిమానిస్తారు. శృంగార జీవితం పై మక్కువ వీరికి. అందమైన వస్తువులు కోరుకొంటారు. గృహాన్ని చాలా బాగా అలంకరించుకొంటారు. ఇల్లు స్వర్గంలా ఉండాలన్నదే వారి ఆశ.

మంచి ధనవంతులు అవుతారు. కళల యందు అభిరుచి ఉంటుంది. కవిత్వం, సాహిత్యం పై అభిమానం, ఉంటుంది. మంచి స్నేహం కోరుకొంటారు. స్నేహం కోసం ఖర్చు చేస్తారు. స్నేహం కోసం తాపత్రయ పడతారు. స్నేహితులను సంతృప్తి పరచటాన్కి ప్రయత్నిస్తారు. అయితే వీరు శ్రమ చేయలేరు. వీరిలో ఈర్ష్య ఉంటుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer described How they lead life, the the persons having 6 as lucky number.
Please Wait while comments are loading...