వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శకునాలు-నమ్మకాలు: వాటి ప్రభావం ఎలా ఉంటుంది?

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్:మనుషుల ఆచార వ్యవహారాల విషయంలో, శకునాల పాత్ర ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.ఈ శకునాలు రెండు రకాలుగా భావించవచ్చు. శుభ శకునాలు, అశుభ శకునాలు అని. ఏ పని ప్రారంభించినా శుభ శకునం చూసుకొని ప్రారంభించాలి. అశుభ శకునం ఎదురైతే ఆ పని అసంపూర్ణంగా ముగుస్తుందని పూర్వ కాలం నుంచి ఆధునిక కాలం వరకు నమ్మకం ఉంది.

మంచి శకునం ఎదురు రావడం వలన, తలపెట్టినకార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతుందని పురాతన కాలం నుండి వస్తున్న విశ్వాసం ఇప్పటికీ కొనసాగుతుంది. శకునం విషయంలో చాలామంది తమ పెద్దల మార్గాన్నే అనుసరిస్తూ ఉంటారు. వ్యాపార వ్యవహారాల నిమిత్తం శుభకార్యాల నిమిత్తమై బయలుదేరుతూ ఉన్నప్పుడు మంచి శకునం చూసుకుంటూ ఉండాల్సిందే.

మంగళప్రదమైన ధ్వనులు ... శుభప్రదమైన వస్తువులు ఎదురైనప్పుడు మంచి శకునాలుగా భావించి అడుగుబయటికి పెట్టాలి.

The story about beliefs of shakunalu

అలాగే కొన్ని శకునాలు కార్యహానిని కలిగించేవిగా చెప్పబడుతున్నాయి. ఇంట్లో నుంచి అడుగు బయటికి పెడుతూ వుండగా ఎక్కడి నుంచైనా ఒక్కసారిగా ఏడుపులు వినిపించినా, ఏదో ఒక కారణంగా ఎవరైనా ఏడుస్తూ ఎదురుగా పరిగెత్తుకు వచ్చినా అది కార్య హానిని కలిగించే శకునంగా చెప్పబడుతోంది. అందుకే అలాంటి శకునం ఎదురైనప్పుడు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని శాస్త్రం చెప్పబడుతోంది.

శుభ శకునాలు

పెళ్ళి ఊరేగింపు, మంగళవాయిద్యములు, ఇద్దరు బ్రాహ్మణులు, దండధరుడగు శూద్రుడు, కన్య, ముతైదువు, పండ్లు, పువ్వులు, ఛత్రచామరములు, ఏనుగు, గుఱ్ఱము, పూర్ణకుంభము, చెఱుకు, పాలు, అన్నము, పెరుగు, ఆవు, బియ్యము, కల్లుకుండ, మాంసము, పొగలేని నిప్పు, తేనె, చలువ వస్త్రాలు, అక్షతలు, వీణ, మృదంగం, శంఖం, నల్లకోతి, భ్రమరము, తెల్లని వస్తువులు, కుక్క చెవి విదల్చుట, వధూవరులు, ఘంటానాదం, జయశబ్దము, మంగళ వస్తువులు, ఎదురుగా మృదువైన శీతల వాయువులు వీచుట లేదా వెనుక నుంచి ప్రయాణానికి అనువైన గాలులు వీచుట, తెల్లని వృషభము, అద్దం మొదలైనవి ఎదురుపడిన శుభప్రదం.

పశుపక్ష్యాదుల్లో నెమలి, కోడి, చిలుక, కొంగ, కుందేలు, నక్క, గ్రద్ద, ఆవు, జింక, ఉడుత, చిరుత వంటివి ఎడమ నుంచి కుడి వైపుగా వెళ్ళాయంటే వీటన్నిటిని శుభ శకునాలుగా గుర్తించవచ్చు.

అశుభ శకునాలు

ఏడుపు వినుట, అకాల వర్షము, ముక్కు చీదుట, బల్లిపడుట, వితంతువులు, జుట్టు విరబోసుకున్నవారు, జుట్టులేనివారు, ఒకే తుమ్ము, ఊక, కలహము, చెడుమాట, ముగ్గురు వైశ్యులు, జంటశూద్రులు, కషాయబట్టలు కట్టినవారు, పాము, కొత్తకుండ, నూనె, కట్టెలమోపు, ముష్టివాడు, కుంటికుక్క, ముక్కులేనివాడు, గుడ్డివాడు, రోగి, కుంటివాడు, రజస్వల, గర్భిణీస్ర్తీ, ఉప్పు, బొగ్గులు, రాళ్ళు, ఆమేధ్యం, నువ్వులు, మినుములు, గొఱ్ఱెలు, నపుంసకులు, పిల్లి, పంది, దూది, మజ్జిగ, బూడిద, కురూపి, చెడు జంతువులు, ఆయుధమును ధరించినవాడు, విరోధి,వెళ్ళవద్దని కోరుట, భోజనము చేయమని అడుగుట, సిద్ధవస్తువులు, జారుట, దెబ్బతగులుట, తొట్రుపడుట, మనసు కీడు శంకించుట, ఆరోగ్యము లేకుండుట, గుడ్లగూబ అరచుట వంటి పరిణామాలు ఎదురుపడినా ఇవన్నీ అశుభాలే.

అశుభ శకునాలు ఎదురైన వెంటనే ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని 12 పర్యాయాలు నీళ్ళు పుకిలించి ఊయవలెను. తలపై నీరు చల్లుకొని. కళ్ళు నీళ్ళతో తుడుచుకొని కూర్చుని కాసిన్ని నీళ్లు తాగి ఇష్ట దైవంను ప్రార్థించి తర్వాత మరొక శుభ శకునమును చూసుకొని ప్రయాణం చేయవలెను. ప్రయాణాలకు బయలుదేరునప్పుడు 'ఎక్కడికి?' అని గానీ, 'ఎప్పుడు వస్తావు?' అని గానీ, 'నేనూ రానా?' అని గానీ ఎవరూ అడుగరాదు. ప్రయాణమై వెళ్ళిన వెంటనే ఇల్లు కడుగుట, ఇల్లాలు తలస్నానం చేయుట దరిద్రానికి కారణాలు అవుతాయని పెద్దలు అంటారు.అందుకే ఇలాంటి విషయాల్లో తగిన జాగ్రత్తతో ఉండటమే మంచిది అని మన పెద్దల సూచనలు వినిపిస్తుంటాయి.

English summary
The story about beliefs of shakunalu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X